Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 19th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి, లక్ష్మీ పెళ్లి విషయం బయట పడిపోవడం ఖాయం..!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ, విహారిలు గుడిలో ఉన్నారని తెలుసుకొని అందరూ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ, విహారిలు సంతాన సాఫల్యం వ్రతం మొదలు పెడతారు. అందుకు మొదటిగా పంతులు ఇద్దరిని కోనేటికి తీసుకెళ్లి విహారితో లక్ష్మీకి బొట్టు పెట్టించి ఇద్దరినీ కోనేటిలో కలిసి స్నానం చేయమని చెప్తారు. ఇద్దరినీ ఒకర్ని ఒకరు పట్టుకొని స్నానం చేస్తారు. కోనేటిలో ఓ దండ వచ్చి ఇద్దరి మెడలో పడుతుంది.
ఆదికేశవ్, గౌరీ చాలా సంతోషపడతారు. పంతులు అద్భుతం అని చెప్పి ఇద్దరినీ దండతోనే పైకి రమ్మని చెప్తారు. మీ జంటని ఆ పరమేశ్వరుడే దీవించినట్లు దండ మీ మెడలో పడిందని ఆదికేశవ్ అంటే త్వరలోనే మీకు సంతానం కలుగుతుందని గౌరీ అంటుంది. లక్ష్మీ, విహారి ఒకర్ని ఒకరు చూసుకుంటారు. తర్వాత పంతులు అంగ ప్రదక్షిణ చేయాలి అని చెప్తారు. విహారి, లక్ష్మీ ఇద్దరూ అంగ ప్రదక్షిణలు చేస్తుంటే గౌరీ నీరు పోస్తుంటుంది. మరోవైపు సహస్ర వాళ్లు గుడి వైపు వస్తుంటారు. ప్రదక్షిణ చేస్తున్న విహారి చేతికి కొబ్బరి చిప్ప తగిలి రక్తం వస్తుంది. లక్ష్మీ లేస్తుంటే పంతులు వద్దని మధ్యలో ఎవరూ లేవకూడదు అని చెప్తారు. విహారి ప్రదక్షిణలు పూర్తి చేస్తానని చెప్పి మళ్లీ ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణలు పూర్తి అవుతాయి. లక్ష్మీ, విహారి చేతికి పసుపు పెడుతుంది. పంతులు ఇద్దరికీ బట్టలు మార్చుకోమని చెప్తారు. ఆదికేశవ్ వాళ్లు తీసుకొచ్చిన బట్టలు ఇద్దరికీ ఇస్తారు.
ఇంట్లో యమున, వసుధ చాలా టెన్షన్ పడతారు. విహారికి యమున కాల్ చేస్తుంది. విహారి లిఫ్ట్ చేసి మాట్లాడుతాడు. లక్ష్మీ కనిపించిందా మాకు చాలా కంగారుగా ఉందిరా అని యమున అంటుంది. దాంతో విహారి లక్ష్మీ దొరికింది అని చెప్తాడు. యమున లక్ష్మీతో మాట్లాడాలి అంటుంది. విహారి ఫోన్ స్పీకర్ పెడతాడు. ఎక్కడికి వెళ్లిపోయావ్ లక్ష్మీ ఎక్కడున్నావ్ అని అడుగుతుంది. లక్ష్మీ ఏం చెప్పకుండా ఉంటే విహారి తల్లితో గుడిలో ఉన్నాం లక్ష్మీ ఏదో పూజ చేయాలి అనుకుంటుందని చెప్తాడు. యమున మాట్లాడటం పద్మాక్షి వింటుంది. యమున, వసుధ ఊపిరి పీల్చుకుంటారు. సహస్ర అంబికకు విషయం తెలుసో లేదో అని పద్మాక్షి ఫోన్ చేసి సహస్రకి చెప్తుంది. విహారికి దొరికింది అంట గుడిలో పూజ చేస్తుంది అంట వెళ్లు మేం వస్తాం అని చెప్తుంది. యమున వాళ్లు కూడా వెళ్లాలి అని బయల్దేరితే పద్మాక్షి కూడా బయల్దేరుతుంది. లక్ష్మీ, విహారిలు రెడీ అయితే లక్ష్మీ కుచ్చుళ్లు విహారి సర్దుతాడు.
లక్ష్మీ, విహారి వ్రతంలో కూర్చొంటారు. అందరూ గుడి దగ్గరకు బయల్దేరుతారు. లక్ష్మీ, విహారిలు చెట్టుకు ముడుపు కడతారు. లక్ష్మీ కింద పడిపోబోతే విహారి పట్టుకుంటాడు. తర్వాత లక్ష్మీని ఎత్తుకొని ముడుపు కట్టిస్తాడు. ఇద్దరూ సంతోషంగా దండం పెట్టుకుంటారు. ఈ సమస్యలు రాకుండా అంతా సక్రమంగా ఉండేలా కోరుకుంటారు. పద్మాక్షి వాళ్లు సహస్ర, విహారిలు కూడా గుడికి చేరుకుంటారు. సహస్ర కారు చూసి విహారి వాళ్లు గుడిలో ఉంటారు అని లోపలికి వెళ్తారు. గుడి లోపల వెళ్లి అంతా వెతుకుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

