Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 5th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: అంబిక, వీర్రాజు చేస్తున్న కుట్ర ఏంటి? అంబిక పెళ్లి ఆగిపోతుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode January 5th లక్ష్మీ, విహారిల బంధం గురించి తెలుసుకోవడానికి ఆదికేశవులు హైదరాబాద్‌కి వెళ్లాలని అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర గర్భవతి కావడానికి నేను కారణం కాదు.. అందుకు సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది.. అప్పుడు నేను నీతో మాట్లాడుతా అని విహారి లక్ష్మీతో చెప్తాడు. మరోవైపు ఆదికేశవులు కనకం పెళ్లి గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. సర్పంచ్ గారి అబ్బాయి ఇచ్చిన నెంబరుకి కాల్ చేయాలి అని ఫోన్ తీసి కాల్ చేస్తాడు.
ఆదికేశవులు అతనితో మాట్లాడి.. నాకు ఒకరి వివరాలు కావాలి.. హైదరాబాద్కి ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతాడు. రేపే రండి అని ఆయన చెప్పడంతో సరే అని ఆదికేశవులు చెప్తాడు. సిటీకి వచ్చి కాల్ చేస్తే అడ్రస్ ఇస్తా అని చెప్తాడు. ఆది కేశవులు లక్ష్మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నా కూతురు నా దగ్గర ఏం దాయదు కదా మరి ఏం చెప్పడం లేదు అని అనుకుంటాడు. ఆదికేశవుల అంతరాత్మ కనిపించి నువ్వు బాధపడతావని చెప్పలేదేమో.. అయినా నీ అల్లుడు గురించి నీకు ఏం తెలుసు.. ఎప్పుడైనా నీకు వాళ్ల అడ్రస్ ఇచ్చాడా.. నీ కూతురు.. అల్లుడు ఎప్పుడైనా నీకు వీడియో కాల్ చేశారా.. సమస్య వాళ్లలో లేదు నీలో ఉంది.. నువ్వు అతిగా నమ్మేస్తావు.. ఆరోజు తొందరపడి పెళ్లి చేశావ్..ఆరోజు గుడ్డిగా పెళ్లి చేసి ఈ రోజు కంగారు పడుతున్నావ్.. అమ్మాయి కాలేజ్కి వెళ్తాను అంటే దగ్గరుండి దింపేసివస్తావ్ కదా.. మరి పెళ్లి చేశావ్.. వెనకా ముందు ఎంక్వైరీ చేశావా.. కట్నం అనగానే పొలం అమ్మి కోటి రూపాయలు ఇచ్చావ్.. కట్నం ఇచ్చి నీ కూతుర్ని కష్టాలలోకి నెట్టావ్.. నీ కూతురు కార్చే ప్రతీ కన్నీటి కి కారణం నువ్వే అని అంటాడు.
ఆదికేశవులు ఆవేశంతో నేను ఏం చేసినా నా కూతురి సంతోషం కోసమే చేశాను.. అది బాధ పడితే ఎవరినీ వదలను అని అరుస్తాడు. ఇంతలో గౌరీ పరుగున వస్తుంది. ఏంటయ్యా ఏం అయింది అంటే కనకం విషయంలో కంగారుగా ఉందని చెప్తాడు. రేపు మాధవరావు అనే అమెరికాలో ఉన్న వ్యక్తి హైదరాబాద్లో ఉన్నారు ఆయన్ను కలుస్తాను అని అంటాడు. ఇప్పటికైనా కళ్లు తెరిచావా అయ్యా హైదరాబాద్లో మనకు మన కూతురు అల్లుడు కలిసి కూడా వాళ్ల ఇంటికి తీసుకెళ్లలేదు అని అడిగితే నా నోరు కుట్టేశావ్ అని అంటుంది.
లక్ష్మీ విహారి ఇచ్చిన గడువు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఓవైపు విహారి నిజం చెప్పేస్తా అని చెప్పడం.. మరోవైపు అంబిక పెళ్లికి ఒప్పుకోవడం గురించి ఆలోచిస్తుంది. ఇంకోవైపు తన తండ్రికి ఎందుకు అనుమానం వచ్చింది. ఎందుకు సిటీకి వస్తాను అన్నారు అని అనుకుంటుంది. ముగ్గురు మూడు వైపుల నుంచి తనని ప్రశ్నిస్తున్నట్లు కల కంటుంది.
ఉదయం అంబిక పెళ్లి వేడుకలు మొదలవుతాయి. అంబికను ఆడవాళ్లు అంతా పెళ్లి కూతురిలా రెడీ చేస్తారు. లక్ష్మీ అంబికకు పారాణి రాయడానికి వస్తుంది. మిగతా వాళ్లు అంతా పెళ్లి కొడుకుని రెడీ చేయడానికి వెళ్తారు. లక్ష్మీ అంబికకు పారాణి రాస్తుంటే ఈ ఇంట్లో నీ స్థానం నా కాళ్ల దగ్గర ఇలా అణిగిమనిణి ఉంటే నీకే మంచిది అని అంటుంది. లక్ష్మీ అంబికతో నేను మీ కాళ్ల దగ్గరే ఉండొచ్చు.. అలా అని తేలికగా మాట్లాడితే మీ కాళ్లు నా చేతిలోనే ఉన్నాయి.. కదా కాళ్లు విరిచి మూల పెడతా అని కాళ్లు గట్టిగా పట్టుకుంటుంది. అవ్వక అవ్వక పెళ్లి అవుతుందని వదిలేస్తున్నా లేదంటేనా అని అంటుంది. అంబిక మనసులో ఈ రోజు నీ చావుకి ముహూర్తం పెట్టానే అని అంటుంది.
అంబిక ఇచ్చిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి వీర్రాజు, పానకాలు ఊరిలో వెయిట్ చేస్తూ ఉంటారు. రోడ్డు కాపలా కాసి విహారి కంపెనీ నుంచి వస్తున్న వ్యక్తిని అడ్డుకొని పంట చూడటానికి ముహూర్తం సాయంత్రం బాగుందని చెప్పారు సాయంత్రం వరకు మీరు మా ఆతిధ్యం స్వీకరించాలి అని చెప్తాడు. అతన్ని తీసుకెళ్లి వాళ్ల గెస్ట్ హౌస్లో మాట్లాడి పంటకి మంచి రేటు ఇవ్వాలి అని మంచిగా మాట్లాడుతూ అతని మీద టీ పడేలా చేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















