Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 16th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: ఇంటి కోడలి వారసత్వ నగని సహస్ర, లక్ష్మీల్లో దక్కించుకునేది ఎవరు?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి, సహస్రల వత్రానికి కాదాంబరి వారసత్వ నగను సహస్రకు ఇవ్వడం అంబిక దాన్ని లక్ష్మీ నగతో మార్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబికను కలవడానికి సుభాష్ వస్తాడు. మరోవైపు లక్ష్మీ బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని బయటకు వస్తుంది. అంబిక, సుభాష్‌లు చూసి లక్ష్మీని చంపేయాలి అనుకుంటారు. సుభాష్ లక్ష్మీ వెంట పడతాడు. లక్ష్మీ విహారి గురించి ఆలోచించుకుంటూ విహారితో మాటలు గురించి తలచుకుంటూ వెళ్తుంది.
విహారి లక్ష్మీ గురించి ఆలోచిస్తూ లక్ష్మీని కనిపెడుతూ ఉండాలి ఈ టైంలో లక్ష్మీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటుందని అనుకుంటాడు. లక్ష్మీ గదికి వెళ్లి చూసి లక్ష్మీ లేకపోవడంతో ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి అనుకుంది.. నన్ను వదిలేసి ఎలా వెళ్తావు లక్ష్మీ అనుకొని బయటకు వెళ్తాడు. లక్ష్మీ ఏడుస్తూ వెళ్తూ విహారిని తలచుకొని బతికేస్తా అనుకుంటుంది. సుభాస్ లక్ష్మీ వెంట పడుతూ అర్థరాత్రి ఒంటరిగా దొరికావే అని వెంటపడతాడు. లక్ష్మీ తన వెనక ఎవరూ వస్తున్నారు అని గమనిస్తుంది. కాస్త తొందరగా అడుగులు వేస్తుంది. వెనక్కి చూసే టైంకి సుభాష్ దాక్కుంటాడు.
లక్ష్మీ పరుగెత్తడంతో సుభాష్ వెంట పరిగెడతాడు. ఓ చోట లక్ష్మీ దాక్కున్నా చూసి వెళ్తాడు. మరోవైపు విహారి వస్తూ ఉంటాడు. సుభాష్ లక్ష్మీని పట్టుకొని లాక్కొని వెళ్లి ఓ చోట పడేస్తాడు. విహారి లక్ష్మీ బ్యాగ్ రోడ్డు మీద పడి ఉండటం చూసి లక్ష్మీ ప్రమాదంలో ఉందని గ్రహిస్తాడు. లక్ష్మీ సుభాష్‌ని వదిలేయమని బతిమాలుతుంది. అయినా సుభాష్ చంపడానికి వెంట పడతాడు. లక్ష్మీని సుభాష్ పొడిచే టైంకి విహారి వచ్చి సుభాష్‌ని అడ్డుకొని చితక్కొట్టి కొడతాడు. సుభాష్ పారిపోతాడు. లక్ష్మీ విహారిని కొట్టడానికి సిద్ధపడతాడు. అర్థరాత్రి బయటకు రావడం ఏంటి బయటకు వెళ్లాల్సిన అవసరం నీకు ఏంటి అని అడుగుతాడు.
లక్ష్మీ విహారితో అది నా ఇళ్లు కాదు విహారి గారు నాకు ఆ ఇంటికి రుణం తీరిపోయింది. మీరు సహస్ర సంతోషంగా ఉండాలి అంటే నేను అక్కడ ఉండకూడదు అని అంటుంది. నా వల్ల నువ్వు ఎప్పుడూ సంతోషంగా లేవు. ఇప్పుడు కూడా నేను నిన్ను నడిరోడ్డు మీదకు తీసుకొచ్చేశా.. నీ తలరాతని నేనే మార్చేశా.. నేను నీ జాతకంలోకి నష్టజాతకుడిలా వచ్చాను అని అంటాడు. నీకు ఏమైనా అయితే మీ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి. నువ్వు ఇలా వచ్చేస్తే నేను ఏం చెప్పాలి అని అంటాడు. నేను వెళ్లిపోతా నా బతకు నేను బతుకుతా అని లక్ష్మీ అంటుంది. దానికి నేనేమైపోవాలి అని అంటాడు. ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు చేయకు అని ఇంటికి తీసుకెళ్తాడు.
సహస్రని అంబిక, పద్మాక్షిలు ఉదయం వ్రతం కోసం రెడీ చేస్తారు. కాదాంబరి వచ్చి మనవరాలిని చూసి మురిసిపోతుంది. హాస్పిటల్‌లో ఆ పరిస్థితిలో చూసి గుండె ఆగినంత పనైందని ఏడుస్తుంది. ఇక కాదాంబరి బాక్స్‌లో ఉన్న హారం ఇచ్చి ఇది నువ్వు వేసుకో అని చెప్తుంది. అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత నగ వేసుకోమని అంటుంది. యమున పండుని పిలిచి బట్టలు ఇస్తుంది. సహస్ర, విహారికి పెళ్లి అయినందుకు బట్టలు పెడుతున్నా అంటుంది. లక్ష్మీకి అన్యాయం జరిగితే బట్టలు తీసుకోవాలా అనుకుంటాడు. లక్ష్మీ కోసం వెతుకుతుంది. లక్ష్మీ ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మీకి యమున బట్టలు విస్తుంది. బంగారు గొలుసు ఇస్తుంది. అవన్నీ వద్దని లక్ష్మీ అంటుంది. యమున వేసుకొని రమ్మంటుంది.
అంబిక అదంతా చూసి రాత్రి తప్పించుకున్నావ్ కదా ఇప్పుడు నిన్ను ఏలా ఏడిపిస్తానో చూడు అనుకొని సహస్ర వారసత్వ నగను తీసుకెళ్లి లక్ష్మీ దగ్గర పెట్టేస్తుంది. లక్ష్మీ పని ఈరోజు అయిపోతుందని అనుకుంటుంది. సహస్ర విహారిని చూసి విహారితో కలిసి వెళ్లాలి అని విహారిని ఆపుతుంది. ఇంతలో లక్ష్మీ కూడా వస్తుంది. మీ ఇద్దరికీ నేను ఏంటో చూపిస్తా అని లక్ష్మీ ఎదురుగానే విహారిని హగ్ చేసుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రూపతో మిస్ బిహేవ్ చేసిన దీపక్.. బుడ్డోడితో సహా వాయించేసిన ఫ్యామిలీ!





















