Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 27th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారికి పెళ్లైందని సహస్ర వాళ్లతో చెప్పేసిన పంతులు.. విహారి పని అయిపోయినట్లే!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం, విహారిలు కలిసి గుడిలో వ్రతం చేశారని పంతులు సహస్ర వాళ్లతో చప్పేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ, విహారిల మెడలో పంతులు దండ వేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలని చెప్తారు. కుంకుమార్చన వ్రతంలో ఇదే ముఖ్యమైన ఘట్టం అని అంటారు. దాంతో సంకోచిస్తూనే విహారి, లక్ష్మీలు ప్రదక్షిణలు చేస్తారు. ఇక సహస్ర వాళ్లు అదే గుడికి వస్తారు. మెట్ల పూజ చేసి ఎవరో మెట్ల పూజ చేశారని మోకాల మీద నడిచారని అనుకుంటారు. వసుధ, యమునలు పూజ చేసింది ఎవరో అని పొగిడితే సహస్ర వాళ్లు చాదస్తం అని అనుకుంటారు.
కనకం, విహారిలు గుడి చుట్టూ తిరుగుతారు. మెట్ల ఎక్కడం వల్ల కనకం సరిగా నడవ లేకపోతుంది. విహారి ప్రదక్షిణలు ఆపేద్దాం అంటే వద్దని తిరుగుతానని అంటుంది. ఇక లక్ష్మీ పరిస్థితి అర్థం చేసుకున్న విహారి లక్ష్మీని ఎత్తుకొని ప్రదక్షిణలు చేస్తాడు. సహస్ర వాళ్లు అటువైపే వస్తుంటారు. విహారి వాళ్లని చూసుకోరు. ఇక విహారి వాళ్లు ప్రదక్షిణలు పూర్తి అయ్యావని చెప్పగానే పంతులు హోమం చేస్తే పూజ పూర్తి అయినట్లని చెప్పి ఇద్దరినీ హోమం చేయించమని మరో పంతులుకి చెప్తారు. లక్ష్మీ, విహారిలు కలిసి హోమం చేస్తుంటారు. వెనకాలే సహస్ర వాళ్లు దేవుడిని దర్శించుకుంటారు. ఇక పద్మాక్షి పంతులుకి శుభలేఖ ఇస్తుంది. దేవుడి పాదాల దగ్గర పూజ చేయమని అంటుంది. ఇక పంతులు శుభలేఖ చూసి అందులో విహారి అనే పేరు చూసి ఇందాక ఓ జంట వచ్చారు అమ్మాయి కుంకుమార్చన వ్రతం చేస్తుంది. ఆ అబ్బాయి పేరు కూడా విహారినే అని చెప్తారు. అందరూ షాక్ అయిపోతారు.
వసుధ సహస్రతో అంత డీప్‌గా ఆలోచించకు సేమ్ పేరు వాళ్లు ఉంటారు కదా అని అంటుంది. పంతులు కూడా అలా అనే అంటారు. ఇక పూజ చేసి శుభలేక దేవుడి దగ్గర పెట్టి సహస్ర వాళ్లకి ఇస్తారు. సహస్ర మాత్రం అదే ఆలోచనలో ఉంటుంది. బావ పేరు లాంటి పేరుతో జంట రావడం అన్నారు అనడంతో ఏదోలా ఉందని అంటుంది. విహారి అనే పేరు అరుదుగా ఉంటుంది కదా అని అంటుంది. ఇక అంబిక సహస్రతో ఒకసారి వెళ్లి ఆ జంట ఇక్కడ ఉన్నారో లేదో పంతులుగారికి కనుక్కో అంటుంది. సహస్ర వెళ్లబోతే ఏంటి ఈ చాదస్తం అని పద్మాక్షి తిడుతుంది. లక్ష్మీ, విహారిలు వ్రతం పూర్తి చేసి హోమం చుట్టూ తిరుగుతూ ఉండగా లక్ష్మీ సహస్ర వాళ్లని చూస్తుంది. వీళ్లు ఇక్కడికి వచ్చారేంటి అనుకొని విహారికి చెప్తుంది. విహారి వాళ్లని చూసి షాక్ అయిపోతాడు. ఇక విహారి శుభలేఖ గురించి చెప్తాడు. ఆ విషయమే గుర్తు లేదని చెప్తాడు.
విహారి కనకంతో నువ్వు ఇక వెంటనే బయల్దేరు అని చెప్తాడు. సహస్ర వాళ్లు ఇంటికి వెళ్తూ పార్కింగ్‌లో అంబిక, సహస్ర వాళ్లు కారు చూస్తారు. విహారి అది చూసి షాక్ అయిపోతాడు. పంతులు చెప్పిన విహారి, మన విహారి ఒక్కరేనా అని అంబిక అంటుంది. దాంతో యమున పంతులు చెప్పింది వాళ్లు దంపతులుగా వచ్చారని మన విహారి ఎలా ఒకటి అవుతారని అంటుంది. విహారి ఏం చేయాలా అని చాలా టెన్షన్ పడతాడు. సహస్ర, అంబికతో లోపలికి వెళ్లి చూద్దామని అంటుంది. ఇద్దరూ పరుగులు తీస్తారు. మనం దొరికిపోతాం కనకం అని అంటాడు. ఇక విహారి నేనే వాళ్లకి ఎదురు అవుతాను అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎంత పని చేశావ్ జ్యో.. కూలీగా దీప కంటపడ్డ కార్తీక్.. ఇది మామూలు షాక్ కాదుగా!