Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 6th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: పంచె కట్టుతో కనకం, విహారి రొమాన్స్.. సహస్రకు విహారితో పెళ్లి కాదని చెప్పిన సోదమ్మ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode విహారి, కనకం కలిసి పూజ చేయడం సహస్రకు సోదమ్మ నువ్వు కోరుకున్న పెళ్లి అవ్వదని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారికి పంచె కట్టుమని అందరూ కనకానికి చెప్పేసి వెళ్లిపోతారు. నేనే ఎలాగోలా కట్టుకుంటా అని విహారి అంటే కనక మహాలక్ష్మీ ముఖం దాచుకుంటుంది. ఇక విహారి కట్టుకోవడం రావడం లేదని కనకంతో చెప్తాడు. అందరూ తొందరగా రామ్మని చెప్పడంతో విహారి తనకు పంచె కట్టుకోవడం రావడం లేదని నువ్వే కట్టు అని అంటాడు. కనకం నేను కట్టను అంటుంది.
పెద్దావిడ చెప్పింది కదా నేనే సిగ్గుపడటం లేదు నువ్వు పడొద్దు అని చెప్పి కట్టమంటాడు. ఇక కండీషన్ కూడా పెడతాడు. ఏంటి ఆ కండీషన్ అని కనకం అడిగితే కళ్లు మూసుకొని కట్టమని చెప్తాడు. కళ్లు మూసుకొని ఎలా కట్టాలని లక్ష్మీ అడుగుతుంది. లక్ష్మీ ఎలాగోలా కడతానని అంటుంది. కనక మహాలక్ష్మీ కళ్లు మూసుకొని విహారి పంచె అందిస్తే కనకం పంచె కడుతుంది. విహారి కితకితలు అని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. విహారి కనకంతో నీకు నిజంగానే పంచెక కట్టడం వచ్చా అని అడిగితే మీరు కదలకుండా ఉంటేనే కట్టేస్తా అంటుంది. విహారి నోరు నొక్కేసుకొని కితకితలు ఆపుకొని నవ్వుకుంటాడు. మొత్తానికి కనకం భర్తకి పంచె కట్టేస్తుంది. అల్లుడు గారు అదిరిపోయిందని ఆదికేశవ్ అంటాడు. పూజకు అంతా సిద్ధం చేస్తారు. విహారి, కనకం పూజకు కూర్చొంటారు.
విహారి పూజలో కనకం నుదిట కుంకుమ పెడతాడు. పాపిటిలో కూడా బొట్టు పెట్టమని అనడంతో విహారి ఆలోచించి ఆగిపోతాడు. ఇక అందరూ చెప్పడంతో విహారి కనకం నుదిటిన బొట్టు పెడతాడు. ఇక బామ్మ కనకంతో ఆ బొట్టు నీ మాంగల్యానికి నిదర్శనం అని చెప్తుంది. ప్రతీ రోజు నీ భర్తతో ఇలా పాపిట బొట్టు పెట్టించుకో అని భర్త కాళ్లకి దండం పెట్టని చెప్తుంది. విహారి, కనకం ఇద్దరూ మొహమాటంగా ఒకర్ని ఒకరు చూసుకుంటారు. ఇక కనక అయిగిరి నందిని పాట పాడుతూ పూజ చేస్తుంది. విహారి ఆశ్చర్యపోతూ కనకం వైపు చూస్తాడు. పూజ తర్వాత కనకం దేవుడికి హారతి ఇచ్చి అందరికీ హారతి ఇస్తుంది. ఇక బామ్మ కనకంతో భర్త ఆశీర్వాదం తీసుకోమని చెప్తుంది. కనకం విహారి కాళ్లకు దండం పెడితే విహారి అక్షింతలు వేసి ఆశీర్వాదం ఇస్తాడు. కనకం మురిసిపోతుంది.
మరోవైపు సహస్ర వాళ్లు ఆదికేశవ్ ఇంటికి వస్తుంటారు. ఇక ఆదికేశవ్ అల్లుడి కోసం గోదావరోళ్ల స్టైల్ చూపిస్తాడు. పెద్ద ఆకులో ఫుల్లుగా వంటలు వడ్డిస్తారు. విహారి ఆశ్చర్యపోతాడు. ఇక విహారి పక్కనే కనకాన్ని కూర్చొపెట్టి ఒకరితో ఒకరికి తినిపించుకోమని చెప్తారు. అందరి కోసం విహారి, కనకం ఒకరికి తినిపించుకుంటారు. కూతురు అల్లుడిని అలా చూసి అందరూ మురిసిపోతారు. ఇక విహారికి రాజీ, ఆదికేశవ్, బామ్మం అందరూ ఫుల్లగా తినిపించేస్తారు. మరోవైపు సోదమ్మ సహస్ర కారుకి అడ్డంగా ఆగుతుంది. సహస్ర కిందకి దిగి ఆమెని తిడుతుంది. నీ మనసుతో చూడాలి నువ్వే తల్లి అని అంటుంది. పెళ్లి కోసం తెగా ఆరాట పడుతున్నావని కానీ అది జరిగేలా లేదని అంటుంది. పద్మాక్షితో నీ కూతురు అందుకోవాల్సినది మరెవరో అందుకుంటున్నారని అంటుంది. ఇక అంబికతో నీ మనసులో దాచుకున్న విషయాలు త్వరలోనే అందరికీ తెలుస్తాయని అంటుంది. సహస్రతో నీ కోపమే నీకు శత్రువు అయి కొంప ముంచుతుందని అంటుంది. ఇక విహారి తిన్న ఆకులో కనకాన్ని తినమని బామ్మ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.