అన్వేషించండి
Advertisement
Kalavari Kodalu Kanaka Mahalakshmi August 17th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి కనకమమహాలక్ష్మీని పెళ్లిచేసుకుంటానని చెప్పాడంటూ గుడిలో పెళ్లిచూపులకు అరెంజ్ చేయిస్తాడు ప్రకాశ్..
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode: గుడిలో విహారిని చూసి కనకనమహాలక్ష్మీ ఆనందంతో ఉప్పొంగిపోతుంది. కానీ అతను తనకోసం వచ్చాడా లేక మరేదైనా పనిమీద వచ్చాడా..?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Today Episode: ప్రకాశ్ తెచ్చి ఇచ్చిన ఫొటో చూసిన కనకం...అతను ముందే తెలుసునని ఆస్పత్రిలో చూశానని తండ్రి ఆదికేశవ్(Adhikesav)తో చెబుతుంది. అంతేకాదు మిమ్మల్ని ఆస్పత్రిలో చేర్చినప్పుడు డబ్బులు తక్కువైతే ఇచ్చాడని కూడా చెబుతుంది. డబ్బులు తిరిగి ఇద్దామని వెళ్లేసరికి వెళ్లిపోయాడని కనకం(Kanakam) తండ్రికి చెబుతుంది. ఇంతలో గౌరీ కలుగజేసుకుని అంత ఉన్నత కుటుంబం వారు మా బిడ్డను పెళ్లి చేసుకుంటారంటారా అని అనుమానం వ్యక్తం చేస్తుంది.
ప్రకాశ్: అయ్యో మీకు అనుమానం అక్కర్లేదండీ...వాళ్లు డబ్బు మనుషులు అస్సలే కారు. మీ అమ్మాయి వాళ్లకు చాలా బాగా నచ్చిందంటా..అందుకే కదా ఈ సంబధం మాట్లాడమని నన్ను పంపారు.
ఆదికేశవ్: నీ మాటలు వింటుంటే సంతోషంగానే ఉంది కానీ..ఎందుకో కాస్త సంశయంగా ఉంది.
ప్రకాశ్ : సరే అంకుల్...మీ ముగ్గురు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి. అప్పుడే ఏ విషయం చెప్పండి. నేను బయట వెయిట్ చేస్తాను...కానీ అంకుల్ ఈ సంబంధం మాత్రం కోటిలో ఒక్కటంటే ఒక్కటే ఉంటుంది. ఇది మాత్రం నిజం.
ప్రకాశ్ వాళ్లు బయటకు వెళ్లిపోగానే...ఆదికేశవ్, గౌరీ కలిసి కనకాన్ని అడుగుతారు. విహారీ గుణగణాలు, మంచితనం గురించి చర్చించుకుంటారు.
కనకం కూడా అబ్బాయి నచ్చాడని చెప్పడంతో ఆదికేశవ్ వెంటనే ప్రకాశ్(Prakash)ను పిలిచి మాకు ఈ సంబంధం ఓకే అని చెప్పేస్తాడు. పెళ్లి చూపులు ఎప్పుడు పెట్టుకుందామో కనుక్కుని చెప్పమనడంతో...ఇదే మంచి ఛాన్స్ అని భావించిన ప్రకాశ్...రేపే గుడిలో ఏర్పాటు చేయిస్తానని చెబుతాడు. స్వామివారి కల్యాణం రోజు గుడిలో పెళ్లిచూపులు జరిగితే శుభంగా ఉటుందని కనకం తల్లిదండ్రులు ఆనందపడిపోతారు.
కనకం వాళ్ల ఇంటినుంచి తిరిగి వెళ్తున్న ప్రకాశ్‌కు విహారీ(Vihari) ఫోన్ చేస్తాడు.
రేపు గుడికి వెళ్దాం రమ్మని పిలుస్తాడు. సడెన్‌గా గుడికి ఎందుకని ప్రకాశ్ అడగడంతో.....మా పెద్ద అత్తవాళ్లతో మా ఫ్యామిలీకి ఉన్న గొడవలు సంగతి తెలుసు కదా....రేపు గుడిలో మా అత్తమ్మ వాళ్లు పూజ చేయిస్తున్నారని తెలిసింది . నేరుగా అక్కడికే వెళ్లి మా అత్తయ్యతో మాట్లాడదమని అనుకుంటున్నా అంటాడు. మా అత్త కూతురు సహస్రని నేను పెళ్లి చేసుకుంటే ఈ సమస్యలన్నీ తీరిపోతాయని మా తాతయ్య చెప్పాడని చెబుతాడు. కాబట్టి రేపు గుడికి వెళ్దాం రమ్మని చెబుతాడు. ఇదే అదునుగా భావించిన ప్రకాశ్...రేపు నాకు పెళ్లి చూపులు ఉన్నాయిరా రావడం కుదరదు అంటాడు. అయితే నేనొక్కడినే వెళ్తానులేరా అంటాడు విహారి. లేకపోతే ఆ పెళ్లి చూపులు గుడిలోనే పెట్టించమని నేను ఆడపెళ్లివారికి చెబుతాలే అని ప్రకాశ్ అంటాడు. దీంతో విహారి సరేనంటాడు.
విహారి వాళ్ల కోసం ఆదికేశవ్ దంపతులు గుడికి ముందుగానే చేరుకుని ఎదురుచూస్తుంటారు.అప్పుడే పంతులుగారు స్వామివారికి కల్యాణం చేయించేందుకు విగ్రహాలను తీసుకుని వస్తుంటారు. వాటిల్లో రాములోరి విగ్రహాన్ని కనకమహాలక్ష్మీ ఎత్తుకుంటుంది. నడిచి కల్యాణ మండపం వద్దకు వస్తుండగా పంతులుగారు తుళ్లిపడపోతారు. అప్పుడే అటుగా వచ్చిన విహారి ఆయన చేతిలో ఉన్న సీతమ్మ విగ్రహం కిందపడిపోకుండా పట్టుకుంటాడు. దీంతో ఆ విగ్రహాన్ని అతన్నే తీసుకుని రమ్మని పంతులుగారు చెబుతాడు. రాములోరి విగ్రహం కనకమహాలక్ష్మీ, సీతమ్మ విగ్రహం విహారి చేతబట్టుకుని నడుచుకుంటూ వస్తుంటే....ఆదికేశవ్ దంపతులు చూసి ఎంతో ఆనందపడిపోతారు. విహారిని కలిసినందుకు కనకమహాలక్ష్మీ కూడా తెగ సంబరపడిపోతుంది.
గుడిలో విహారి తల్లితోపాటు తాత, నానమ్మ పద్మాక్షి కోసం ఎదురచూస్తుంటారు. ఇంతలో కుటుంబంతో కలిసి పద్మాక్షి అక్కడికి వస్తుంది. రాగానే ఎదురు వెళ్లి విహారి తల్లి పలకరించగా కోపంతో పద్మాక్షి మండిపడుతుంది. అత్తా అని పలకరించిన విహారిపైనా పద్మాక్షి ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుడిలోకి వెళ్లిపోతుంది. ఎంత కష్టమైనా అత్తను ఒప్పించి ఈ కుటుంబాన్ని ఒక్కటి చేస్తామన్న విహారి మాటలతో ఈ రోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది...
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
ఇండియా
కరీంనగర్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion