![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 18th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: చారుకేశవకి ఎదురు తిరిగిన లక్ష్మీ.. చీకట్లో లక్ష్మీతో మాట్లాడిన విహారి, లక్ష్మీ ఎమోషనల్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode చారు కేశవ లక్ష్మీ దగ్గరకు వచ్చి వెళ్లిపోమని బెదిరించడం లక్ష్మీ ఎక్కడికీ వెళ్లనని చెప్పడం ఇంతలో విహారి రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
![Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 18th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: చారుకేశవకి ఎదురు తిరిగిన లక్ష్మీ.. చీకట్లో లక్ష్మీతో మాట్లాడిన విహారి, లక్ష్మీ ఎమోషనల్! kalavari kodalu kanaka mahalakshmi serial today october 18th episode written update in telugu Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 18th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: చారుకేశవకి ఎదురు తిరిగిన లక్ష్మీ.. చీకట్లో లక్ష్మీతో మాట్లాడిన విహారి, లక్ష్మీ ఎమోషనల్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/18/cd2c696d87d98bcff48c46dd591687af1729227264568882_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode ఈ సారి ఏ ఆటంకం లేకుండా నిశ్చితార్థం జరిపిస్తానని మాట ఇవ్వమని సహస్ర అడుగుతుంది. దానికి నన్ను నమ్మవా అని యమున అంటే నేను ఎవరినీ నమ్మను నా చేతిలో చేయి వేసి చెప్పమని అంటుంది. దాంతో యమున సహస్ర చేతిలో చేయి వేసి ఎలాంటి ఆటంకం రాదని ఈ సారి నా ప్రాణం పోయినా నీకు విహారికి నిశ్చితార్థం జరుగుతుందని అంటుంది.
లక్ష్మీ: మనసులో.. ఈ పెళ్లి జరగాలి అంటే నాకు విహారి బాబుకి జరిగిన పెళ్లి ఎప్పటికీ బయట పడకూడదు. యమునమ్మ లాంటి మంచి మనిషిని నేను కష్టపెట్టకూడదు.
యమున: ఇప్పుడు అయినా నీకు సంతోషమేనా.
సహస్ర: ఇప్పుడైనా సంతోషపడటానికి ఏముంది అత్తయ్య. ఎవరు ఎలాంటి ఆటంకం కలిగిస్తారో తెలీదు.
కాదాంబరి: చూడు యమున ఈ సారి అయినా మాట నిలబెట్టుకో నీ మీద కోపం కొంచెం అయినా తగ్గుతుందేమో.
లక్ష్మీ: అమ్మా ఈ సారి నిశ్చితార్థం ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందని నాకు అనిపిస్తుంది. మీరు కూడా అదే నమ్మకంతో ఉండండి.
యమున: నమ్మకం ఉంటే సరిపోదు కదా లక్ష్మీ. జరుగుతున్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి.
చారుకేశవ: (లక్ష్మీ రాత్రి ఆరు బయట పిండి కలుపుకుంటుంటే) ఏంటి ఇందాక పండుతో ప్రవచనాలు చెప్తున్నావ్. ఎవరి గురించి నా గురించేనా. చేతిలో చేయి వేసి ఒట్టు వేసి చెప్తున్నావ్ ఏంటి సంగతి. ఏయ్ నిన్నే అడిగేది నా గురించే కదా. ఈ ఇంటి అల్లుడు ఎందుకు పనికి రాని వెధవ, చవట అమ్మాయిల బంగారం ఎత్తుకెళ్లే పనికిమాలినోడు అని చెప్తున్నావ్ కదా.
లక్ష్మీ: మీ గురించి లేని పోనివి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలిసినవి చెప్తే చాలు ఈ ఇంటి నుంచి మిమల్ని గెంటేస్తారు. అయినా ఇందాక మీరు చెప్పినవన్నీ కరెక్టే కదా. తగిలించాల్సిన అవసరం ఏముంది.
చారుకేశవ: అంటే నా గురించి నిజాలు చెప్పాలన్న ఆసక్తి, ఉత్సాహం రెండూ నీకు ఉన్నాయన్న మాట.
లక్ష్మీ: నాకు ఆశ్రయం ఇచ్చిన ఈ ఇళ్లు నాకు దేవాలయం. అందువల్ల ఈ ఇంట్లో ఉన్న ప్రతీ మనిషి సంతోషంగా ఉండాలి అనుకుంటా మీరు ఈ ఇంటి అల్లుడు వసుధమ్మ సంతోషం కోసం మిమల్ని వదిలేస్తున్నా. మీ గురించి ఒక్క మాట చెప్పినా కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. అందుకే మీ గురించి ఈ ఇంట్లో చెప్పాలన్న ఆలోచన నాకు రాదు. ఇష్టం లేదు కూడా కానీ మీరు లేని పోనివి ఊహించుకొని నన్ను బెదిరిస్తున్నారు.
చారుకేశవ: నన్ను చూసి భయపడే దగ్గర నుంచి నా వైపు చూసి మాట్లాడే ధైర్యం ఎలా వచ్చింది.
లక్ష్మీ: ఈ ప్రపంచంలో అందరిని ఎదుర్కొడానికి ధైర్యం తప్పనిసరి.
చారుకేశవ: లేని ధైర్యం తెచ్చుకొని నాలుగు మాటలు మాట్లాడేస్తే నేను భయపడతాను అనుకుంటున్నావా. నీ లాంటి వాళ్లని ఎంత మందిని చూసుంటాను. చూడు నిన్ను చంపడం నాకు పెద్ద పని కాదు కానీ ఆలోచిస్తున్నాను. ముందు నీలో ధైర్యం చంపేస్తా తర్వాత నిన్ను.
విహారి అటు వైపు వస్తుంటాడు. లక్ష్మీని పిలుస్తాడు. ఇక లక్ష్మీ తప్పులు చేసిన మీరు ధైర్యంగా తిరుగుతుంటే ఏ తప్పు చేయని నేను ఎందుకు భయపడాలి అంటాడు. ఇక విహారి లక్ష్మీని పిలవడం చారుకేశవ, లక్ష్మీ ఇద్దరూ వింటారు. చారు కేశవ పారిపోతాడు. లక్ష్మీ వెనక్కి తిరిగి నిల్చొంటే విహారి దగ్గరకు వస్తాడు. లక్ష్మీ వెనకాలే విహారి నిల్చొంటాడు. చారుకేశవ చాటుగా చూస్తాడు. విహారి లక్ష్మీని తన వైపునకు తిరగమంటాడు. లక్ష్మీ తిరిగే సరికి కరెంట్ పోయి విహారికి ముఖం కనిపించదు. తన తల్లిని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు.
కృతజ్ఞత అవసరం లేదని ఆమెకు జీవితాంతం సేవ చేసుకుంటానని అంటుంది. థ్యాంక్స్ చెప్తూ లక్ష్మీకి చేయి అందిస్తాడు. ఇక ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని అడగమని అంటాడు. ఇక విహారి వెళ్లిపోతాడు. అప్పుడు కరెంట్ వస్తుంది. లక్ష్మీ విహారి స్పర్శకి ఎమోషనల్ అవుతుంది. అన్నీ బాగుండుంటే మీ భార్యగా ఉండే అదృష్టం ఉండేదని ఏడుస్తుంది. ఉదయం యమున పంతులుని పిలిచానని మళ్లీ ముహూర్తం పెట్టించడానికి పిలిచానని భక్తవత్సలానికి చెప్తుంది. పద్మాక్షి, అంబిక అక్కడే ఉంటారు దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)