Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 7th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారికి పెళ్లి అయిపోయిందని చెప్పిన స్వామీజీ.. విహారి కారు బ్రేక్‌లు ఫెయిల్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి జాతకం చూసిన స్వామిజీ విహారికి ముందే పెళ్లి అయిపోయిందని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి మీటింగ్‌కి రాకూడదని అందుకు విహారి కారు బ్రేక్‌లు తీసేయమని అంబిక సుభాష్‌తో చెప్తుంది. అంబిక అక్కడే నిల్చొంటే సుభాష్ కారు కింద దూరి బ్రేక్ వైర్ కట్ చేస్తుంటాడు. ఇంతలో చారుకేశవ అక్కడికి వస్తాడు. అంబిక ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది ఎవరి కొంప ముంచబోతుందని అనుకొని అంబిక దగ్గరకు వెళ్తాడు.
చారుకేశవ: అంబిక ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావ్.
అంబిక: చల్లగాలి కోసం వచ్చాను బావ.
చారుకేశవ: ఈ చలికాలంలో చల్లగాలా రీజన్ కరెక్ట్‌గా లేదు అంబిక అప్పటికప్పుడు ఏదో అబద్ధం చెప్పాలి అని ఇలా చెప్పినట్లున్నావ్. నీ మాట తీరు ఏదో తేడాగా అనిపిస్తుంది.
అంబిక: దొంగోడిలా నీకు ఇంత కంటే గొప్ప ఆలోచనలు వస్తాయని నేను కూడా అనుకోవడం లేదు. ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావ్.
తన దొంగ బుద్ధిని అంబిక పసిగట్టేసిందేమో అని చారుకేశవ అనుకొని కాలిని కిందకి బలంగా కొడతాడు. దాంతో అక్కడే కారు కింద ఉన్న సుభాష్ చేతి మీద కాలు ఉండటంతో సుభాష్ ఏం అనలేక చేయి అడ్డుపెట్టుకొని బాధపడతాడు. ఇక చారుకేశవ రేపు విహారి పెట్టనున్న మీటింగ్‌లో ఎవరి లోపాలు బయట పడతాయో అని అంబిక మీద సెటైర్లు వేస్తాడు. ఇక సుభాష్ చేయి మీద చారుకేశవ కాలు తీయకపోవడంతో సుభాష్ కారుని ఢీ కొట్టి సౌండ్ చేస్తాడు. చారుకేశవ కారు కిందకి చూడబోతే అంబిక ఆపుతుంది. ఇక సుభాష్ కారు బ్రేక్ వైర్ కట్ చేసేస్తాడు.
మరోవైపు భక్తవత్సలం, యమున, లక్ష్మీలు స్వామీజీ దగ్గరకు వెళ్తారు. విహారి, సహస్రల పెళ్లికి జరిగిన అవాంతరాలు చెప్తారు. విహారి జాతకాన్ని స్వామిజీకి ఇస్తారు. అది చూసిన స్వామిజీ విహారి జాతకంలో ఊహించని మలుపులు ఉన్నాయని చెప్తారు. అవన్నీ విహారి జీవితాన్ని కలవరపెట్టనున్నాయని చెప్తారు. ఇక యమున పరిష్కారం అడిగితే అమ్మవారికి కుంకుమార్చన వ్రతం చేయాలని చెప్తారు.
స్వామిజీ: మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయి తొమ్మిది రోజులు నియమ నిష్ఠలతో ఈ వ్రతం చేయాలి. తను ఎంత నిష్టగా చేస్తే అంత ఫలితం దక్కుతుంది. ఆ కుంకుమార్చన వ్రతమే మీ అబ్బాయికి రక్షగా మారుతుంది.
యమున: అబ్బాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి అంటున్నారు. కానీ మా విహారికి ఇంకా పెళ్లి కాలేదు స్వామిజీ.
స్వామిజీ: దివ్య దృష్టితో చూసి విహారి, లక్ష్మీలకు పెళ్లి అయినట్లు గుర్తిస్తారు. లక్ష్మీని చూసి షాక్ అవుతారు. కథ మొత్తం గ్రహిస్తారు. అమ్మవారు మీ అబ్బాయి జీవితంలో రాసిన రాతలో పెళ్లి రాతలు ఎప్పుడో దాటిపోయాయి. అతడి ఏడు అడుగుల ప్రయాణంలో పెళ్లి మజిలీ దాటిపోయింది. వెళ్లి మీ అబ్బాయి పెళ్లి చేసుకున్న అమ్మాయితో ఈ కుంకుమార్చన వ్రతం చేయించండి.
యమున: మనసులో విహారి పెళ్లి చేసుకున్న సహస్ర గురించి చెప్తున్నారు అనుకుంటా.
విహారి కారులో బయటకు వెళ్తాడు. ఇక ఆదికేశవ్ తనని ఇన్ని రోజులు ఎందుకు హాస్పిటల్‌లో ఉంచేశారని రాజీని అడుగుతాడు. గౌరీ భర్తకి సర్ది చెప్తుంది. ఇక పక్కన ఓ పేషెంట్ ఉంటే ఏమైందని ఆదికేశవ్ అడుగుతాడు. దాంతో కూతురికి అమెరికా సంబంధం చేశారని అల్లుడు, కూతురికి పడక కూతురు సూసైడ్ చేసుకోవడంతో తల్లికి హార్ట్‌ఎటాక్ వచ్చిందని అనడంతో ఆదికేశవ్ కనక మహాలక్ష్మీని గుర్తు చేసుకొని ఆలోచనలో పడతాడు. మరోవైపు విహారి కారుకి బ్రేకులు పడవు. విహారి కంగారు పడతాడు. ఇక భక్తవత్సలం, యమునలు విహారికి పెళ్లి అయిపోయిందని అంటున్నారేంటి అని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్యతో మసాజ్ చేయించుకోవాలని క్రిష్ తంటాలు.. కోడలికి షాక్ కొట్టించాలని భైరవి ప్లాన్!