Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today January 20th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: సహస్ర పార్టీలో రోహిత్ చెంప పగలగొట్టిన లక్ష్మీ.. కక్ష కట్టిన సహస్ర ఫ్రెండ్స్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode సహస్ర పార్టీకి లక్ష్మీని తీసుకెళ్లిందని లక్ష్మీని సహస్ర ఫ్రెండ్స్ ఇబ్బంది పెడతారని యమున విహారికి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్ర బ్యాచ్‌లర్ పార్టీ ఇస్తుంది. పార్టీలో విహారి అంతు చూడాలని అంబిక తన పార్టనర్ సుభాష్‌తో కలిసి ప్లాన్ చేస్తుంది. సహస్ర ఫ్రెండ్స్ ఒక అమ్మాయి, అబ్బాయితో కలిసి సహస్ర రెడీ అయి ఇంట్లో వాళ్లకి చెప్పి పార్టీకి వెళ్తున్నాం అని చెప్తుంది. అంబిక కూడా రెడీ అయిపోతుంది. ఇక సహస్ర ఫ్రెండ్స్ లక్ష్మీని కూడా తీసుకెళ్తామని అంటారు. తాను ఎందుకని సహస్ర అడిగితే అక్కడ ఏమైనా పనులు ఉంటే చేస్తుందని చెప్తారు.
సహస్ర లక్ష్మీని పార్టీకి పిలిస్తే నేను ఎందుకు అని లక్ష్మీ అడుగుతుంది. దాంతో సహస్ర ఫ్రెండ్స్ ఓనర్స్‌కి పనమ్మాయి ఇలా ప్రశ్నిస్తుందేంటి అని అడుగుతారు. దాంతో సహస్ర లక్ష్మీని తిడుతుంది. యమున వద్దని అంటే సహస్ర ఫ్రెండ్స్ రెచ్చగొడతారు. దాంతో పద్మాక్షి యమున మీద అరుస్తుంది. సహస్ర కూడా యమున మీద సీరియస్ అవ్వడంతో లక్ష్మీ తాను వెళ్తానని అంటుంది. అందరూ కలిసి పార్టీకి వెళ్తారు. పద్మాక్షి యమునతో లక్ష్మీని నెత్తినెక్కించుకుంటున్నావ్ అని తిడుతుంది.
మరోవైపు విహారి సత్యని కలుస్తాడు. ప్రకాశ్ గాడికి ఎంత ధైర్యంరా నా ముందే వచ్చి కూర్చొన్నాడు వాడిని చంపేయాలని కోపం ఉంది ఆది కేశవ్ గారు ఉండటంతో ఏం చేయలేకపోయాను అంటాడు. దానికి సత్య వాడిని చంపడం పరిష్కారం కాదని అంటే విహారి దానికి వాడితోనే ఆదికేశవ్ గారికి జరిగింది చెప్పించి నిజం తెలిసేలా చేస్తానని అంటాడు. ఇక యమున విహారికి కాల్ చేసి పార్టీకి వెళ్లమని లేదంటే సహస్ర ఫీలవుతుందని సహస్ర లక్ష్మీని కూడా తీసుకెళ్లిందని చెప్తుంది. సహస్ర ఫ్రెండ్స్ ఎలాంటి వారు ఉంటారో అని నాకు భయంగా ఉందని అంటుంది. నేను చూసుకుంటాలే అని విహారి చెప్తాడు. సహస్ర పార్టీ మొదలవుతుంది. అందరూ పాటలు పెట్టుకొని చేతిలో మందు గ్లాసులు పట్టుకొని డ్యాన్స్‌లు చేస్తుంటారు. లక్ష్మీ కాస్త దూరంగా నిల్చొని ఉంటుంది. సహస్ర ఫ్రెండ్ ఒకబ్బాయి లక్ష్మీని డ్యాన్స్ చేయమని అంటాడు. వద్దని డ్యాన్స్ రాదని లక్ష్మీ చెప్పినా వినకుండా లక్ష్మీ చేయి పట్టుకొని తీసుకెళ్లబోతే లక్ష్మీ లాగి పెట్టి ఒక్కటిస్తుంది. దాంతో రోహిత్ కింద పడిపోతాడు. అందరూ షాక్ అయిపోతారు.
సహస్ర వెళ్లి లక్ష్మీని తిడుతుంది. లక్ష్మీని సహస్ర కొట్టబోతే రోహిత్ అడ్డుకుంటాడు. ఇక లక్ష్మీని పంపేసి మళ్లీ డ్యాన్స్లు చేస్తారు. రోహిత్ కోపంతో ఓ చోట సిగరెట్ తాగుతుంటే మరో ఫ్రెండ్ వెళ్లి రోహిత్‌ని రెచ్చగొడుతుంది. నీకు అది దొరకదు రోహిత్ అని అంటుంది. దాంతో రోహిత్ అందరి ముందు నన్ను అవమానించింది దాన్ని ఈ రోజు ఇబ్బంది పెట్టే తీరుతా అంటాడు. ఇక పద్మాక్షి వసుధతో యమునని చూసి నాకు ఇష్టంలేని వాళ్ల పేరు నా కూతురి పెళ్లి శుభలేఖలో రాయాల్సి వచ్చింది నా ఖర్మ అని తిడుతుంది. అందరూ బలవంతం చేయడం వల్లే శుభలేఖలో పేరు రాయించానని అవసరం అయితే శుభలేఖలో పేరు మార్పించేస్తాను అంటుంది. దాంతో యమున వదిన నా పేరు లేకపోయినా పర్లేదు కానీ పెళ్లి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగాలి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ని అనుమానిస్తూ ప్రశ్నించిన దీప.. దాసు దుస్థితికి ఏడుస్తున్న పారు.. జ్యో దొరికిపోతుందా!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

