Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 17th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: చెరువులో దూకేసిన లక్ష్మీ.. లక్ష్మీని హగ్ చేసుకొని ఏడ్చేసిన విహారి..!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం చనిపోవాలని చెరువులో దూకేయడం విహారి కాపాడి లక్ష్మీ తాళికి అండగా ఉంటానని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ కనిపించడం లేదని పండు ఇంట్లో చెప్తాడు. విహారి బాబు లక్ష్మీని వెతకడానికి వెళ్తారని అంటారు. ఇక లక్ష్మీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే విహారి లక్ష్మీ కోసం వెతుకుతూ ఉంటాడు. లక్ష్మీ కోసం యమున టెన్షన్ పడితే ఇదంతా యమున వల్లే అని అంబిక పద్మాక్షితో చెప్తుంది. నాకేం తెలీదు అని రాత్రి కూడా ఆపిల్లని తాళి కోసం అడిగాను అని యమున అంటే నువ్వు దాన్ని పారిపోమని చెప్పుంటుందని పద్మాక్షి వాళ్లు నింద వేస్తారు.
యమున అందరితో లక్ష్మీ మదన్‌ని పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగుంటుందని నేను భావించాను అలాంటిది నేను ఎందుకు తనని పొమ్మంటాను అని అంటుంది. లక్ష్మీ ఏదో ప్లాన్ చేసుంటుందని సహస్ర అంటే అంబిక కూడా లక్ష్మీ ఓ పెద్ద కిలాడి అని అంటుంది. సహస్ర, అంబికలు లక్ష్మీని వెతకడానికి వెళ్తారు. అది దొరికితే దాని పని చెప్తానని పద్మాక్షి అంటుంది. మరోవైపు ఆదికేశవ్, గౌరీలు గుడికి వస్తారు. పంతులుని కలిసి అమ్మాయి, అల్లుడితో సంతానసాఫల్యం వ్రతం చేయించాలని చెప్తారు. ఇద్దరూ తర్వాత వస్తారని అంటారు. పంతులు వ్రతం ఏర్పాట్లు చేస్తానని అంటారు.
విహారి: ఇప్పుడిప్పుడే నువ్వు అంటే ఏంటో తెలుసుకుంటున్నాను. నన్ను నేను మార్చుకుంటున్నాను. ఇంతలోనే నువ్వు నాకు దూరం అయిపోతే ఎలా కనక మహాలక్ష్మీ. ఏ నిర్ణయం తీసుకుంటావో నాకు తెలుసు దయచేసి నువ్వు నాకు ఒక్క సారి కనిపించు.
లక్ష్మీ: ఓ చెరువు దగ్గర ఆగుతుంది. తనలో తాను మాట్లాడుకుంటుంది. తన నిజం తనలోనే ఉంచుకొని ఆ బాధ తనలోనే ఉంచుకోవాలి అని యమునమ్మ మంచి ఆశయంతో రెండు కుటుంబాలు కలవాలి అనుకున్న విహారి గారు ఇద్దరూ బాగుండాలి అనుకుంటుంది. విహారి గారిని ప్రేమించాను ఆ ప్రేమ నాలోనే ఉంటుంది. బతికుంటే నేను సమాధానం చెప్పాలి. అదే నేను చచ్చిపోతే విహారి, సహస్రమ్మ సంతోషంగా ఉండాలి అని అనుకుంటుంది.
విహారి చూస్తుండగానే లక్ష్మీ చెరువులో దూకేస్తుంది. కనక మహాలక్ష్మీ అంటూ విహారి వచ్చి చెరువులో దూకి లక్ష్మీని పైకి తీసుకొస్తాడు. లక్ష్మీ నువ్వు బతకాలి అని లక్ష్మీకి సపర్యలు చేస్తాడు. దాంతో లక్ష్మీ లేస్తుంది. విహారిని చూసి లక్ష్మీ నన్ను ఎందుకు బతికించారు అని అంటే విహారి లక్ష్మీని లాగిపెట్టి కొడతారు. లక్ష్మీ ఏడుస్తుంది. ఇక విహారి కూడా ఏడుస్తూ లక్ష్మీని హగ్ చేసుకుంటాడు. లక్ష్మీ షాక్ అయిపోతుంది.
విహారి: అన్నీంటికి చావే పరిష్కారం అనుకున్నావా. నీ పాటికి నువ్వు వచ్చి చనిపోతా అంటే నేను మీ వాళ్లకి ఏం సమాధానం చెప్పాలి ముఖ్యంగా నాకు నేను ఏం సమాధానం చెప్పుకోవాలి. నీ జీవితానికి నా వల్ల అన్యాయం జరిగిందని నేను ఎంత బాధ మోస్తున్నానో తెలుస్తుందా అసలు నేను ప్రాణాలతో బతకగలనా.
లక్ష్మీ: విహారి గారు అలా అనొద్దు మీరు నిండు నూరేళ్లు సంతోషంగా బతకాలి.
విహారి: నువ్వు చనిపోతే నేను ఎలా సంతోషంగా బతకాలి. అసలు నీ సమస్యకి కారణం నేనే ఎంత సేపు నా సమస్య నా వాళ్లు అనుకున్నానే కానీ నీ గురించి ఆలోచించలేదు. అసలు మన బంధం గురించి ఒక్కసారి ఆలోచించలేదు. నాకు స్వార్థమే ఉంది కానీ నీలో ఆ స్వార్థమే లేదు లక్ష్మీ. నీకు ఇంత అన్యాయం చేశానని నువ్వు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు తెలిసింది. నేను నిజం అర్థం చేసుకొని నీ ముందుకి వచ్చే టైంకి నాకు ఇంత టైం పట్టింది నా గురించి నువ్వు ఒక్క సారి అర్థం చేసుకోలేదా. నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావడం లేదా. అని అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరకు లక్ష్మీని తీసుకెళ్లి ఏసమస్య గురించి భయపడుతున్నామో ఏ సమస్య లేకుండా చేయాలి అనుకున్నామో అదే నీ మెడలో ఉన్న తాళి ఆ తాళికి అండగా నిలబడటమే నేను ఈ సమస్యకి చేయగలిగే పరిష్కారం. ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!





















