Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today july 30th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీపై నిందలు.. క్లే సహస్రని పట్టించేస్తుందా? యమున ఆలోచనేంటి?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode july 30th యమున ఆడపడుచులకు వడిబియ్యం ఇవ్వాలని అనుకోవడం పద్మాక్షి ఒకే చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ వల్లే మన పరువు పోతుందని లక్ష్మీ చేసిన మంచి ఆవగింజ అంత ఉంటే చెడు గుమ్మడి కాయంత ఉందని పద్మాక్షి కోప్పడుతుంది. ఈ కుటుంబం ఎన్నడూ చూడని అవమానాలను ఈ లక్ష్మీ వల్ల పడ్డామని మర్చిపోవద్దని అంబిక అంటుంది. ఈ స్కామ్ లక్ష్మీ అని పద్మాక్షి అంటుంది. తను చేస్తే ఎలా రికవరీ చేస్తుందని విహారి అంటాడు.
అంబిక కోపంగా తనే చేసింది.. లేదంటే ఎక్కడో జరిగిన స్కామ్ ఎలా సాల్వ్ చేస్తుందని అడుగుతుంది. లక్ష్మీ ఏ తప్పు చేయలేదని నువ్వు చెప్పమ్మా నువ్వు ఏం చెప్తావా అని లక్ష్మీ కూడా ఎదురు చూస్తుందని విహారి అంటాడు. యమున మాత్రం స్వామీజీ మాటలు తలచుకొని లక్ష్మీని చూసి అసహ్యించుకుంటుంది. లక్ష్మీ అందరితో నేను ఇప్పుడు ఎవరినీ నమ్మించలేకపోయినా ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది.ఈ కుట్ర వెనక ఎవరు ఉన్నారో తెలిసిన తర్వాత నేను మాట్లాడుతా అంటుంది. అందరూ ఏం మాట్లాడరు వెళ్లిపోతారు. పండు విహారితో ఏంటి బాబు ఇది నా చెల్లిని అందరూ దొంగ అంటున్నారు.. డబ్బు తీసుకొచ్చినా దొంగ అంటున్నారు అని ఏడుస్తాడు. సూటిపోటి మాటలతో రోజు నా చెల్లిని కొంచెం కొంచెం చంపేస్తున్నారని ఏడుస్తాడు. భర్తగా తన వైపు నిలబడలేకపోతున్నా.. తనని అందరూ నానామాటలు అంటుంటే చూస్తూ నిలబడేలా చేస్తున్నాడు ఆ భగవంతుడు కానీ ఏదో ఒకరోజు అన్నీ ఎదురించి తన పక్కనే నేను నిల్చొంటా అని బయటకు వెళ్తాడు.
లక్ష్మీ బయట ఏడుస్తూ ఉంటుంది. విహారి లక్ష్మీ దగ్గరకు వెళ్తాడు. లక్ష్మీని ఓదార్చుతాడు. లక్ష్మీ మాత్రం ఎవరు ఏమన్నా నాకు ఏం బాధ లేదు కానీ యమునమ్మ నాతో మాట్లాడట్లేదు అదే బాధగా ఉంది అని అంటుంది. ఎవరైనా మనం మాట్లాడుతున్నట్లు చూస్తే ప్రమాదం వెళ్లిపోదాం అని అంటుంది. లక్ష్మీ వెళ్తూ ఉంటే పండు చెత్త పడేయడానికి వస్తూ కాలు జారిపడిపోతాడు. లక్ష్మీ పట్టుకోవడానికి వెళ్లి అందులో క్లే ఆర్డర్ ఇచ్చిన పేపర్ చూసి షాక్ అయిపోతుంది. అది చూసి చారుకేశవ ఏమైందని అడిగితే మన ఇంట్లో ఎవరూ ఈ క్లే ఆర్డర్ చేసి నా వేలిముద్రలు తీసుకున్నారు అది ఎవరో తెలుసుకోవాలి అంటుంది. అంబిక మీద అనుమానం ఉందని చారుకేశవ అంటాడు.
యమున ఇంట్లో అందరిని పిలిచి పద్మాక్షి, వసుధలకు వడిబియ్యం పోయాలని ఉందని అంటుంది. ఇప్పుడు ఎందుకు అని పద్మాక్షి అంటే నేను ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు మీరు ఇళ్లు దాటేశారు. అందుకే అప్పటి నుంచి మీకు పుట్టింటి నుంచి ఎప్పుడు ఏం జరగలేదు.. అందుకే అప్పుడు చేయాలి అనుకున్న కార్యక్రమం ఇప్పుడు చేస్తా అంటుంది. సహస్ర సంతోషంతో చక్కగా చెప్పారు అత్తయ్య మా అమ్మకి పెళ్లి అయినప్పటి నుంచి పుట్టింటి నుంచి ఏం జరగలేదు చేయండి అత్తయ్య అంటుంది. విహారి తల్లితో నీ ఆర్యోగ్యం సెట్ అయిన తర్వాత చేయమని అంటాడు. యమున తనకు ఇలా చేయడం ఎంతో ఇష్టమని మా ఆయనకు ఎంతో ఇష్టమైన చెల్లికి ఇప్పుడు చేసే భాగ్యం నాకు దక్కింది.. అని అంటుంది.
పద్మాక్షి సంతోషంగా ఒకే అంటుంది. నా పుట్టింటి నుంచి చేసే ఏ కార్యక్రమం అయినా నేను ఎందుకు కాదు అంటాను.. నిజానికి ఇది మా అమ్మానాన్నలు చేయాలి వాళ్లు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. నువ్వు చేస్తున్నావు సంతోషంగా తీసుకుంటాను అని అంటుంది. అంబిక పెళ్లి చేసుకోలేదని అందరూ సెటైర్లు వేస్తారు. చారుకేశవ అంబికతో మరదలా మేమే పెళ్లి చేసుకొని బాధలు పడాలా నువ్వు చేసుకో మా బాధలు తెలుస్తాయి అంటాడు. లక్ష్మీ పనులు చేస్తానని అంటే వద్దని యమున పండుకి చెప్తుంది. యమున విహారి ఫొటో పట్టుకొని నువ్వు అమెరికా వదిలేసి ఇండియాలో ఎందుకు సెటిల్ అయ్యావో నీకే తెలియాలి. మీ నాన్నకి వారసుడు నువ్వు నీకు ఈ ఇంటి బాధ్యతలు తెలిస్తే నువ్వే ఆ లక్ష్మీని విడిచి ఇంటి గురించి తెలుసుకుంటావు. ఆ లక్ష్మీకి కూడా మన ఇంటి గురించి తెలుస్తుంది మనకు దూరంగా ఉంటుంది అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















