Kalavari Kodalu: లక్ష్మీ మెడలో తాళి తెంపిన సహస్ర.. విహారి రియాక్షన్ ఏంటి? నేటి ఎపిసోడ్ లో ట్విస్ట్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode యమున విహారి, లక్ష్మీల మీద అనుమానంతో గుడికి వెళ్లడం సహస్ర లక్ష్మీ మెడలో తాళి తెంపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి లక్ష్మీతో చనువుగా ఉంటూ సహస్రని దూరం పెట్టడంతో యమునకు ఇద్దరి మీద అనుమానం వస్తుంది. లక్ష్మీ గుడికి అని మధ్యాహ్నం వెళ్తుంది. విహారి కూడా వెనకాలే వెళ్తాడు. యమునకు అనుమానం మరింత పెరుగుతుంది. అంబిక విహారి బయటకు వెళ్లడం చూసి రౌడీలకు కాల్ చేసి విహారిని చంపేయమని అంటుంది.
విహారి లక్ష్మీకి కాల్ చేసి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతాడు. లక్ష్మీ గుడికి అని చెప్తే తాను కూడా వస్తున్నా అని చెప్తాడు. సహస్ర వెనకాలే ఫాలో అవుతాడు. విహారి లక్ష్మీ ఎందుకు గుడికి వెళ్తుందా అని అనుకుంటాడు. లక్ష్మీ హ్యాపీ మూడ్‌లో ఉందని ఎలా అయినా లక్ష్మీకి తన మనసులో మాట చెప్పేయాలి అని అనుకుంటాడు. మరోవైపు రౌడీలు దారిలో విహారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కారు రావడం చూసి విహారిని ఫాలో అయి చంపేయాలి అనుకుంటారు. యమునకు అనుమానం వచ్చి వెళ్తుంటే పండు చూసి ఎక్కడికి వెళ్తున్నారు అని కంగారుగా వెళ్తాడు. యమున తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అంటే అడ్డుకోవాలని చూస్తాడు. యమున పండు మీద అరిచి వెళ్లిపోతుంది. ఆటోని ఆపి గుడికి బయల్దేరుతుంది.
అమ్మవారి గుడి దగ్గర బోనాలు జరుగుతుంటాయి. లక్ష్మీ గుడికి చేరుకుంటుంది. వెనకాలే సహస్ర వెళ్లి లక్ష్మీని చూసి మాకు ప్రశాంతత లేకుండా చేసి నువ్వు మాత్రం ప్రశాంతత కోసం గుడికి వస్తావా ఈ రోజు మా చేతిల్లో నువ్వు అయిపోయావే లక్ష్మీ అని సహస్ర అనుకుంటుంది. లక్ష్మీ గుడికి చేరుకొని దండం పెట్టుకుంటే సహస్ర ఎదురెళ్తుంది. నువ్వు మా బావ నాకు దూరం అయిపోవాలి అని కోరుకుంటున్నావ్ కదే.. నీకు మేం సంతోషంగా ఉండటం నీకు అస్సలు ఇష్టం లేదు కదనే అంటుంది. లక్ష్మీ మాత్రం మీరు విహారిగారు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అంటుంది.
విహారి గుడికి చేరుకుంటాడు. రౌడీలు వెనకాలే వస్తారు. విహారి లక్ష్మీ కోసం వెతుకుతూ ఉంటాడు. సహస్ర లక్ష్మీతో నువ్వు గుడికి ఎందుకు వచ్చావ్ చెప్పే అని అంటుంది. నేను సంతోషంగా ఉంటే నీ మనసు ఎందుకు సంతోషంగా ఉంటుందే.. అవతల వాళ్ల కాపురాలు చిచ్చు పెట్టడమే కదా నీ పని అని సహస్ర తిడుతుంది. అందరూ మనల్నే చూస్తున్నారు అని లక్ష్మీఅంటుంది. దాంతో సహస్ర చూస్తే చూడని నీకు సిగ్గు ఎగ్గు ఏం లేదు అందుకే మా ఇంట్లో ఉంటూ నా భర్తని వలలో వేస్తున్నావ్.. మెడలో తాళి ఉంది.. కానీ భర్త లేడు. నీ పక్కనే భర్త లేడు కాపురం లేదు ఏం లేనప్పుడు ఈ తాళి నీకు ఎందుకే అని లక్ష్మీ తాళి సహస్ర పట్టుకుంటుంది. నా తాళి వదిలేయండి అని లక్ష్మీ బతిమాలుతుంది.
సహస్ర లక్ష్మీ మెడలో తాళి తెంపేస్తుంది. విహారి అది చూస్తాడు. విలువ లేని తాళి నీ మెడలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని సహస్ర లక్ష్మీ ముఖం మీద విసిరి కొడుతుంది. విహారి వచ్చి సహస్రని లాగి పెట్టి కొడతాడు. అసలు నువ్వు ఆడదానివేనా నీకు బుద్ధి ఉందా పవిత్రమైన గుడిలో ఇలాంటి అపవిత్రమైన పని ఎలా చేస్తావ్ అని సహస్రని తిడతాడు. సహస్ర ఎక్కువ మాట్లాడకూడదు అని అనుకొని నువ్వు ఈ టైంలో ఎందుకు ఇక్కడికి వచ్చావ్ అని అడుగుతుంది. నీకు పెళ్లి అయింది కదా నువ్వు ఆడదానివే కదా లక్ష్మీ మీద నీకు కోపం ఉండొచ్చు కానీ చెప్పే పద్ధతి ఇది కాదు అని అంటాడు. సహస్ర అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
విహారి లక్ష్మీని బాధ పడొద్దని అంటాడు. లక్ష్మీ ఏడుస్తూ సహస్రమ్మతో ఇలా కోపంగా ఎందుకు మాట్లాడారు అని అడుగుతుంది. ఇక రౌడీలు బోనాల్లో పులి వేషం వేసి ఎంట్రీ ఇస్తారు. లక్ష్మీ తాళి పట్టుకొని ఏడుస్తుంటే విహారి లక్ష్మీని తీసుకొని వెళ్లి ఈ అపశకునానికి పరిష్కారం పంతుల్ని అడుగుదాం అని తీసుకెళ్తాడు. పంతులు బోనాలు దగ్గరకి వెళ్లడంతో అక్కడికి విహారి, లక్ష్మీ వెళ్తారు. ఇంతలో యమున వచ్చేస్తుంది. లక్ష్మీ, విహారి వాళ్ల కోసం వెతుకుతుంటుంది. విహారి అరటి తొక్క తొక్కి అగ్ని మీద పడబోతే లక్ష్మీ పట్టుకొని ఆపుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















