Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 25th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారికి హార్ట్‌బ్రేక్.. నడిరోడ్డు మీద మందు తాగుతూ నానా రచ్చ!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode August 25th లక్ష్మీ తనకు విడాకులు ఇస్తుందని విహారి మందు తాగుతూ రాత్రులు రోడ్డు మీద దేవదాసు అవతారం ఎత్తడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ తనకు విడాకులు ఇవ్వాలని అనుకుందని విహారికి తెలిసి లక్ష్మీని నిలదీస్తాడు. ఎందుకు విడాకులు కావాలో కారణం చెప్పు అని అడుగుతాడు. లక్ష్మీ విహారితో నేను మీకు ఏం చెప్పలేను నాకు విడాకులు కావాలి ఆ పేపర్ల మీద మీరు సంతకం పెట్టాలి అంటుంది.
విహారి కోపంగా నువ్వు అడిగితే నేను ఇచ్చేయాలా.. తాళి గురించి బంధం గురించి అన్నీ చెప్పావ్ ఇప్పుడు నువ్వు అడిగితే నేను విడాకులు ఇచ్చేయాలా.. నీ మెడలో నా ఆయుష్షు మోస్తున్నా అన్నావ్.. ఇలాగే నా భార్యగా ఉండిపోతున్నా అన్నావ్.. ఇది నీ నిర్ణయమేనా ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. లక్ష్మీ ఏం చెప్పకుండా నాకు విడాకులు కావాలి మీరు విడాకులు ఇవ్వాలి అంటే అని చెప్పి ఆటో ఎక్కి వెళ్లిపోతుంది.
విహారి కింద పడి వర్షంలో ఏడుస్తాడు. చారుకేశవ లక్ష్మీని ఆపాలని ప్రయత్నిస్తాడు. తర్వాత ఏడుస్తున్న విహారిని పట్టుకొని ఏడుస్తాడు. మామయ్య ఏంటి మామయ్య ఇది ఇంట్లో ఎలా చెప్పాలి అని అనుకుంటే ఇదేంటి మామయ్య విడాకులు అంటుంది.. నేను తనకు న్యాయం చేస్తాను అంటే నాకు అన్యాయం చేస్తుంది ఏంటి మామయ్య అని ఏడుస్తాడు. ఇంటికి వెళ్దాం పద అని చారుకేశవ అడిగితే నన్ను ఒంటరిగా వదిలేయ్ మామయ్య అని చారుకేశవని విహారి తోసేస్తాడు. లక్ష్మీతో సంతోషంగా ఉన్న రోజులు గుర్తు చేసుకొని విహారి చాలా చాలా ఏడుస్తాడు.
లక్ష్మీ విహారిని గుర్తు చేసుకొని లక్ష్మీ చాలా ఏడుస్తుంది. వసుధ చూసి ఏమైందని అడుగుతుంది. నన్ను మీ అమ్మ అనుకొని బాధ పంచుకో అని అంటుంది. లక్ష్మీ వసుధని పట్టుకొని ఏడుస్తుంది. ఇంతలో చారుకేశవ వచ్చి తను మన మనిషి అని మనం అనుకున్నాం కానీ తను మన మనిషి కాదు మనతో ఏం చెప్పదు అని అంటాడు. అలా అనకు బాబాయ్ అని లక్ష్మీ అంటే మరి అంత పెద్ద నిర్ణయం మాకు ఎందుకు చెప్పలేదని అంటాడు. అంత పెద్ద నిర్ణయం ఏంటి అని వసుధ అడిగితే లక్ష్మీ విహారికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుందని చెప్తాడు. ఏంటి లక్ష్మీ ఇది..విహారి నీ ప్రాణం అన్నావ్ కదా.. తాళే ప్రాణం అంటావ్ కదా అని అడుగుతుంది. లక్ష్మీ తనని ఏం అడగొద్దని నేనేం చెప్పలేను అని అంటుంది. ఇది కచ్చితంగా నీ నిర్ణయం కాదు ఎవరో నీతో ఇలా చేయిస్తున్నారు నీ వెనక ఎవరు ఉన్నారు చెప్పుఅని వసుధ అడుగుతుంది. నిజం చెప్పకపోతే విహారి మీద ఒట్టే అని వసుధ ఒట్టు వేస్తుంది.
లక్ష్మీ ఏడుస్తూ యమునమ్మ నిర్ణయం అని చెప్తుంది. చారుకేశవ, వసుధలు షాక్ అయిపోతారు. యమునమ్మకి నాకు విహారికి మధ్య ఉన్న బంధం గురించి నిజం తెలుసు అని లక్ష్మీ చెప్తుంది. జరిగింది అంతా చెప్తుంది. విహారి గారికి యమునమ్మకి నిజం తెలుసు అని తెలీదు. అలా తెలిస్తే విహారి ఊరుకోరు.. యమునమ్మ తట్టుకోలేదని అంటుంది. మీ నాన్నకి ఏం చెప్తావమ్మా.. అందరి సమస్యలకు పరిష్కారం నీ విడాకులు అని నువ్వు అనుకుంటే నీ జీవితం ఏమైపోతుందని అడుగుతారు. లక్ష్మీ ఇద్దరికీ దండం పెట్టి ఈ నిర్ణయంలో నేను యమునమ్మ నిర్ణయం వింటాను మీరేం చెప్పొద్దు అని అంటుంది. చారుకేశవ వసుధని తీసుకెళ్లిపోతాడు. లక్ష్మీ చాలా ఏడుస్తుంది.
విహారి రాత్రి వర్షంలో తడుస్తూ మందు తాగుతూ ఉంటాడు. లక్ష్మీ ఏడుస్తూ ఉంటుంది. కనక మహాలక్ష్మీ అని విహారి అరుస్తుంటాడు. కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగిన నేను లక్ష్మీ మెడలో తాళి కట్టడంతో కష్టాలు చూశాను.. ఏడ్చాను.. అయినా నేను ఒకమ్మాయి కోసం ఏడ్వడం ఏంటి.. తనని అర్థం చేసుకొని నేను ప్రేమిస్తే తను నన్ను వదిలేసి ఎలా వెళ్లిపోతుంది. కనక మహాలక్ష్మీ నిన్ను వదలను.. దానికి బదులు నా ప్రాణం వదిలేస్తా అని ఏడుస్తాడు. మందు తాగుతూనే ఉంటాడు. మరోవైపు యమున కూడా చాలా ఏడుస్తుంది.
విహారి ఇంకా ఇంటికి రాలేదని యమున కంగారు పడుతూ ఉంటుంది. ఫోన్ చేస్తూనే ఉంటుంది. పద్మాక్షి వాళ్లు వచ్చి అడిగితే విహారి ఇంకా రాలేదని చెప్తుంది. ఇంతలో సహస్ర వచ్చి బావ ఫోన్ కలవడం లేదని బాధ పడుతుంది. అందరూ చాలా కంగారు పడతారు. అందరూ వెళ్లి వెతుకుదామని అనుకుంటారు. లక్ష్మీ చాలా కంగారు పడుతుంది. లక్ష్మీ ఏడుస్తూ నా వల్లే మీకు ఈ బాధ అని అనుకుంటుంది. వర్షంలో చారుకేశవ, సహస్, లక్ష్మీ వెతుకుతూ ఉంటారు. లక్ష్మీ ఓ చోట విహారి మందు తాగడం చూస్తుంది.
విహారి అని పరుగులు పెడుతుంది. విహారి గారు ఏంటి ఎప్పుడూ లేనిది ఈ అలవాటు ఏంటి అని అడుగుతుంది. తాగితే మర్చిపోతారంట కదా మర్చిపోయే వరకు తాగుతూనే ఉంటాను అంటాడు. విడాకులు ఇవ్వొద్దు అంటే నువ్వు వినలేదు కదా ఇక నేను నీ మాట ఎలా వింటాను అంటాడు. ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారని లక్ష్మీ అంటే మా వాళ్లు ఏమైతే నీకు ఏంటి నేను ఏమైతే నీకు ఏంటి అడుగుతాడు. విహారి పడిపోబోతే లక్ష్మీ పట్టుకుంటుంది. విహారి లక్ష్మీని తోసేస్తాడు. ఇద్దరినీ ఎవరో వీడియో తీస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















