Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్ ప్రోమో: లక్ష్మీ తాళి పట్టుకొని నిలదీసిన యమున.. అందరి ముందు నిజం చెప్పేసిన విహారి..!
Kalavari Kodalu Kanaka Mahalakshmi july 2nd Promo లక్ష్మీ మెడలో తాళిని పట్టుకొని యమున నిలదీయడం విహారి తల్లితో నిజం చెప్పడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Promo Today కనక మహాలక్ష్మీ, విహారి పెళ్లి చేసుకున్న విషయం ఇంట్లో ఎవరికీ తెలీకూడదు అని జాగ్రత్త పడుతున్న తరుణంలోనే ఇంట్లో ఒక్కొక్కరికి నిజం తెలియడంతో సీరియల్ రోజు రోజుకు ఆసక్తికరంగా మారింది. నిన్నటి ఎపిసోడ్‌లో విహారి సహస్రను దూరం పెట్టి లక్ష్మీతో చనువుగా ఉండటం విహారి తల్లి యమున చూసేయడం అందరూ లక్ష్మీ గురించి చెప్పిన మాటలు తలచుకొని కుప్పకూలిపోతుంది. ఈ తరుణంలో తాజాగా వచ్చిన కలవారి కోడలు కనక మహాలక్ష్మీ ప్రోమో చాలా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రోమోలో ఏం జరిగిందంటే..
" విహారి, లక్ష్మీల మీద అనుమానం వచ్చిన యమున ఇద్దరినీ ఫాలో అవుతుంది. రకరకాల కారణాలు చెప్పి ఇంటి నుంచి గుడికి వెళ్లిన విహారి, లక్ష్మీ వెనకాలే వెళ్లిన యమున గుడి దగ్గర విహారి లక్ష్మీ తన భార్య అని పంతులుతో చెప్పి మళ్లీ లక్ష్మీ మెడలో తాళి కట్టడం చూసేస్తుంది. ఇంటికి వచ్చిన యమున లక్ష్మీ తాళి పట్టుకొని ఈ తాళి నీ మెడలో కట్టిన వాడు ఎవరు అని అడుగుతుంది. లక్ష్మీ ఏం మాట్లాడకుండా గమ్మున ఉండిపోతుంది. ఇంతలో విహారి ముందుకు వచ్చి లక్ష్మీ మెడలో తాళి కట్టింది.. లక్ష్మీని పెళ్లి చేసుకొని వదిలేసింది నేను అని అందరితో చెప్తాడు. యమున షాక్ అయిపోతుంది." దీంతో ప్రోమో పూర్తయిపోతుంది.
నిజంగా విహారి లక్ష్మీ మెడలో తాళి కట్టడం యమున చూసిందా..? లక్ష్మీ, విహారిలకు గతంలో పెళ్లి జరిగిందని యమున తెలుసుకుందా? నిజంగానే లక్ష్మీని నిలదీసిందా? విహారి నిజం ఒప్పుకున్నాడా? ఈ అనుమానాలు అన్నీ తీరాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే..
నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
లక్ష్మీ, విహారిలు గార్డెన్‌లో మాట్లాడుతూ ఉంటారు. లక్ష్మీ పడిపోతుంటే విహారి పట్టుకోవడం, లక్ష్మీని కూర్చొపెట్టి కాళ్లు పట్టుకోవడం యమున మేడ మీద నుంచి చూస్తుంది. అప్పటి నుంచి యమునకు పద్మాక్షి, అంబిక మాటలు గుర్తొచ్చి లక్ష్మీ మీద యమునకు కొంచెం అనుమానం మొదలవుతుంది. ఇక విహారిని సహస్ర హగ్ చేసుకోవడం విహారి సహస్ర మీద అరిచి నెట్టేయడం చూస్తుంది. దాంతో అనుమానం ఇంకా బలపడుతుంది. లక్ష్మీ మధ్యాహ్నం గుడికి వెళ్తానని యమునకు చెప్పడంతో యమున చాలా ప్రశ్నలు వేస్తుంది. లక్ష్మీ వెళ్లిన వెంటనే విహారి కూడా పని ఉంది అని బయటకు వెళ్లడంతో యమున ఫాలో అవుతుంది.
గుడి దగ్గర సహస్ర లక్ష్మీతో భర్త ఎక్కడున్నాడో తెలీని నీకు తాళి ఎందుకు అని లక్ష్మీ మెడలో తాళి తెంపేస్తుంది. విహారి ఆ సీన్ చూసి కోపంగా వచ్చి సహస్రని కొడతాడు. సహస్ర అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక విహారి లక్ష్మీని తీసుకొని జరిగిన అపశకునానికి పరిష్కారం పంతుల్ని అడుగుదామని వెళ్తాడు. విహారి, లక్ష్మీలు తెగిన తాళి పట్టుకొని వెళ్లడం.. అనుమానంతో యమున గుడికి రావడం ఈ తరుణంలో ఇద్దరి బంధం గురించి యమునకు నిజం తెలిసినట్లు వచ్చిన ప్రోమో సీరియల్ మీద ఇంకా ఆసక్తి పెంచుతుంది. పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read: చిన్ని సీరియల్: మహి కారుని ఆటోలా వాడేసుకున్న మధుమిత.. దేవా హోంమంత్రి.. శ్రియ ఎవరో తెలుసా!





















