Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 8th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీని దగ్గరుండి పెళ్లి కూతుర్ని చేసిన విహారి, సహస్ర.. సూసైడ్ చేసుకుంటానన్న మదన్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ పెళ్లికి ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మదన్ అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ కోసం విహారి గాజులు సెలక్ట్ చేస్తాడు. వాటిని మదన్ లక్ష్మీ చేతికి వేస్తాడు. తర్వాత అందరి ముందు లక్ష్మీ చేతులు పట్టుకొని ఐలవ్‌యూ చెప్తాడు. అందరూ లక్ష్మీకి కూడా ఐ టూ లవ్‌యూ చెప్పమని అంటారు. లక్ష్మీ విహారి ముఖం చూస్తుంది. ఇక లక్ష్మీ ఐ అని చెప్పబోయే టైంకి పండు కరెంట్ ఫ్యూజ్ తీసేస్తాడు. యమున ఇదేం అపశకునం అని అంటుంది.
పద్మాక్షి యమునను ఉద్దేశించి దీనికి అన్నీ అపశకునాలే అని లక్ష్మీకి ఐలవ్‌యూ చెప్పమని అంటుంది. దానికి మదన్ లక్ష్మీని ఇబ్బంది పెట్టొదద్దని పెళ్లి తర్వాత నాకు మాత్రమే ఐలవ్‌యూ చెప్తుందని అంటాడు. లక్ష్మీ ఆరు బయట కూర్చొని మదన్ వేసిన గాజులు చూసుకుంటూ వాటిని తీసేసి పట్టుకొని ఏడుస్తుంది. ఇక సహస్ర, విహారి, మదన్‌లు పెళ్లి గురించి మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తారు. ఇంతలో లక్ష్మీని చూసి ఒంటరిగా ఉందేంటి అనుకుంటారు. ఇక్కడేం చేస్తున్నావే అని అంటుంది.
విహారి: రేపు ఈ టైంకి మీ పెళ్లి అయి అమెరికా బయల్దేరుతారేమో.
మదన్: అంతా ఓ డ్రీమ్‌లా ఉందిరా ఇక్కడికి రావడం లక్ష్మీని చూడటం అందరి ముందు ప్రపోజ్ చేయడం పెళ్లి.
సహస్ర: ఒకవేళ లక్ష్మీ ఒప్పుకోకపోయి ఉంటే.
మదన్: రేపు పెళ్లికి బదులు నాకు అంత్యక్రియలు జరిగేవి.
విహారి: రేయ్ ఏంట్రా ఆ మాటలు.
మదన్: నేను లక్ష్మీని అంతలా ప్రేమించానురా తను నోచెప్పి ఉంటే నేను చనిపోయేవాడిని.
విహారి: రేయ్ ముందు ఆ పిచ్చి ఆలోచనలు తీసేయ్ రేపే పెళ్లి కదా త్వరగా పడుకుందాం పద.
సహస్ర: మదన్ ఏం చెప్పాడో తెలుసు కదా రేపు ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే మదన్ చచ్చిపోతాడు. అమెరికా వెళ్లే నీకు మంచి లైఫ్ ఉంటుంది. లేదంటే జరిగే పాపాలకు కారణం నువ్వే.
అంబిక సుభాష్ బెయిల్ గురించి లాయర్‌తో మాట్లాడుతుంది. ఎంత ఖర్చు అయినా సరే సుభాష్ రావాలని చెప్తుంది. ఇంతలో విహారి అక్కడికి వస్తాడు. తన మాటలు వినేశాడేమోఅని కంగారు పడతుంది. ఎవరితో మాట్లాడుతున్నావ్ అత్తయ్య అని అడుగుతాడు. ఏమైంది అత్త అలా ఉన్నావ్ అని అడుగుతాడు. కంపెనీలో 57 కోట్లు గురించి కదా ఆలోచిస్తున్నావ్ అది ఎలా మిస్ యూజ్ అయిందా అని కంగారు పడుతున్నావా అత్తయ్య మనం వేరే టెన్షన్‌లో ఉండటం వల్ల ఇలాంటివి జరుగుతాయి పట్టించుకోవద్దు నేను అన్నీ బయటకు తీసుకొస్తాని అంటాడు. అంబిక టెన్షన్ పడి వెళ్తుంది.
లక్ష్మీ తాళి పట్టుకొని ఏడుస్తుంది. విహారి ఈ జన్మకి మీరే నా భర్త అనుకున్నా ఈ జన్మకి మీరే నా ప్రాణం అనుకున్నా ఇప్పుడు నా నుంచి మిమల్ని దూరం చేసి ఈ తాళి తీసేస్తా అంటున్నారు దాని కంటే నన్ను చంపేస్తే బెటర్ అంటుంది. ఇక యమున క్ష్మీ దగ్గరకు వచ్చి నిన్ను పట్టించుకోని ఆ భర్తని తాళిని వదిలేయ్ ఆ తాళి తీసేయమ్మా ఆ తాళి ఎవరైనా చూస్తే లేనిపోని గొడవ అవుతుందని చెప్తుంది. యమున వెళ్లిన తర్వాతలక్ష్మీకి తండ్రి కాల్ చేస్తారు. లక్ష్మీ ఏడుపు మాటలు విని ఏమైందమ్మా ఏడుస్తున్నావ్ అని అంటారు. మా మీద బెంగ పెట్టుకోవద్దని అంటే మిమల్ని చాలా మిస్ అవుతున్నామ్ అని అంటుంది. మమల్ని మిస్ అవ్వకూడదు అని అంటే నువ్వు ఇద్దరు పిల్లల్ని కనేయ్ అంటారు. ఆ మాటలకు లక్ష్మీ చాలా ఏడుస్తుంది. ఉదయం కనక మహాలక్ష్మీని పెళ్లి కూతురిలా సహస్ర రెడీ చేస్తుంది. విహారి పక్కనే నిల్చొని చూస్తాడు. యమున బుగ్గ చుక్క పెడుతుంది. వసుధ లక్ష్మీని ఆశీర్వదిస్తుంది. సహస్ర విహారిని కూడా దీవించమని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!





















