Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today November 27th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి టెండర్ కొటేషన్ కొట్టేసిన అంబిక.. అండర్ కవర్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన లక్ష్మీ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారిని ద్రోహం చేయడానికి అంబిక ప్రాజెక్ట్ టెండర్ కొటేషన్ నొక్కేయడం లక్ష్మీ చూపి కొత్త కొటేషన్ సిద్ధం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది,
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి కోపమవడంతో అంబిక సారీ చెప్పి వెళ్లిపోతుంది. అంబిక తరఫున విహారి లక్ష్మీకి సారీ చెప్తాడు. పర్లేదని లక్ష్మీ వెళ్లిపోతుంది. కొంచెం ఆలస్యం చేసుంటే విహారి ఆస్తులన్నీ పోయేవని విహారి ఆస్తులు, కంపెనీలు అంబిక చేతికి వెళ్తే అంబిక విహారి, యమునల్ని ఇంటి నుంచి గెంటేస్తుందని అనుకుంటుంది. విహారిని, యమునని కాపాడటానికి తాను ఇంట్లో ఉండాల్సిందే అని ఫిక్స్ అవుతుంది.
మరోవైపు సహస్ర తన ఫ్రెండ్‌తో మాట్లాడి జరిగిన విషయం గురించి చెప్పి బాధ పడుతుంది. సహస్రకు తన ఫ్రెండ్ ధైర్యం చెప్తుంది. విహారిని తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్తుంది. ఇక విహారి సహస్ర దగ్గరకు వస్తాడు. తన మీద చేయి ఎత్తినందుకు క్షమాపణ చెప్తాడు. దానికి సహస్ర లక్ష్మీ ముందు కొట్టాలని అనుకున్నందుకు బాధగా ఉందని అంటుంది.
సహస్ర: మీ ఇద్దరినీ అలా చూసే సరికి కోపం ఆపుకోలేకపోయాను బావ.
విహారి: కోపం అవసరం లేని చోట వాడితే లేని పోని అనర్థాలు వస్తాయి.
సహస్ర: ఇప్పుడు అర్థమైంది బావ సారీ. అని విహారిని హగ్ చేసుకొని ఏడుస్తుంది. బావ నేను పిచ్చి పని చేశానని నా మీద ప్రేమ తగ్గిపోదు కదా.
విహారి: ప్రేమ తగ్గిపోయే అంత తప్పు నువ్వు చేయలేదు సహస్ర కానీ మనసుకు గుచ్చుకునే ముళ్లులాంటి తప్పు చేశావ్ అందుకు నిన్ను చూసిన ప్రతీ సారీ అది చివుక్కున తగులుతున్న ఫీలింగ్ వస్తుంది.
సహస్ర: నిన్ను బాధ పెట్టాలని కాదు బావ కానీ నేను నా మనసులో బాధ ఉంటే బయటకు చెప్పేస్తా
విహారి: సరే సహస్ర చేసిన తప్పులు వదిలేసి వాటిని సరిదిద్దుకుందాం.
సహస్ర: సరే బావ లవ్యూ
విహారి: లవ్ యూ టూ.
సహస్ర: నీ మనసుకి నొచ్చుకునే పని నేను చేయను బావ కానీ ఆ లక్ష్మీని వదలను ఎంత త్వరగా దాని అడ్డుతొలగించుకుంటే అంత ప్రశాంతంగా ఉండొచ్చు.
విహారి హాల్‌లో కూర్చొని ప్రాజెక్ట్ టెండర్ కోడ్ చేస్తుంటాడు. ఇంతలో సత్య ఫోన్ చేసి ఎంతకి ప్రాజెక్ట్ కోడ్ చేశావని అంటే నేను చెప్పను కదా నీకు తెలుసు కదా అంటాడు. ఇక లక్ష్మీ విహారి దగ్గరకు జ్యూస్ తీసుకొని వస్తే విహారి టిఫెన్ కూడా చేయకుండా పని చేస్తున్నా థ్యాంక్స్ అని చెప్తాడు. ఇక టెండర్ గురించి లక్ష్మీతో మాట్లాడుతారు. లక్ష్మీకి కొంచెం చెప్పిన విహారి మొత్తం చెప్తే నీకు అర్థం కాదు చెప్పను ఏం అనుకోకు లక్ష్మీ అని అంటాడు. ఇంతలో అంబిక అక్కడికి వస్తుంది. మంచి కొటేషన్‌కే ఇచ్చుంటావ్ అందుకే నేను కొటేషన్ చెక్ చేయను అంటుంది. నా మీద నమ్మకం ఉన్నందుకు థ్యాంక్స్ అత్తా అని విహారి అంటాడు. ఇక విహారికి ఫోన్ రావడంతో బయటకు వెళ్తాడు. లక్ష్మీ కూడా వెళ్లిపోవడంతో అంబికి విహారికి తెలీకుండా టెండర్ పేపర్ల ఫొటోలు తీసుకుంటుంది. ఇక విహారి టెండర్ పేపర్లు తీసుకొని వెళ్తాడు.
అంబిక ఆ ఫోటోలను సుభాష్‌కి పంపిస్తుంది. తర్వాత సుభాష్‌కి కాల్ చేసి మాట్లాడుతుంది. అంబిక, సుభాష్ మాట్లాడుకోవడం లక్ష్మీ వింటుంది. గోల్డెన్ ప్రాజెక్ట్ కోసం పార్థసారధి, గోవింద్‌లు ఆ టెండర్ వ్యాల్యూని చెప్పి అంతకంటే తక్కువ వాళ్లు కోట్ చేస్తే విహారి ఓటమి ఖాయం అంటుంది. లక్ష్మీకి విషయం అర్థమవుతుంది. ఇక లక్ష్మీ అంబిక చూసే టైంకి దాక్కుంటుంది. విహారికి విషయం చెప్తే ఇళ్లు ముక్కలవుతుందని కానీ ఏం చేయాలని అనుకుంటుంది. పండు అడిగితే అంబిక విహారికి మోసం చేయాలని ప్రయత్నిస్తుందని విషయం చెప్తుంది. ఇక లక్ష్మీ విహారి చేసిన టెండర్ మిగతా పేపర్లను అక్కడే ఉన్న ల్యాప్ ట్యాప్ చూసి లెక్కలు మార్చి టెండర్ వ్యాల్యూ మార్చుతుంది. ల్యాప్ ట్యాప్ పట్టుకొని ఏవేవో చేస్తున్నావ్ కదా నీకు అంత చదువు వచ్చా అని అడుగుతాడు. అయినా లక్ష్మీ ఏం మాట్లాడకుండా లెక్కలు మార్చేస్తుంది. నువ్వు అండర్ కవర్ ఆఫీసర్‌లా ఉన్నావని పని మనిషిగా వచ్చి వాళ్ల ఆఫీసర్లకు విషయాలు చెప్తారు నువ్వే అంతేనా అని అడుగుతాడు. దానికి లక్ష్మీ భయపడకు పండు నా వెనక అంత స్టోరీ లేదని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపకి మల్లెపూలు ఇచ్చిన కార్తీక్.. దీపని చంపడానికి జ్యోత్స్న ప్లాన్!