Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 9th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: జస్ట్ మిస్.. రాత్రి పూట లక్ష్మీ, విహారిలను సహస్ర అలా చూసుంటే ఇక అంతే సంగతి!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode లక్ష్మీని చంపాలని అంబిక ప్రయత్నించడం విహారి అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీని చంపడానికి అంబిక డాక్టర్ అవతారం ఎత్తుతుంది. లక్ష్మీ సెలైన్ బాటిల్‌లో పాయిజన్ కలపడానికి వెళ్తుంది. విహారి డాక్టర్ అనుకొని అంబికని ఆపి రెండు చేతులు జోడించి ఎలా అయినా లక్ష్మీని కాపాడండి అని వేడుకుంటాడు. అంబిక తలూపి లోపలికి వెళ్తుంది. విహారిని నర్స్ పిలుస్తుంది.
అంబికను పట్టుకున్న విహారి..
విహారి అక్కడికి వెళ్లి మాట్లాడుతాడు. తర్వాత ఓ పేషెంట్ డాక్టర్ గారి గురించి నర్స్‌ని అడిగితే ఈ టైంలో డాక్టర్ గారు ఉండరు అని చెప్తుంది. అది విన్న విహారి షాక్ అయిపోతాడు. లక్ష్మీ గదిలోకి వెళ్లింది ఎవరా అనుకుంటాడు. వెంటనే లక్ష్మీ దగ్గరకు పరుగులు తీస్తాడు. అంబిక పాయిజన్ సెలైన్‌లో కలిపే టైంకి విహారి వచ్చి అడ్డుకుంటాడు. ఎవరు నువ్వు అని అడుగుతాడు. నువ్వు డాక్టర్ కాదు అని నాకు తెలుసు అని ప్రశ్నిస్తాడు. అంబిక మాస్క్ తీయడానికి ప్రయత్నిస్తాడు. అంబిక విహారిని నెట్టేస్తుంది. విహారి ఎంతకీ వదలకపోవడంతో అక్కడే ఉన్న ఫైర్ ఆపే స్ప్రే విహారి మీద వేసి పారిపోతుంది.
లక్ష్మీని ఇంటికి తీసుకెళ్లిన విహారి..
అంబిక పారిపోవడంతో విహారి లక్ష్మీ దగ్గరకు వెళ్లి చూస్తాడు. లక్ష్మీ లేవడంతో ట్యాబ్లెట్ వేస్తాడు. తర్వాత జ్యూస్ తాగించి పడుకోపెడతాడు. డాక్టర్ వచ్చి తనకి రెస్ట్ అవసరం ఇంటికి తీసుకెళ్లండి మందులు వాడండి అని చెప్తుంది. విహారి లక్ష్మీకి టిఫెన్ తినిపిస్తాడు. రాత్రికి ఇంటికి తీసుకెళ్తాడు. ఇద్దరూ కలిసి గుమ్మం ముందు ఉన్న పసుపు కుంకుమ తొక్కుతారు. వసుధ ఇద్దరికీ దిష్టి తీస్తుంది. పసుపు, కుంకుమ అడుగులతో ఇద్దరూ ఇంట్లో అడుగుపెడతారు. అది పద్మాక్షి చూసి రగిలిపోతుంది. సహస్ర సీరియస్‌గా చూస్తుంది. అందర్ని కంగారు పెట్టి ఎవర్నీ నిద్ర లేకుండా చేసిందని పద్మాక్షి అంటుంది.
నీకు బతుకు లేకుండా చేస్తుంది.
యమున, విహారిలు లక్ష్మీని లోపలికి తీసుకెళ్లిపోతారు. విహారి తనకు చాలా సేవలు చేస్తున్నాడు. అది బతికి వచ్చింది రేపు నీ బతుకుకు అడ్డు వస్తుందేమో చూసుకో అని అంటుంది. సహస్ర రగిలిపోతుంది. దాని కోసం అంత పరితపిస్తున్న విహారి నీకు ఏమైనా అయినా ఇంతలా చూసుకోడు. అది కచ్చితంగా నీకు పోటీ అవుతుంది చూసుకో అని అంటుంది. దాన్ని అంతవరకు రానివ్వను దాని అంతు చూస్తానని సహస్ర అంటుంది.
ఒకే చోట విహారి, లక్ష్మీ.. సహస్రకు దొరికిపోతారా..
విహారి లక్ష్మీకి చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మీ తిన్నదో లేదో అని ఫోన్ ఏదో ఆర్డర్ పెడతాడు. యమున లక్ష్మీ దగ్గరకు భోజనం తీసుకెళ్తుంది. లక్ష్మీకి టిఫెన్ ఇచ్చి తినేసి మందులు వేసుకో అని చెప్పి వెళ్లిపోతుంది. లక్ష్మీ భోజనం ముందు కూర్చొని విహారి తన కోసం పడిన తపన గుర్తు చేసుకుంటుంది. ఇంతలో విహారి లక్ష్మీ దగ్గరకు వస్తాడు. విహారి రాగానే లక్ష్మీ సారీ చెప్తుంది. విహరి లక్ష్మీని తినమని అంటాడు. నాకు తినాలి అనిపించడం లేదని లక్ష్మీ అంటుంది. దాంతో విహారి లక్ష్మీ కోసం సూప్ తీసుకొచ్చి ఇస్తాడు. ఈ సూప్ నాకు చాలా ఇష్టమని చాలా బాగుంటుందని అంటాడు. నేను ఎప్పుడూ తాగలేదు బాబు అని లక్ష్మీ అంటే నేను తాగిస్తా అని విహారి లక్ష్మీకి సూప్ తాగిస్తాడు. అదే టైంకి సహస్ర అక్కడికి వస్తుంది. లక్ష్మీ, విహారి ఇద్దరూ దాక్కుంటారు. సహస్ర వెళ్లిపోగానే బయటకు వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!





















