Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 6th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: లక్ష్మీ మెడలో తాళి తెంచేస్తానంటూ షాక్ ఇచ్చిన విహారి.. రేపే ముహూర్తం!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి లక్ష్మీకి కొత్త జీవితం ఇవ్వాలి అని లక్ష్మీ మెడలో తాళి తెంపేస్తా అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ గదిలోకి వెళ్లి జరిగిన రచ్చ అంతా గుర్తు చేసుకొని ఏడుస్తుంటుంది. ఒకరితో తాళి కట్టించావు.. అతనితో ఏర్పడిన బంధానికి విలువ లేకుండా చేస్తున్నావ్.. ఇప్పుడు మరొకరితో బంధం ఏర్పడేలా చేస్తున్నావ్ ఏంటి స్వామి ఇదంతా నేను ఒక ఆట బొమ్మలా కనిపిస్తున్నానా అని లక్ష్మీ దేవుడిని తలచుకొని ఏడుస్తుంది. ఇంతలో కనకానికి తండ్రి కాల్ చేస్తాడు. కన్నీటిని ఆపుకొని తండ్రితో మాట్లాడుతుంది.
ఆదికేశవ్: అమ్మా కనకం ఏమైంది అమ్మా గొంతు ఎందుకు అలా వణుకుతుంది. అక్కడంతా బాగానే ఉందా.
గౌరీ: అమ్మా కనకం ఏమైందే.
లక్ష్మీ: ఏడుపు ఆపుకొని.. నేను బాగానే ఉన్నానమ్మా బంగారంలా చూసుకొనే మీ అల్లుడు ఉండగా నాకు బాధలేంటమ్మా. ఆయన నా పక్కనే ఉంటే ఇంక నేను ఎలా ఉంటాను చెప్పండి.
గౌరీ: అవునమ్మా అల్లుడు బంగారం ఆయన నీ పక్కన ఉంటే మాకు ఏ దిగులు ఉండదు. ఇదిగో ఈయనే నీ గొంతు వణికింది అది ఇదీ అని లేని పోని అనుమానాలు పెట్టారు. నువ్వు ఏమైనా శుభవార్త చెప్తావని ఎదురు చూస్తున్నాం. అదేనే ఏదైనా విశేషం ఉందా అని ఎదురు చూస్తున్నాం.
లక్ష్మీ: శుభవార్త ఏంటి విశేషం ఏంటి నాకు ఏం అర్థం కావడం లేదమ్మా.
గౌరీ: నీకు అన్ని విడమరిచి చెప్పాలి. పిచ్చి మొద్దు నీకు అల్లుడు గారికి ఒక కొడుకో కూతురో పుట్టేస్తే మేం సంతోష పడతాం కదా అదే అడుగుతున్నా. నీకు అప్పుడప్పుడు కళ్లు తిరగడం కానీ పులుపు వస్తువులు తినాలి అని కానీ అనిపిస్తుంది.
లక్ష్మీ: అదేం లేదమ్మా. నువ్వు అనవసరంగా చాలా దూరం ఆలోచిస్తున్నావ్.
గౌరీ: అలాంటివేమైనా ఉంటే ఈ అమ్మకి చెప్పడానికి మొహమాట పడకు సరేనా.
లక్ష్మీ: సరే అమ్మా. కనకం తల్లిదండ్రులు ఫోన్ పెట్టేయగానే విహారి కాలే చేసి మాట్లాడాలి అని గార్డెన్‌కి రమ్మని పిలుస్తాడు. వద్దని లక్ష్మీ చెప్పినా విహారి వినకుండా రమ్మని పిలుస్తాడు.
విహారి: సహస్రకు లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. అవన్నీ ముదిరేలోపు ఈ సమస్యకు ఓ పరిష్కారం చూడాలి. లేకపోతే రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోతుంది. రెండు కుటుంబాల మధ్య దుఃఖం అలాగే ఉండిపోతుంది.
పద్మాక్షి: తనలో తాను జరిగిన పరిణామాలు చూస్తుంటే అన్ని తారు మారు అయ్యేలా ఉన్నాయి. విహారి, సహస్రల ప్లాన్ కూడా నాశనం అయ్యేలా ఉంది. ప్రతీ పరిస్థితిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. సహస్ర ఇక నుంచి మనం ప్రతీది ఆచితూచి అడుగువేయాలి. మనం లక్ష్మీ మీద గురి పెడుతున్నాం కానీ మరోవైపు విహారి మనసు విరిచేస్తున్నామేమో అని ఆలోచించుకోవాలి. ఈ సారి నుంచి చేసే ప్రతీ పని చాలా జాగ్రత్తగా చూడాలి.
సహస్ర: అవునమ్మా ఈ రోజుతో నాకు ఆ విషయం చాలా బాగా అర్థమైంది. లక్ష్మీని ఇంటి నుంచి పంపడం ఎంత ముఖ్యమో బావకి నా మీద ప్రేమ తగ్గకుండా చూసుకుంటా.
పద్మాక్షి: విహారి దృష్టిలో నీ విలువ పెరగాలి ఇక ఆ లక్ష్మీ విషయం నేను చూసుకుంటాలే. అయినా మీ పెళ్లికి అది అడ్డొచ్చినా మీ జీవితానికి అడ్డు గోడలా మారినా నేను చూస్తూ ఉంటానా ఇవన్నీ వదిలేసి మీ పెళ్లి గురించి ఆలోచించు. బ్యాచిలర్ పార్టీ ఉంది అన్నావ్ కదా అది చూసుకో ఇక నుంచి నువ్వు విహారికి నెగిటివ్ అవ్వొద్దు.
విహారి: లక్ష్మీ మన పెళ్లి నీ మెడలో ఉన్న తాళి ఇవి నీకు లక్షణ రేఖ లాంటివి. ఆ రేఖను దాటితేనే నువ్వు సంతోషంగా ఉంటావు. మిగిలిన జీవితం సంతోషంగా బతకగలవు.
లక్ష్మీ: అంటే ఏంటి విహారి గారు మీ ఉద్దేశం మన పెళ్లిని నా మెడలో ఉన్న తాళికి నాకు విలువ ఇవ్వొద్దని చెప్తున్నారా.
విహారి: అవును లక్ష్మీ ఇంకెన్ని రోజులు మన పెళ్లిని నువ్వు గుర్తు పెట్టుకుంటావు. ఇంకా ఎన్నాళ్లు నేను కట్టిన తాళిని నువ్వు పవిత్రంగా చూసుకుంటావ్. నీ మెడలో నేను కట్టిన తాళి తీసేసిన రోజే నువ్వు సంతోషంగా ఉంటావ్. ఆ తాళి తీసేస్తేనే నువ్వు మరో కొత్త జీవితాన్ని అందుకోగలవు.
లక్ష్మీ: మీరన్నంత సులువు కాదు విహారి గారు మనకి జరిగిన పెళ్లి మర్చిపోవడం అన్నా నా మెడలో తాళి తీసేయాలి అన్నా వేదమంత్రాల సాక్షిగా దేవతల దీవెనల మధ్య జరిగిన పెళ్లి బంధుమిత్రుల మధ్య జరిగిన పెళ్లి అగ్ని సాక్షిగా నా మెడలో పడిన ఈ తాళి అంత సులువుగా తీసేయడం జరగదు.
విహారి: కనక మహాలక్ష్మీ నీకు ఎలా చెప్పాలి నీ మెడలో వేలాడుతున్న ఆ తాళి నీ జీవితానికి అడ్డు గోడ ఆ మంగళ సూత్రం మాత్రమే అది తీసేసిన రోజు నీకు కొత్త జీవితం లభిస్తుంది.
లక్ష్మీ: మీరు ఊహించిన కొత్త జీవితం నాకు అవసరం లేదు విహారి గారు.
విహారి: కనక మహాలక్ష్మీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నా రెండు కుటుంబాలను కలపాల్సిన బాధ్యత నాకు ఉంది. వాటి కోసం నేను ఓ అబద్ధపు బతుకు బతుకుతున్నాను. ఒక పక్క నీకు న్యాయం చేయలేకపోతున్నా అని మరో వైపు వాళ్లకి మోసం చేస్తున్నాను అని నేను నలిగిపోతున్నా తెలుసా. ఈ క్షణం ఈ ఇంట్లో అలజడి రేగుతుందో అని ఎంత అల్లాడిపోతున్నానో తెలుసా. నేను ప్రశాంతంగా బతకడానికి నువ్వు ఓ కొత్త జీవితం మొదలు పెట్టడానికి అడ్డం ఆ తాళి మాత్రమే. అది తీసేసిన రోజే మనం సంతోషంగా బతకగలం.
లక్ష్మీ: పవిత్రమైన ఈ మంగళసూత్రాన్ని తీసేసే హక్కు ఎవరికీ ఉండదు విహారి గారు.
విహారి: అయితే నేను కట్టిన తాళిని నేనే తీసేస్తే. నీ మెడలో మూడు ముళ్లు వేసింది నేనే కదా అదే మూడు ముళ్లు నేనే తీసేస్తా.
లక్ష్మీ: మన మధ్య సమస్యకి నా మెడలో ఉన్న మూడు ముళ్లు విప్పడమే పరిష్కారం అనుకుంటున్నారా.
విహారి: అవును లక్ష్మీ దీని వల్ల ఇంకా కొత్త సమస్యలు వస్తాయా అని భయంగా ఉంది. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చేసే పనికి నువ్వు ఒప్పుకుంటావ్ అనుకుంటున్నా. మన మధ్య ఉన్న బంధం తెగాలి అంటే నేను కట్టిన తాళి నేనే తీసేస్తా. రేపు ఉదయం మనం గుడికి వెళ్తున్నాం. ఆ దేవుడి సాక్షిగా నీ మెడలో మూడు ముళ్లు వేశానో అదే దేవుడి సాక్షిగా నీ మెడలో తాళి నేను తీయబోతున్నా నేను చెప్పిన ఈ మాటని నువ్వు గౌరవిస్తావనుకుంటున్నా. ఎపిసోడ్ పూర్తయిపోతుంది.