అన్వేషించండి

Kalavari Kodalu Kanaka Mahalakshmi August 14th: లవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: కనకానికి సాయం చేసిన విహారి.. అమ్మ కోసం మరదల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పిన విహారి!

Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode మేనత్త కోపం తగ్గించడానికి అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటానని విహారి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకమహాలక్ష్మీ తండ్రి పరిస్థితికి ఏడుస్తుంది. రాజీ కనకమహాలక్ష్మీని ఓదార్చుతుంది. పేషెంట్ ఫార్మ్ ఫిల్ చేయమని నర్స్ కనకమహాలక్ష్మీకి చెప్తుంది. మరోవైపు విహారి కూడా తన తల్లి ఫామ్ నింపుతుంటాడు. కనకమహాలక్ష్మీ కూడా అక్కడికే వెళ్తుంది. కనకమహాలక్ష్మీ రాగానే విహారికి ఫోన్ వచ్చి పక్కకి వెళ్తాడు. ఈ లోపు కనకమహాలక్ష్మీ ఫామ్ నింపి దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తుంది. విహారి కనకాన్ని చూస్తాడు.

విహారి: ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే.
కనకమహాలక్ష్మీ: దేవుడా నాన్న ఏ తప్పు చేయలేదు ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు దయచేసి నాన్నకి ఏం కాకుండా చూడు స్వామి కావాలి అంటే నా ఆయుష్షు కూడా ఆయనకే ఇచ్చేయ్..
విహారి: మీరు ఇక్కడ.
కనకమహాలక్ష్మీ: నాన్న మా నాన్నకి.
విహారి: మీ నాన్నకి ఏమైందండి. ఫామ్‌ ఫిల్ చేయడానికి వచ్చారా నేను ఫిల్ చేస్తాను పదండి. ఇప్పుడు చెప్పండి అసలేమైంది.
కనకమహాలక్ష్మీ: మా నాన్నకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది నాకు కాళ్లు చేతులు ఆడటం లేదు.
నర్సు: ఇక్కడ ఆదికేశవ్‌ తాలుకా ఎవరూ తొందరగా రండి డాక్టర్ పిలుస్తున్నారు. కనకమహాలక్ష్మీ పరుగులు తీస్తుంది.
ప్రకాశ్: పాపంరా అమ్మాయి.
విహారి: నీకు ఆ అమ్మాయి ముందే తెలుసా.
ప్రకాశ్: నీ లగేజ్ కోసం వాళ్ల ఇంటికే వెళ్లాను. అసలేం జరిగింది అంటే అని ప్రకాశ్ మొత్తం చెప్తాడు. అది సరే అమ్మకి ఎలా ఉంది. వీడు అమెరికా అమ్మాయి ఆంధ్ర ఇద్దరికీ సెట్ చేసుకుంటే నాకు కలిసొచ్చేలా ఉంది. నేను సెటిల్ అయిపోతా.
గౌరీ: కూతురి పెళ్లి కూతురి పెళ్లి అని ఇంత వరకు తెచ్చుకున్నారు ఆయనకి ఏమైనా అయితే మా పరిస్థితి ఏంటి రాజీ. 
నర్సు: అమ్మ డాక్టర్ గారు లోపలికి ఒక్కర్నే పిలుస్తున్నారు.
గౌరీ: ఏమైందో ఇక్కడే చెప్పండి ఆయనకు ఏమైంది. అమ్మ కనకం నాకు ఏదో కీడు శంఖిస్తుంది.
కనకమహాలక్ష్మీ: నాన్న గురించి నువ్వే అలా ఆలోచిస్తే ఎలా అమ్మ నేనువెళ్లి ఏమైందో తెలుసుకొని వస్తాను.

కనకమహాలక్ష్మీ లోపలికి వెళ్తుంది. తండ్రి పరిస్థితి చూసి ఏడుస్తుంది. మీ నాన్నకి సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని ఏ ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ అవ్వడం లేదని డాక్టర్ కనకమహాలక్ష్మీతో చెప్తారు. కనకం నాన్న నాన్న అని ఏడుస్తుంది. తన తండ్రిని కాపాడమని డాక్టర్ కాళ్లు పట్టుకుంటుంది. ఇంతలో గౌరీ వచ్చి అయ్యా ఏమైంది అయ్యా అని ఏడుస్తుంది. డాక్టర్ ఇద్దరినీ బయటకు పంపేస్తారు. మరోవైపు ఎక్కువ స్ట్రెస్‌కి గురవకుండా చూసుకుంటే మీ అమ్మని కాపాడుకోవచ్చని విహారితో డాక్టర్ చెప్తారు. తన వల్ల ఇంటికి మొత్తం నష్టమే అని తన ఒక్కదాన్ని స్వార్థం వల్ల తనకు ఈ శిక్ష పడిందని విహారి తల్లి ఏడుస్తుంది. విహారి కూడా ఏడస్తాడు.

విహారి: ఏంటి నాన్న ఇది అమ్మ ఇలా జీవితాంతం ఏడ్వడమేనా దీనికి పరిష్కారం లేదా.
విహారితాత: పరిష్కారం ఉందిరా మీ అమ్మకి మన ఇంట్లో తగిన గౌరవం దక్కాలి అన్నా మీ అత్త మనసు మారాలి అన్నా నువ్వు మీ అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. 
విహారి: మనల్ని వద్దనుకొని వెళ్లి పోయిన అత్తయ్య ఎలా ఒప్పుకుంటుంది. అది కూడా తాను శత్రువని అనుకుంటున్న ఈవిడ కొడుకుతో తన కూతురి పెళ్లి ఎలా చేస్తుంది. ఆవిడ గురించి తెలిసి కూడా ఎలా చెప్తున్నావ్.
విహారితాత: ఆరోజు తనకు అన్యాయం జరిగిందని వెళ్లిపోయింది కానీ తను ఒప్పుకుంటుందని నాకు తెలుసు కానీ నువ్వు ఏం అంటావా అని నా బెంగ.
విహారి: కళ్లు మూసుకొని ఒప్పుకుంటా, మన కుటుంబం కలవడానికి నేను ఏమైనా చేస్తా.. మా అమ్మ బెంగ పోగొట్టడానికి ఏమైనా చేస్తా.. ఇక మనందరం అత్త ఇంటికి వెళ్లి ఈ గుడ్ న్యూస్ చెప్దాం.

కనకమహాలక్ష్మీ డబ్బులు కడుతుంది. ఇంకా ఆరు వేలు సరిపోలేదని రిసీప్ట్ ఇవ్వనని కౌంటర్‌లో చెప్తాడు. కనకమహాలక్ష్మీ ఆయన్ని బతిమాలుతుంది. తన చేతి బంగారు గాజులు ఇస్తుంది అయినా ఒప్పకోకపోవడంతో ఏడుస్తుంది. అందతా చూసిన విహారి దగ్గరకు వచ్చి తాను ఆ డబ్బు కడతాడు. నేను ఎవరో తెలీకుండా మా నాన్నని కాపాడుకోవడానికి చాలా సాయం చేశారు థ్యాంక్స్ అని చెప్తుంది కనకమహాలక్ష్మీ. తన తండ్రికి తగ్గగానే మీ డబ్బులు మీకు ఇస్తానని అంటుంది. ఇక విహారి గాజులు వేసుకోమని కనకమహాలక్ష్మీకి చెప్తాడు. ఇక రాజీ కనకానికి కాల్ చేసి పెద్ద నాన్న లేచారు రా అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాకి బోల్తా కొట్టించిన రామ్, సీతలు.. సూర్య, మధులకు గుడ్ న్యూస్ చెప్పిన అన్న!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం - ఇక జీవోలన్నీ తెలుగులోనే విడుదల!
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
China Virus: చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
చైనాలో కొత్త వైరస్ కలకలం - ఆందోళన వద్దంటూ భారత్ హెల్త్ ఏజెన్సీ స్పందన, కీలక సూచనలు
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
Google Search Don'ts: గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
గూగుల్‌లో వీటిని సెర్చ్ చేస్తే జైలుకే - జాగ్రత్తగా ఉండాల్సిందే!
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Railway Recruitment Board: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్ - రైల్వేలో 32 వేల ఉద్యోగాలపై కీలక అప్ డేట్, పూర్తి వివరాలివే!
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Embed widget