Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today March 15th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఆ నీచుడు ఎవడో 24 గంటల్లో తెలియాల్సిందే.. యమున వార్నింగ్‌కి లక్ష్మీ జంప్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ భర్త ఎవరో 24 గంటల్లో చెప్పాలని యమున లక్ష్మీ మీద సీరియస్ అవడంతో లక్ష్మీ ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనక మహాలక్ష్మీని పెళ్లి చేసుకుంటానని మదన్ అంటాడు. నీ పెళ్లి గురించి తెలిసినా నీ మోసం తెలిసినా మదన్ ఇంకా నిన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని పద్మాక్షి లక్ష్మీతో చెప్తుంది. ఇవన్నీ కాదే అసలు నిన్ను పెళ్లి చేసుకున్న వాడు ఎవడే? అనిఅడుగుతుంది. పద్మాక్షి మాటలకు విహారి తన చేతితో ఇనుప రాడ్స్‌ని గట్టిగా పట్టుకొని చేతిని గుచ్చుకోవడంతో రక్తం కారుతుంది.
పద్మాక్షి: నువ్వు ఒక దరిద్రం అని తెలిసి నిన్ను తన్ని తరిమేశాడా లేక వాడు నీ కన్నా పెద్ద దరిద్రుడా. ఆ దరిద్రుడి కుటుంబం ఇంక అష్టదరిద్రులా.
లక్ష్మీ: అమ్మా. మీకేం తెలీకుండా మాట్లాడొద్దు. ఆయన నాతో జీవితం పంచుకోలేక నన్ను వదిలేసి వెళ్లిపోయారు.
పద్మాక్షి: లక్ష్మీనా లాగి పెట్టి కొడుతుంది. లక్ష్మీ కింద పడిపోతుంది. చేసిందంతా మోసం మళ్లీ వాడిని నీచంగా అంటే రోషం. ఏం బతుకే నీది.
విహారి: మనసులో నా కోసం నువ్వు అవమాన పడుతున్నా ఏం చేయలేక పోతున్నా లక్ష్మీ.
యమున: లక్ష్మీని పైకి లేపి.. ఇన్నాళ్లు ఏ విషయంలో అయినా నీకే సపోర్ట్‌గా ఉన్నా అలాంటి నన్నే మోసం చేశావు కదా. నిన్ను ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు నిజం ఉంది. వాటికి నీ దగ్గర ఎందుకు సమాధానం లేదు. నువ్వే పిచ్చి దానివి లక్ష్మీ నీ ప్రాణం కంటే ఎక్కువ విలువ నీ తాళికి ఇస్తున్నావ్. ఎవడో నీచుడికి ప్రాముఖ్యత ఇస్తూ మదన్ లాంటి మంచి వాడిని పెళ్లి చేసుకోను అంటున్నావ్.
వసుధ: మనసులో వదిన నిజం తెలీక నీ కొడుకునే నువ్వు నీచుడు అంటున్నావ్.
యమున: ఎవడో అసమర్ధుడి కోసం ఉంటున్నావ్ కానీ నీ కోసం ప్రాణాలు ఇస్తున్న మదన్‌ని వద్దు అంటున్నావ్. ఇన్ని రోజులు నేను నీ కోసం నీ మంచి ఇంతా చేస్తే నువ్వు నా మాటకు నాకు విలువ ఇవ్వకుండా నా తల తీసేసినట్లు ఎవరి కోసమో ఈ పెళ్లి ఆపాలి అన్నట్లు విషం తాగుతావా. నువ్వు ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి. నీ మెడలో తాళి కట్టింది ఎవరు.
సహస్ర: అత్తయ్య అడుగుతున్నారు కదా చెప్పు.
యమున: నీ భర్త పేరు చెప్పడానికి ఏంటి నీకు బాధ. అతని కోసం ఏం చేసే నువ్వు పేరు చెప్పడం లేదు ఎందుకు. నీకు 24 గంటలు ఇస్తున్నా నీ భర్త ఎవరు వివరాలు చెప్పాలి. ఈ విషయంలో ఇంకో గడువు ఇంకో మాట ఉండదు.
లక్ష్మీ: అమ్మా..
లక్ష్మీ వసుధని పట్టుకొని ఏడుస్తుంది. ఇక విహారికి ఆదికేశవ్ వాళ్లు ఫోన్ చేసి రేపు సంతానసాఫల్య వ్రతం మీతో చేయిస్తాం ఇద్దరూ రావాలి అంటారు. కనకం గురించి అడిగితే తలనొప్పి అని కనకం పడుకుందని విహారి చెప్తాడు. ఇక మదన్ లక్ష్మీ గురించి ఆలోచిస్తూ చాలా బాధ పడతాడు. ఏడుస్తున్న మదన్ దగ్గరకు సహస్ర, పద్మాక్షి, అంబికలు వస్తారు. మదన్‌కి అందరూ ధైర్యం చెప్తారు. లక్ష్మీతో నీకు పెళ్లి చేస్తాను అని పద్మాక్షి చెప్తుంది. లక్ష్మీ నిజం చెప్పలేను అనుకొని తన సమాధానం చెప్పకూడదు అనుకొని యమునమ్మ గారికి ఇక ఎప్పటికీ కనిపించకూడదు అనుకొని బయటకు వెళ్లిపోతుంది. వెళ్తూ బయట పడుకున్న పండు దగ్గర సౌండ్ చేయడంతో పండు లేస్తాడు. ఎవరో వెళ్తున్నారని బయటకు పరుగులు తీస్తాడు. ఇక విహారి లక్ష్మీ ఏం ఆలోచిస్తుందో వెళ్లి ధైర్యం చెప్పాలి అని లక్ష్మీ గదికి వెళ్తాడు. అక్కడ లక్ష్మీ ఉండదు. విహారి బయటకు వచ్చి పండుని అడిగితే ఇందాక ఒకరు బయటకు వెళ్లారని అది లక్ష్మీనే అని అంటాడు. విహారి లక్ష్మీని వెతుక్కొని వస్తానని అంటాడు. ఉదయం అందరూ రెడీ అయి వచ్చి లక్ష్మీని పిలుస్తారు. వసుధ ఇళ్లంతా వెతికి లక్ష్మీ లేదని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. పండు వచ్చి బయటకు వెళ్లిపోయిందని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలయ్యని ఫాలో అవ్వడం అంత ఈజీ కాదోయ్ గిరి.. జైలులో తాళి కట్టడానికి గిరి ప్లాన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

