Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today july 2nd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీ విహారికి పెళ్లి గుట్టు తెలిసి కుప్పకూలిపోయిన యమున.. లక్ష్మీతో నిజం చెప్పిస్తుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీ మెడతో విహారి తాళి కట్టడం యమున చూసేడయం ఇంటి దగ్గర లక్ష్మీ తాళి పట్టుకొని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర గుడిలో లక్ష్మీ మెడలో తాళి తెంపేస్తుంది. విహారి సహస్రని కొట్టడంతో సహస్ర ఇంటికి వెళ్లిపోతుంది. లక్ష్మీ, విహారి తాళి పట్టుకొని పంతులు దగ్గరకు వెళ్తుంటే అరటి పండు తొక్కేసి విహారి త్రిశూలం మీద పడిపోయి మెడకి గుచ్చుకునే టైంకి లక్ష్మీ విహారి చేయి పట్టుకొని ఆపుతుంది.
అంబిక పంపిన రౌడీలు ఎలా అయినా విహారిని చంపేయాలి అనుకుంటారు. విహారి లక్ష్మీకి థ్యాంక్స్ చెప్తాడు. కొంచెం ఉంటే నేను అయిపోయేవాడిని అని విహారి అంటే లక్ష్మీ తన చేతిని విహారి నోటికి అడ్డంగా పెడుతుంది. అది యమున చూసేస్తుంది. షాక్ అయిపోతుంది. నా కళ్లతో నేను చూస్తుంది నిజమేనా లేదంటే ఇదంతా భ్రమా అని యమున అనుకుంటుంది. విహారి వాళ్లు బోనాలు దగ్గరకు వెళ్లి దండం పెట్టుకుంటారు. రౌడీలు పెద్ద పెద్ద కత్తులు తీసి విహారి మీద దాడి చేయబోతే బోనం ఎత్తుకున్న అమ్మవారి ప్రతి రూపంగా ఉన్న ముత్తుయిదువు పులి వేషంలో ఉన్న ఆ రౌడీ చేయి పట్టి ఆపి అతన్ని తన్ని నెట్టేస్తుంది. మరో వ్యక్తి విహారి మీద దాడి చేస్తే లక్ష్మీ అడ్డుకుంటుంది. విహారి చేతికి కత్తి తగిలి గాయం అవుతుంది.
విహారి కొందరు రౌడీలను చితక్కొడితే అమ్మవారి రూపంలో ఉన్న ఆ మహిళ, లక్ష్మీ మరి కొందర్ని చితక్కొడతారు. రౌడీలు పారిపోతారు. విహారి చేతికి గాయం అయి రక్తం రావడంతో లక్ష్మీ పసుపు రాసి క్లాత్ కడుతుంది. అమ్మవారు అమ్మ విహారి వాళ్లతో ఎవరు వాళ్లు మిమల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారుఅని అడుగుతుంది. ఇక లక్ష్మీ చేతిలో తాళి చూసి ఏంటి తాళి పట్టుకున్నావ్ పెళ్లి చేసుకోవడానికి వచ్చారా అని అడుగుతుంది. దాంతో లక్ష్మీ లేదండీ మాకు ఇప్పటికే పెళ్లి అయింది అనుకోకుండా తాళి తెగింది అని అంటుంది. విహారి వాళ్లతో తను నా భార్య అని చెప్తాడు. ఆ మాటలు విన్న యమున గుండె పగిలేలా అయిపోతుంది. కుప్పకూలిపోయి తల పట్టుకొని ఏడుస్తుంది.
విహారితో మళ్లీ లక్ష్మీ మెడలో తాళి కట్టించడానికి ఆమె గుడిలోకి తీసుకెళ్తుంది. పంతులు సమక్షంలో విహారి లక్ష్మీ మెడలో తాళి కడతాడు. యమున వాళ్లని ఫాలో అయి తాళి కట్టడం చూసి ఏం అర్థం కాక బిత్తరపోతుంది. ఏడుస్తూ అక్కడి నుంచి యమున వెళ్లిపోతుంది. మీ ఇద్దరూ కలిసే ఉంటారు సంతోషంగా ఉంటారు అని బోనాలు ఎత్తుకున్న అమ్మ దీవించి వెళ్లిపోతుంది. విహారి తన మనసులో మాట చెప్పాలని అనుకుంటే లక్ష్మీ కావాలనే విహారిని అడ్డుకొని ఇంటికి వెళ్దాం టైం అయిపోయింది అంటుంది. మనసులో మాత్రం మీరు ఎం చెప్పాలి అనుకుంటున్నారో నాకు తెలుసు కానీ మీ ప్రేమ పొందే అర్హత నాకు లేదు అదంతా సహస్రమ్మకే సొంతం అనుకుంటుంది.
యమున ఏడుస్తూ జీవచ్ఛవంలా ఇంటికి వస్తుంది. గతంలో లక్ష్మీని భర్త వదిలేసి వెళ్లిపోవడం ఫిట్స్ వచ్చిన తనని లక్ష్మీ కాపాడటం లక్ష్మీని తీసుకొని యమున ఇంటికి రావడం అన్నీ గుర్తు చేసుకుంటుంది. తనో అనాథ అని తనని పెళ్లి చేసుకున్న వాడు వదిలేసి వెళ్లి పోయాడు అని లక్ష్మీ చెప్పడం గుర్తు చేసుకొని లక్ష్మీతో తను ఎంత ప్రేమగా ఉందో గుర్తు చేసుకుంటుంది. గదిలోకి వచ్చి కూలబడి లక్ష్మీ నీకు ఏ తోడు లేనప్పుడు నీకు అండగా ఉన్నాను. ఇన్ని రోజుల్లో ఎప్పుడూ నాకు నిజం చెప్పాలి అనిపించలేదా.. వాడు ప్రాణంగా చూసుకునే సొంత మనుషులకే అన్యాయం చేశాడు అని రగిలిపోతుంది.
యమున దగ్గరకు లక్ష్మీ వస్తుంది. యమునకు ప్రసాదం తీసుకోమని అంటుంది. యమున కోపంగా చూస్తుంది. ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతుంది. గుడికి వెళ్లా అని చెప్పా కదమ్మా అని లక్ష్మీ అంటుంది. యమున కోపంగా ఎవరితో వెళ్లావో అని అరుస్తుంది. ఒక్కదాన్నే వెళ్లానని లక్ష్మీ అంటుంది. ఒక్క దానివే వెళ్లావా నువ్వు మోసం చేయడానికి నా కంటే ఇంకెవరూ దొరకలేదా.. నువ్వు ఆడిన నాటకం చేసిన మోసం అందరి చెప్తా అని లక్ష్మీని యమున లాక్కొని తీసుకెళ్తుంది. అమ్మా వద్దు అని లక్ష్మీ అంటుంది. నా వల్ల ఏం తప్పు జరిగింది అని లక్ష్మీ అడుగుతుంది. నువ్వు మాట్లాడకు ఇప్పుడు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం మాత్రమే చెప్పాలి అంతే కానీ మాట్లాడే అర్హత లేదు అంటుంది.
యమున కేకలకు అందరూ బయటకు వస్తారు. యమున లక్ష్మీ తాళి పట్టుకొని కోపంగా చూస్తూ నీ మెడలో ఈ తాళి కట్టిన మనిషి ఎవరు అని అడుగుతుంది. నన్ను వదిలేసి వెళ్లి పోయాడు మీకు తెలుసు కదా అమ్మగారు అని లక్ష్మీ అంటుంది. యమున కోపంగా నాటకాలు ఆడకు నిజం చెప్పు అంటుంది. సహస్ర, విహారి, వసుధ, చారుకేశవ షాక్ అయిపోతారు. పద్మాక్షి యమునతో ఏంటి గురు శిష్యులు కొత్త నాటకం మొదలు పెట్టారు అంటుంది. యమున కోపంగా వదిన మీరు కాసేపు ఆగండి అన్నీ తేల్చుతా అంటుంది. నీ భర్త ఎక్కడ చెప్పు అని యమున అరుస్తుంది.
సహస్ర ఏమైంది అని అడుగుతుంది. విహారి తల్లితో తనని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్ వదిలేయ్ అమ్మా అంటే విహారి ఈ విషయంలో నువ్వు కలగజేసుకోకు అని అంటుంది. ఎవరూ మధ్యలోకి రాకండి లక్ష్మీ నిజం చెప్తుంది. నేను చెప్పిస్తాను అంటుంది. నీకు అంతా తెలుసు మర్యాదగా నిజం చెప్పు అని నిలదీస్తుంది. లక్ష్మీ ఏడుస్తుంది. విహారి మధ్యలో మాట్లాడితే యమున కొడుకు మీద చాలా ఫైర్ అవుతుంది. నా భర్త నన్ను ఎప్పుడో వదిలేసి వెళ్లిపోయాడు అని అంటుంది. వదిలేసి వెళ్లిపోయిన భర్తని నువ్వు మళ్లీ కలవలేదా అని అడుగుతుంది. వెళ్లి అతన్ని చూడలేదా అని అడుగుతుంది. నిజం చెప్పు లక్ష్మీ అని అరుస్తుంది.
లక్ష్మీ అవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు. మీకు ఇష్టం లేకపోతే నేను ఈ ఇంటి నుంచి వెళ్లిపోతా అంటుంది. దాంతో యమున నువ్వు నిజం చెప్పి ఈ ఇంటి నుంచి కదలాలి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















