Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today December 19th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: ఫస్ట్‌నైట్ జరగాల్సిందే అంటూ విహారిని వాటేసుకున్న కనకం.. వీడియో కాల్‌లో చూసేసిన సహస్ర!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం విహారిలు తొలిరేయి గదిలో ఉండగా సహస్ర అనుమానంతో వీడియో కాల్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం, విహారిలతో ఆదికేశవ్ ఫ్యామిలీ ఫస్ట్‌నైట్ ముందు ఆడించాల్సిన ఆటలన్నీ ఆడిస్తారు. విహారి కళ్లకు గంతలు కట్టి అమ్మాయిల చేతులు తాకించి అందులో కనక మహాలక్ష్మీ ఎవరో కనిపెట్టమని అంటారు. విహారి కరెక్ట్‌గా కనకాన్ని కనిపెట్టేస్తారు. అందరూ ఎగిరి గంతులేస్తారు. ఇక సహస్ర ఆన్‌లైన్‌లో పెళ్లి కోసం నగలు చూస్తూ ఉంటుంది. అంబిక సహస్ర దగ్గరకు వచ్చి సహస్రని రెచ్చగొట్టి విహారి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని అనుకుంటుంది.
అంబిక: సహస్ర విహారి మీద నీకు అనుమానమే రాలేదా. ముంబయి నుంచి విహారి హైదరాబాద్ ధర్మపురం వచ్చాడు అదంతా నీకు నమ్మాలి అనిపించిందా. మనం పండుని అడిగినప్పుడు ముందు తెలీదు అని చెప్పి తర్వాత కవర్ చేసినట్లు అనిపించడం లేదా. పండులో ఉన్న తడబాటు అయినా నీకు అనుమానం రాలేదా.
సహస్ర: పండుకి మనల్ని ఎప్పుడు చూసినా తడబాటే అందులో ఏముంది.
అంబిక: మనతో పాటు హైదరాబాద్ రమ్మంటే విహారి రాలేదు కనీసం ఇంటికి రాలేదు ఇప్పటి వరకు ఒక ఫోన్ కూడా నీకు చేయలేదు. ఇంతకీ విహారి ఏమైనట్లు.
సహస్ర: ఒకే పిన్ని ఇప్పుడే బావకి వీడియో కాల్ చేసి ఎక్కడున్నాడో మీకు నిరూపిస్తాను.
విహారి ఫస్ట్‌నైట్ గదిలోకి వస్తాడు. గది అందంగా అలంకరించడం చూసి మొత్తం గది అంతా తిరిగి బెడ్ మీద కూర్చొంటాడు. ఇంతలో సహస్ర వీడియో కాల్ చేస్తుంది. విహారి షాక్ అయిపోతాడు. లిఫ్ట్ చేయడు. దానికి అంబిక శోభనం గదిలో పెళ్లి కొడుకులా బిజీగా ఉన్నాడేమో అని అంబిక అంటే దానికి సహస్ర ఆ పోలిక ఏంటి పిన్ని అని సీరియస్ అవుతుంది. మళ్లీ సహస్ర వీడియో కాల్ చేస్తుంది. విహారి లిఫ్ట్ చేయకపోవడంతో సహస్ర నార్మల్ కాల్ చేస్తుంది. ఏదో ఒకటి మ్యానేజ్ చేద్దామని విహారి కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడున్నావ్ బావ అని అడుగుతుంది. విజయవాడలో ఉన్నానని చెప్తాడు. వీడియో కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఏంటి అని అడుగుతుంది. దాంతో సిగ్నల్ సరిగా లేదని కవర్ చేస్తాడు. పండు విషయం అడిగితే తడబడ్డాడని సహస్ర చెప్తే విహారి రివర్స్‌లో నా మీద ఎంక్వైరీ చేస్తున్నావా అని చిరాకుగా ఉన్నట్లు ఫోన్ కట్ చేసేస్తాడు. సహస్ర అంబికతో మేం ఇద్దరం క్లియర్‌గా ఉంటే నువ్వు గొడవలు పెట్టేస్తున్నావ్ పిన్ని అని అంటుంది. ఇక విహారి ఇది సహస్ర అనుమానమా లేక ఇంట్లో అందరికీ వచ్చిందా అని అనుకుంటాడు. ఇక అంబిక అత్త తన మీద ఎందుకో ఎక్కువ ఫోకస్ పెట్టిందని జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాడు.
ఇక అందరూ కనకాన్ని గదిలోకి పంపిస్తారు. కనకం విహారి దగ్గరకు వెళ్తుంది. కనకం విహారికి పాల గ్లాస్ ఇచ్చి విహారి తీసుకునే టైంకి తీసుకెళ్లి పక్కన పెట్టేస్తుంది. తర్వాత విహారితో జీవితాన్ని పంచుకునే వాళ్లే పాలు పంచుకోవాలని అందుకే పక్కన పెట్టేశానని చెప్తుంది. ఇక తాళిని మాత్రం ఎప్పటికీ గౌరవిస్తానని నన్ను దీవించండి అని విహారి కాళ్ల మీద పడుతుంది. విహారి కనకాన్ని ముట్టుకోకుండా పైకి లేవమని చెప్తాడు. కాలం నన్ను ఇంత క్లిస్ట పరిస్థితుల్లో పడేస్తుందని అనుకోలేదని చెప్తుంది. ఇక విహారి కాలం పెట్టే పరీక్షలు మనం ఎదుర్కొవాలని అంటాడు. ఇక ఇద్దరూ వేరు వేరుగా పడుకోవడానికి వెళ్తారు. ఇంతలో కనకం బల్లి చూసి వెళ్లి విహారిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. విహారి లేవమన్నా బల్లి అని లేవదు. తర్వాత సిగ్గు పడుతూ విహారికి సారీ చెప్తుంది. విహారి నవ్వుకొని పడుకోమని చెప్తాడు. విహారి కింద పడుకుంటే కనకం బెడ్ మీద పడుకుంటుంది. ఉదయం గౌరీ కనకం వాళ్ల గది తలుపులు కొడుతుంది. అది విన్న కనకం కంగారుగా భర్తని లేపుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప రెస్టారెంట్.. నిప్పు రాజేసిన పేరు.. భార్య వల్ల కార్తీక్ బికారీ అయిపోతాడా?