Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 30th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ, విహారిల రొమాన్స్ చూసేసిన చారుకేశవ్.. లక్ష్మీ తండ్రితో సహస్ర వీడియో కాల్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం విహారి ఇద్దరూ రాత్రి లేటుగా రావడం పద్మాక్షి ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం, విహారి ఇద్దరూ రాత్రి ఆఫీస్ నుంచి కారులో వస్తుంటారు. చారుకాశవ్ వాళ్లని ఫాలో అవుతాడు. విహారి లక్ష్మీకి సీట్ బెల్ట్ పెట్టినట్లు ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇంతలో కనకం తండ్రి ఫోన్ చేయడంతో ఇద్దరూ తేరుకుంటారు. కనకం తండ్రి అమెరికాలో ఉన్నాం అనుకుంటారు కాబట్టి అతనికి అనుమానం రాకుండా ఫోన్‌లో బ్యాగ్రౌండ్ మార్చి ఇస్తాడు. త్వరగా మాట్లాడి వచ్చేయమని చెప్తాడు.
లక్ష్మీ వీడియో కాల్ మాట్లాడుతుంది. అమెరికా ఉన్నట్లు బ్యాగ్రౌండ్ కనిపిస్తుంది. విహారితో కలిసి ఫంక్షన్‌కి వెళ్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసేస్తుంది. మరోవైపు సహస్ర బావ లక్ష్మీ ఇంకా రాలేదు ఏంటి అని కంగారు పడుతుంది. అంబిక వచ్చి విహారి లక్ష్మీ రావాలి అని చూస్తున్నావా..దాన్ని కట్ చేయాల్సినప్పుడు చేయకుండా ఇంత వరకు తెచ్చుకున్నావ్ అంటుంది. ప్రెజంటేషన్ సక్సెస్ అయి నువ్వే వీ క్రాఫ్ట్‌కి ఎండీ అవ్వాలి అని సహస్రకు అంబిక చెప్తుంది. తన టార్గెట్ కూడా అదే అని సహస్ర అంటుంది.
లక్ష్మీ ఫోన్ మాట్లాడి వస్తుంటే కాలు స్లిప్ అవుతుంది. విహారి లక్ష్మీని కారు దగ్గరకు తీసుకెళ్లి కూర్చొపెట్టి కాలు పట్టుకొని సపర్యలు చేస్తాడు. చారుకేశవ్ అదంతా చూసి షాక్ అయిపోతాడు. ఫోన్‌లో ఫొటోలు తీస్తాడు. మనద్దరం కలిసి ప్రయాణం మొదలు పెట్టేశాం ముందుకు వెళ్లడం తప్ప ఇంకేం చేయలేం అంటాడు. ఇక సహస్ర అటూ ఇటూ తెగ తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ అడిగితే విహారి కోసం ఎదురు చూస్తుందని అంబిక అంటుంది. రాత్రి 9 అవుతుంది ఈ టైం వరకు రాకపోవడం ఏంటి అని పద్మాక్షి అంటుంది. కొత్త ప్రాజెక్ట్ మొదలు కూడా కాలేదు లక్ష్మీ కూడా ఎందుకు రాలేదు అని అంబిక అంటుంది. పని మనిషిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి నెత్తిమీద పెట్ట ఊరేగితే ఇలాగే ఉంటుందని అంటుంది.
చారుకేశవ్ ఇంటికి వస్తాడు. ఇంతలో లక్ష్మీ, విహారి కూడా వస్తారు. పద్మాక్షి విహారితో టైం ఎంత అయిందో తెలుసా అని అడుగుతుంది. కొత్తగా పెళ్లి అయింది కదా త్వరగా రావాలి కదా అని అంటుంది. చారుకేశవ మనసులో వాళ్లు ఏ పని మీద లేటుగా వచ్చారో తెలిస్తే వదిన తోలు తీసేస్తుంది. సహస్ర శివతాండవం ఆడేస్తుంది అని అనుకుంటాడు. పద్మాక్షి విహారితో నీ కోసం ఇంట్లో ఎదురు చూసిన వాళ్లు ఉంటారు. నువ్వు రాలేదని అది కంగారుగా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది అని అంటుంది. సహస్ర విహారిని తీసుకెళ్లిపోతుంది. లక్ష్మీతో పద్మాక్షి విహారితో రావొద్దు అని చాలా ఫైనల్ వార్నింగ్స్ ఇచ్చా ఇదే ఇంక చివరి సారి అంటుంది. ఇంకెప్పుడు రాను అని లక్ష్మీ చెప్తుంది.
సహస్ర ప్రజెంటేషన్ వర్క్ చేస్తుంటుంది. విహారితో బావ ఈ రోజు కొంచెం వర్క్ ఉంది ఏం అనుకోవద్దు అని చెప్తుంది. విహారి ఏం పర్లేదులే అని అంటాడు. సహస్ర లక్ష్మీ తండ్రికి కాల్ చేసి కొన్ని డౌట్స్ అడగాలి అనుకుంటుంది. అయితే సహస్రకు ఆయన లక్ష్మీ తండ్రి అని తెలీదు. అతను తన పెళ్లి ఆపారు అని కోపంగా ఉన్నా అతని టాలెంట్ కోసం చేయాల్సిందే అంటుంది. ఆదికేశవ్ పెళ్లి ఆపినందుకు సారీ చెప్తాడు. సహస్ర ఏం పర్లేదు అని మీరు పెళ్లి ఆపిన వ్యక్తి నా బావ ఆయనతోనే నా పెళ్లి అయిందని అని చెప్తుంది. ఇక సహస్ర ఆయనకు తన డౌట్స్ అడుగుతుంది. డౌట్స్ క్లియర్ చేయడానికి వీడియో కాల్ చేసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: బంటీ బతకడానికి కారణమైన రుక్మిణిని రూపలా చూసుకుంటున్న సూర్యప్రతాప్..!





















