Kalavari Kodalu Kanaka Mahalakshmi Promo july 3rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ ప్రోమో: లక్ష్మీ తన భార్య అని ఇంట్లో చెప్పేసిన విహారి.. పద్మాక్షి రియాక్షన్ ఏంటో!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Promo Today లక్ష్మీ తన భార్య అని విహారి ఇంట్లో అందరితో చెప్పడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Promo Today లక్ష్మీ మెడలో విహారి తాళి కట్టడం చూసిన యమున లక్ష్మీని నిలదీస్తుంది. నీ భర్త ఎవరు? తను నిన్ను వదిలేసిన తర్వాత ఎప్పుడూ కలవలేదా? అని ప్రశ్నిస్తుంది. ఈ తరుణంలో తాజా ప్రోమో ఆసక్తికరంగా మారింది. ప్రోమోలో ఏం ఉందంటే..
" లక్ష్మీని యమున నిలదీయడంతో విహారి ముందు వచ్చి అమ్మా తన మెడలో తాళి కట్టింది ఎవరో కాదు.. నేనే అని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. తనని వదిలేసి వెళ్లిపోయినది ఎవరో కాదు నేను. తన మెడలో మూడులు ముళ్లు వేసి పెళ్లి చేసుకున్న నా అర్థాంగి. వేదమంత్రాల సాక్షిగా దేవుడి సాక్షిగా పెళ్లి చేసుకున్న నా ధర్మపత్రి. అని విహారి చెప్తాడు." అందరూ షాక్ అయిపోతారు. దీంతో ప్రోమో పూర్తయిపోతుంది. నిజంగా విహారి లక్ష్మీ తన భార్య అని చెప్పాడా.. ఒకవేళ చెప్తే సహస్ర జీవితం ఏమవుతుంది. పద్మాక్షి, అంబిక, యమున ఎలా రియాక్ట్ అవుతారు. లక్ష్మీ, విహారిలను క్షమిస్తారా. యమున లక్ష్మీని కోడలిగా స్వీకరిస్తుందా మొదలైన ప్రశ్నలకు జవాబు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
విహారి లక్ష్మీ గుడికి వెళ్తారు. విహారి వాళ్లని ఫాలో అవుతూ యమున గుడికి వెళ్తుంది. మరోవైపు విహారిని చంపమని అంబిక తన మనుషుల్ని పంపిస్తుంది. వాళ్లు విహారి మీద అటాక్ చేస్తారు. విహారివాళ్లని చితక్కొడతాడు. ఇక విహారి లక్ష్మీ తన భార్య అని తన మెడలో తాళి తెగిపోయిందని పంతులుతో చెప్తాడు. పంతులు మళ్లీ విహారి లక్ష్మీలకు పెళ్లి చేస్తాడు. విహారి లక్ష్మీ మెడలో మళ్లీ తాళి కట్టడం యమున చూసేస్తుంది. యమున కుప్పకూలిపోయి ఏడుస్తుంది. ఇంటికి వచ్చి లక్ష్మీని సొంత మనిషిలా చూసుకున్నా తనకు కనీసం విషయం చెప్పకుండా దాచేసిందని ఏడుస్తుంది. విహారి తనతో పాటు ఇంట్లో అందరినీ మోసం చేశాడని కుమిలిపోతుంది. లక్ష్మీ యమున దగ్గరకు వచ్చి ప్రసాదం ఇస్తే యమున కోపంగా చూస్తుంది. లక్ష్మీ పెళ్లి ఎక్కడ ఏ నెలలో జరిగింది అని అడుగుతుంది. నీ భర్త ఎక్కడున్నాడు. నువ్వు కలవ లేదా అని చాలా ప్రశ్నలు అడుగుతుంది. లక్ష్మీ ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అమ్మ నా భర్త నన్ను వదిలేసి వెళ్లి పోయాడు అని చెప్తుంది.
లక్ష్మీని యమున అందరి ముందుకి తీసుకెళ్లి తాళి పట్టుకొని ఈ తాళి నీ మెడలో ఎవడు కట్టాడు. వాడు ఎక్కడ ఉన్నాడు. అని అడుగుతుంది. విహారి లక్ష్మీని ఎందుకు ఇబ్బంది పెడతావ్ అమ్మా తన పెళ్లి విషయం మాట్లాడొద్దు అని నువ్వే అందరికీ చెప్పావ్ కదా అని అంటాడు. నువ్వు మాట్లాడకు విహారి అని యమున అరుస్తుంది. లక్ష్మీని నిలదీస్తుంది. వసుధ, చారుకేశవ లక్ష్మీ వైపు మాట్లాడితే ఎవరూ తనకి ఏం చెప్పొద్దని మాట్లాడొద్దని లక్ష్మీతోనే నిజం చెప్పిస్తా అని అంటుంది. లక్ష్మీ ఏడుస్తుంది. యమున మాత్రం నిజం చెప్పేవరకు ఊరుకోను అని అంటుంది. నిజం తెలిసిపోతే తన బతుకు ఏంటా అని సహస్ర చాలా టెన్షన్ పడుతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: విరూపాక్షి గ్యాంగ్ గెలిచిందోచ్.. ఈ సారి తల్లిదండ్రుల చేతుల మీదగా 'రూపాకల్యాణం'





















