Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today April 21st: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి, లక్ష్మీల పెళ్లి గురించి ఇంట్లో చెప్పేసిన సహస్ర.. లక్ష్మీతో వెళ్లిపోయిన విహారి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode కనకం, విహారిలకు పెళ్లి అయిందని సహస్రకు తెలియడం సహస్ర, విహారిలకు పెళ్లి ముహూర్తం పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారి, లక్ష్మీ పెళ్లి చేసుకున్నారన్న నిజం సహస్ర ఇంట్లో అందరితో చెప్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి బావ చేసిన పని ఇది అని సహస్ర అంటుంది. లక్ష్మీ, విహారి ఇద్దరూ తలదించుకుంటారు. లక్ష్మీని పద్మాక్షి కొడుతుంది.
పద్మాక్షి: ఎన్ని నాటకాలు ఆడావే. నువ్వే నా ఇంటికి వచ్చావ్. నా కూతురిని పెళ్లి చేసుకుంటా అన్నావ్. ఇప్పుడు నా కూతురి గొంతు కోయాలి అని చూస్తున్నావా. నాకు ఎంత మోసం చేయాలో అంత చేశావ్. దాన్ని పెళ్లి చేసుకొని మళ్లీ నా కూతురి జీవితం నాశనం చేయడానికి ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నావా. ఓ మోసం చేయడం నీ రక్తంలోనే ఉంది కదా. తల్లికి తగ్గ కొడుకే.
భక్తవత్సలం: విహారి నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఊహించలేదురా. కుటుంబాన్ని కలుపుతావు అనుకున్నానురా.
కాదాంబరి: ఏరా ఏంట్రా ఆ బుద్ధులు బంగారం లాంటి మరదలు ఉంటే దాని మెడలో ఎలా తాళి కట్టావురా.
సహస్ర: ఏంటి బావ నిన్ను ప్రాణంలా ప్రేమించాను కదా నువ్వు లేకుండా బతకలేను అని చావడానికి కూడా సిద్ధపడ్డాను కదా. ఇలా చేశావ్ ఏంటి బావ ఇప్పుడు నేను ఎవరి కోసం బతకాలి.
పద్మాక్షి: నీ అమ్మానాన్నల వల్ల చాలా అవమానాలు పడ్డాను. అంతకంటే ఎక్కువ ఇప్పుడు నీ వల్ల అవమాన పడ్డాను. నువ్వు లేకపోతే నా కూతురు ఏమైపోతుందో తనకు ఇప్పుడు ఏం న్యాయం చేస్తావ్.
కాదాంబరి: ఏయ్ నువ్వే నా మనవడిని మాయ చేసి ఉంటావ్. ఏం చేసి తాళి కట్టించుకున్నావే..
అంబిక: అది అలాంటిదే.
యమున: ఒక్క నిమిషం ఆగండి అని విహారిని కొడుతుంది. ఏం చేస్తున్నావ్‌రా నువ్వు జీవితాలతో ఆడుకుంటున్నావా. లక్ష్మీ మెడలో తాళి కట్టి తనని వదిలేసి తనని మోసం చేశావ్. ఇక్కడికి వచ్చి సహస్రని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావా అని అడుగుతుంది. విహారి కాలర్ పట్టుకొని ఏం జరిగినా నువ్వు చేసింది చాలా తప్పు. ఇప్పుడు ఎవరికి న్యాయం చేస్తావ్ ఎవరిని బలి చేస్తావో చెప్పు. నవ్వు లక్ష్మీ చేయి పట్టుకుంటే నీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉండదు. లేదంటే లక్ష్మీకి న్యాయం చేసి అప్పుడు వచ్చి సహస్ర మెడలో తాళి కట్టు. నిర్ణయం నీదే తేల్చుకో.
లక్ష్మీని తీసుకెళ్లిపోయిన విహారి
తల్లి మాటతో విహారి లక్ష్మ చేయి పట్టుకొని బయటకు వెళ్లిపోతాడు. అందరూ షాక్ అయిపోతారు. ఇంతలో సహస్ర ఏడుస్తూ నో అని పెద్దగా అరుస్తుంది. తీరా చూస్తే విహారి, లక్ష్మీలకు పెళ్లి అయిందని తెలుసుకున్న సహస్ర ఇంట్లో జరగబోయే పరిస్థితికి అరుస్తుంది. విహారి మంచి నీరు ఇస్తాడు. నిజం తెలిస్తే బావ లక్ష్మీ వైపే వెళ్తాడని వెంటనే బావని దక్కించుకోవాలని అనుకుంటుంది.
మీకో గుడ్ న్యూస్ విహారి
కారులో విహారి పాటలు పెడుతూ లక్ష్మీని చూస్తే సహస్ర పాటలు ఆపేస్తుంది. ఇక సహస్ర వాళ్లు ఆకలి అని దోసెలు తినడానికి రెడీ అవుతారు. లక్ష్మీ దగ్గుతూ ఉంటూ విహారి లేచి వెళ్లబోతే ముందే సహస్ర వెళ్లి లక్ష్మీ తల మీద కొడుతుంది. ఇక విహారిని నీరు తీసుకురమ్మని చెప్పి తాను తీసుకుంటుంది. అందరూ ఇంటికి చేరుకుంటారు. ఇంతలో యమున ఎదురొచ్చి విహారి, సహస్రలకు గుడ్ న్యూస్ అని చెప్పి స్వీట్ తినిపిస్తుంది. అందరూ కలిసి విహారి, సహస్రల పెళ్లికి ముహూర్తం పెట్టించేశామని చెప్తారు. తండ్రి ఆబ్దికం తర్వాతే పెళ్లి అని యమున చెప్తుంది.
విహారి బాబు పెళ్లికి ముహూర్తాలు పెట్టారమ్మా
లక్ష్మీ పార్టీలో తనకు విహారి గిఫ్ట్ ఇచ్చి మెడలో వేసిన డైమండ్ నెక్లెస్ చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో పండు అక్కడికి వస్తాడు. పండుతో విహారి గారు తనకు నెక్లెస్ ఇచ్చారని మెడలో వేశారని చెప్తుంది. పండు డల్‌గా ఉంటాడు. ఏమైందని లక్ష్మీ అడిగితే విహారి, సహస్రమ్మలకు పెళ్లి ముహూర్తం పెట్టారని అంటాడు. లక్ష్మీ తనకు ఆ పెళ్లి ఇష్టమే అంటుంది. ఇక సహస్ర పార్టీలో విహారిని లక్ష్మీ హగ్ చేసుకోవడం అన్నీ గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో సహస్ర దగ్గరకు పద్మాక్షి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా తెచ్చిన బట్టలు వేసుకొన్నసత్యమూర్తి.. తండ్రి సంతోషం దేవాలో మార్పు తీసుకొస్తుందా!





















