Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 8th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారికి యాక్సిడెంట్.. రక్తపు మడుగులో భర్తని చూసి కన్నీరు మున్నీరైన లక్ష్మీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారికి యాక్సిడెంట్ అవ్వడం హాస్పిటల్‌లో విహారిని రక్తపు మడుగులో చూసి లక్ష్మీ షాక్ అవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి కారు బ్రేకులను అంబిక, సుభాష్ కట్ చేసేస్తారు. విహారి బ్రేక్ వేసి బ్రేక్ పడకపోవడంతో కంగారు పడతాడు. మరోవైపు కారులో స్వామిజీకి ఇవ్వాల్సిన పూలు పళ్లు ఉండిపోవడం భక్తవత్సలం లక్ష్మీకి ఇచ్చి స్వామీజీకి ఇవ్వమని చెప్తారు. లక్ష్మీ స్వామిజీకి ఇస్తే అమ్మవారి పాదాల ముందు పెట్టమంటారు.
స్వామీజీ: నీ గుండెల మీద ఉన్న తాళి అనే బరువు ఎవరికీ కనిపించకపోయినా నా చూపుల నుంచి మాత్రం తప్పించుకోలేదు. నీ పెళ్లి అనే రహస్యం నా దివ్య దృష్టికి తెలీకుండా దాచలేవు. నీకు విహారికి కల్యాణం జరిగిందని నాకు అర్థమైంది. ఆ అబ్బాయి జీవితం బాగుండాలి అన్నా అతను క్షేమంగా ఉండాలి అన్నా నీ చేతుల్లోనే ఉంది. అతను తాళి కట్టిన నువ్వే ఈ కుంకుమాభిషేకం వ్రతం చేయాలి.
లక్ష్మీ: అందరూ విహారి గారికి మరో అమ్మాయితో పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. ఆ పెళ్లితో రెండు కుటుంబాలు కలపాలి అనుకుంటున్నారు. నాకు ఆయనకు జరిగిన పెళ్లి బొమ్మల పెళ్లి.
స్వామీజీ: ఆ పెళ్లి మీ ఇద్దరి జాతకాలతో ముడి పడిన పెళ్లి దాన్ని నువ్వు కాదు అనుకున్న అమ్మవారు మీ రాతల నుంచి చెరపదు. నువ్వు అవునన్నా కాదన్నా అతని భార్యవి నువ్వే. ఆ 9 రోజుల కుంకుమార్చన వ్రతం నువ్వే చేయాలి లేదంటే అనవసరమైన అనార్థాలు చూడాల్సి వస్తుంది.
మరోవైపు విహారికి యాక్సిడెంట్ అవుతుంది. అది స్వామీజీ దివ్య దృష్టితో చూస్తారు. అక్కడే ఉన్న కొందరు విహారిని చూస్తారు. మరో వైపు రాజీ కనక మహాలక్ష్మీకి కాల్ చేసి హైదరాబాద్ వచ్చామని పెద్దనాన్నకి చాలా టెస్టులు చేస్తున్నారని డాక్టర్లని చూస్తే ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. కంగారు పడొద్దని రాజీ అంటుంది. తండ్రికి ఏం కాకూడదని లక్ష్మీ ఏడుస్తుంది. ఇక సహస్ర, పద్మాక్షి హాల్‌లో కూర్చొని ఉంటారు. యమున వాళ్లు వస్తారు. స్వామీజీ ఏం చెప్పారని అడుగుతారు. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. విహారికి రాబోయే రోజులు అంతగా బాలేవని చెప్పారని యమున చెప్తుంది. దాంతో పద్మాక్షి ఇదో కొత్త నాటకమా అని అంటుంది. ఇక పూజ గురించి చెప్తారు.
పెళ్లి అయిన వాళ్లు చేయాల్సిన పూజ పెళ్లి కాకుండా సహస్ర ఎలా చేస్తుందని అడుగుతుంది. దాంతో నాకు అదే అనుమానం వచ్చింది స్వామీజీకి ఈ పాటికే పెళ్లి గడియలు దాటిపోయాయని తన భార్యతో పూజ చేయించమని అన్నారు నాకు అర్థం కావడం లేదు అని అంటాడు. విహారి బాబుకి లక్ష్మీమ్మకి ఎప్పుడో పెళ్లి అయిపోయిందని పండు మనసులో అనుకుంటాడు. విహారి దొంగ పెళ్లి చేసుకున్నాడా ఏంటి అని పద్మాక్షి అంటుంది. ఆ స్వామీజీ అలా చెప్పారంటే కాస్త తొందర పడాలని తొందరగా పెళ్లి చేసేద్దామని అంటుంది కాదాంబరి. విహారికి ఒప్పించాలని అంటుంది. భక్తవత్సలం కూడా అదే అంటారు.
ఇక హాస్పిటల్‌లో రాజీ ఉండగా కనకం, విహారి పెళ్లి ఫొటోలను ఫొటో గ్రాఫర్ ఇస్తాడు. రాజీ ఆ ఫొటోలు చూస్తుండగా ఒక ఫొటో కింద పడిపోతుంది. రాజీ గమనించదు. ఇక ఆ ఫొటోలు తీసుకెళ్లి గౌరీ, ఆదికేశవ్‌లకు చూపిస్తుంది. ఇద్దరూ చూసి మురిసి పోతారు. ఇక కనకం హాస్పిటల్‌కి వస్తుంది. తల్లిదండ్రుల్ని చూసి దగ్గరకు రాలేకపోతున్నానని ఏడుస్తుంది. ఫొటోలు చూసి ఆదికేశవ్ ఎమోషల్ అవుతాడు. అది చూసి కనకం నా భర్తకి మరో అమ్మాయితో పెళ్లి అవుతుందని తెలిసి నాన్న ఎలా తట్టుకోగలడు అనుకుంటుంది. ఇంతలో విహారిని అదే హాస్పిటల్‌కి తీసుకొస్తారు. కనకం పక్కనుంచి తీసుకెళ్లినా చేయి తగులు తుంది కానీ చూడదు. తర్వాత విహారిని చూసి రక్తంలో ఉన్న విహారిని చూసి ఒక్కనిమిషం అని అరిచి పరుగులు తీస్తుంది. విహారిని ఆ పరిస్థితిలో చూసి పెద్దగా అరుస్తూ ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: కరెంట్ షాక్ కొట్టి కాకిలా అయిపోయిన భైరవి.. మైత్రి ఇక విమానం ఎక్కాల్సిందే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

