అన్వేషించండి

Janaki Kalaganaledu June 2nd (ఈరోజు) ఎపిసోడ్: జానకికి షరతు పెట్టిన జ్ఞానాంభ- రామచంద్రను పోటీలకు పంపించేందుకు గ్రీన్ సిగ్నల్

మొత్తానికి రామచంద్రను వంటల పోటీలకు పంపించేందుకు తల్లి ఒప్పుకుంటుంది. అయితే జానికి వద్ద మాట తీసుకుంటుంది.

జ్ఞానాంభకు ఏం కాదని డాక్టర్‌ చెప్పేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. జ్ఞానాంభ కోలుకున్నారు కాబట్టి మీరు హైదరాబాద్ వెళ్లమని చెప్తాడు గోవిందరాజు. కానీ అమ్మను ఇలా వదిలి వెళ్లలేమంటాడు రామచంద్ర. రేపటి కల్లా జ్ఞానాంభ పూర్తిగా కోలుకుంటుందని... కానీ చేతి వరకు వచ్చిన అవకాశం తిరిగి రాదని రామచంద్రను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు గోవిందరాజు. అయినా రామచంద్ర ఒప్పుకోడు. తన వల్ల కాదని... అమ్మను ఇలా వదిలి వెళ్లలేనంటాడు. అమ్మ కోలుకుందని... కానీ అవకాశం పోతే మాత్రం జీవితాంతం బాధ పడాల్సి ఉంటుందని అంటాడు గోవిందరాజు. అమ్మతో మాట్లాడి ప్రయాణానికి ఏర్పాట్లు చేద్దామంటాడు. ఇద్దర్నీ తీసుకొని జ్ఞానాంభ రూమ్‌కు వెళ్తాడు గోవిందరాజు. ఇదంతా విన్న  మల్లిక కూడా తన భర్తను తీసుకొని జ్ఞానాంబ రూమ్‌కు వెళ్తుంది. 

ఫ్యామిలీ మెంబర్స్ పిలుపు విన్న తర్వాత కళ్లు తెరిచి లేచి కూర్చుంటుంది జ్ఞానాంభ. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా వీళ్ల ప్రయాణం గురించి మాట్లడటం సబబు కాదని... కానీ శుభమా అంటు బయల్దేరి ఆగిపోవడం అపశకునం అవుతుందని అంటాడు గోవిందరాజు. జ్ఞానాంభ కూడా ఆగిపోవద్దు బయల్దేరమని చెబుతుంది. నాకేం ఫర్వాలేదు కానీ మీరు వెళ్లి రండీ అని రామచంద్రతో చెబుతుంది జ్ఞానాంభ. 

జ్ఞానాంభ చేయిన పట్టుకొని రామచంద్ర... తనను క్షమించమని అంటాడు. ఏం తప్పు చేశావని క్షమాపణ కోరుతున్నావని అడుగుతుంది జ్ఞానాంభ. అబద్దం చెప్పి మేం వెళ్లడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో అంటాడు రామచంద్ర. ఇంతలో గోవిందరాజు మాట్లాడుతూ... ఆ అబద్దానికి కారణం నేనంటూ చెప్తాడు. ఏ విషయం గురించి మీరు మాట్లాడేదని అని అడుగుతుంది జ్ఞానాంభ. రామచంద్రవాళ్లు బయల్దేరేది వైజాగ్ కాదని... హైదరాబాద్ వంటల పోటీలకని చెప్తాడు గోవిందరాజు. ఇందులో పిల్లల తప్పేమీ లేదని అంటాడు. వైజాగ్‌ పెళ్లి పేరుతో హైదారాబాద్‌ వెళ్లమని నేనే చెప్పానంటూ వివరిస్తాడు. వాళ్లు వద్దన్నా నేనే బలవంతంగా ఒప్పించానంటాడు. 

లోకజ్ఞానం లేనివాడని... అక్కడ ఏదైనా అవమానం జరిగితే తట్టుకోలేడని అందుకే వంటల పోటీకి వద్దని చెప్పినట్టు వివరిస్తుంది జ్ఞానంభ. చిన్నప్పటి నుంచి నీ వంటలు చూసి పెరిగాడని.. వాటితోనే గోదావరి జిల్లాల్లో పేరు సంపాదించుకున్నాడని అంటాడు. 

నీ భయంలో అర్థం లేదని... వాళ్లు పడిపోతారని భయపబడితే ఎప్పుడూ నడవలేరని అంటాడు గోవిందరాజు. ఓడిపోతారేమో అని భయంతో గుమ్మం దాటలేరని అంటాడు. తాను గెలుపు ఓటములు గురించి ఆలోచించడం లేదని.. ఎక్కడ అవమానపడతాడేమో అని భయపడతున్నట్టు చెబుతుంది జ్ఞానాంభ. చిన్నప్పటి నుంచి వంటవాడు అంటూ హేళన చేస్తున్నారని... ఒక వేళ పోటీల్లో గెలిచి వస్తే అవమానించిన వాళ్లు ఫొటోలు దిగడానికి వస్తారని వివరిస్తాడు గోవిందరాజు. అది కదా నిజమైన గెలుపు అంటే... ఇన్నేళ్లలో ఎప్పుడూ నీ మాటకు ఎదురు చెప్పలేదు.. ఇప్పుడు అడుగుతున్నాను.. మన అబ్బాయిని వంటల పోటీలకు పంపించు అని రిక్వస్ట్ చేస్తాడు. తన బిడ్డను అందరూ అవమానించడానికి తానే కారణమనే దుఃఖం తనను వెంటాడుతోందని... ఈ గెలుపుతో రామ పేరు మారుమోగిపోవాలని అంటాడు. కాదనకని ప్రాధేయపడతాడు. ఇంకేం ఆలోచించవద్దని... అంతా మంచి జరుగుతుందని అంటాడు. 

ఇంత జరగడానికి కారణం నువ్వే అంటూ జానకిపై కోప్పడుతుంది  జ్ఞానాంభ. నా కుమారుడిని బాధపెడితే తప్ప ఉండలేవా అని నిలదీస్తుంది. దానికి సమాధానంగా నా భర్తను గెలిపించడానికి కంకణం కట్టుకున్నానంటూ చెబుతుంది జానకి. మీ అబ్బాయిని గెలిపించి మీ ముందు నిలబెడతానంటుంది. ఆ పోటీల్లో ఆయన ఓడిపోయినా ఆయనకు అవమానం జరిగినా మీరు ఈ జన్మకు నా మొహం చూడొద్దని అంటుంది. 

తన భర్తను గొప్పస్థానంలో నిలబెట్టాని జానకి ఆశపడుతోందంటాడు గోవిందరదాజు. ఆ పోటీలో గెలిచి అమ్మకు అంకితం ఇవ్వాలని కొడుకు రామచంద్ర ఎదురు చూస్తున్నాడు. అందరి కంటే ఆయనపై ఎక్కువ నమ్మకం ఉన్న నువ్వే భయపడటం ఏంటని అడుగుతాడు గోవిందరదాజు. నీ అనుమతి కోసం రామచంద్ర ఎదురు చూస్తున్నాడని... నువ్వు ఒప్పుకోనిదే రామచంద్ర వెళ్లడని అంటాడు. మన అబ్బాయి కోసం గొప్ప అవకాశం ఎదురు చూస్తోందని... వాళ్లను ఆశీర్వదించి పంపించమని ఒప్పిస్తాడు. 

విష్ణు కూడా అదే మాట చెప్తాడు. 

అందరి రిక్వస్ట్‌తో జ్ఞానాంభ కాస్త మెత్తబడుతుంది. నా భయం నాకున్నా... నీ ఇష్టం కాదనలేక పంపిస్తున్నాను అంటుంది. 
ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్లను ఆపలేకపోయానంటూ చిరాకు పడుతుంది మల్లిక. 
 
పూజ గదిలో దీపం కూడా వెలిగించలేని స్థితిలో ఉన్న జ్ఞానాంభ వద్దకు వచ్చి...తాను దీపం వెలిగిస్తాను ఇవ్వమంటుంది జానకి. దీపం వెలిగించిన జానకి... జరిగిన పరిస్థితులకు నేనే కారణం అన్న కోపం నాపై ఉంది మీకు. అది భరించలేని బాధగా ఉన్నాప్పటికీ.. ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారని నమ్మకంతో ఉన్నానంటుంది జానకి. మీ అబ్బాయిపై అంతులేని నమ్మకం ఉన్నప్పటికీ ఎందుకు భయపడుతున్నారో చెప్పమంటుంది. నా బిడ్డ ఓటమి అంటే తట్టుకోలేడని చెబుతుంది జ్ఞానాంభ. ఒకవేళ ఓడిపోతే...  ఆ ఓటమి నుంచి అంత తేలికగా బయటకు రాలేడని వివరిస్తుంది. చిన్నప్పుడు జరిగిన సంఘటనలు గుర్తు చేస్తుంది జ్ఞానాంభ. ఓడిపోయిన ప్రతిసారి వేరే లోకంలోకి వెళ్లిపోతాడని... ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైతే తట్టుకోలేనంటుంది జ్ఞానాంభ. తన కుమారుడు ఆనందంగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారని... అలాంటి వ్యక్తి ఇబ్బంది పడితే ఇల్లే చీకటి అయిపోతుందని అంటుంది. దయచేసి తన బిడ్డను గ్రహణం పెట్టిన సూర్యుడిలా చేయొద్దని రిక్వస్ట్ చేసుంది. ఆయన మీకు కొడుకైతే... నా భర్త.. మీ కొడుకు విషయంలో ఉన్న బాధ్యత, భయం.. నా భర్త విషయంలో అంతే బాధ్యత, భయం ఉన్నాయంటుంది జానకి. నన్ను నమ్మండి అత్తయ్య.... మీ కొడుకును విజేతగా నిలబెడతానంటూ మాట ఇస్తుంది.  

జ్ఞానాంభ హారతి ఇచ్చి ఇద్దర్నీ దీవించి పంపిస్తుంది జ్ఞానాంభ. 

రేపటి భాగం...
 నీవు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచి వస్తానంటాడు రామచంద్ర. నా కొడుకు ఎలా వెళ్తున్నాడో అలానే నవ్వుతూ తిరిగి రావాలని జానకికి చెబుతుంది జ్ఞానాంభ. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ
Melbourne Test: ఆ వ్యక్తిగత రికార్డులపై బుమ్రా, జడేజా గురి.. నాలుగో టెస్టులో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న భారత ప్లేయర్లు
ఆ వ్యక్తిగత రికార్డులపై బుమ్రా, జడేజా గురి.. నాలుగో టెస్టులో సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న భారత ప్లేయర్లు
Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు
Delhi Elections : త్వరలో సీఎం అతిషి అరెస్ట్.. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ పోస్ట్
త్వరలో సీఎం అతిషి అరెస్ట్ - ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ పోస్ట్
Vajpayee 100th Birth Anniversary: రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
రాజ్యాంగానికి కట్టుబడి అధికారాన్ని వదులుకున్న గొప్ప నేత వాజ్‌పేయి: ప్రధాని మోదీ
Embed widget