Janaki Kalaganaledu June 22th (ఈరోజు) ఎపిసోడ్: అమాంతం పెరిగిపోయిన జానకి ప్రతిష్ట- కోడలిపై అత్తకు ఈర్ష్య మొదలైందా?
వంటల పోటీల్లో రామచంద్ర గెలుపు జానాంభ ఫ్యామిలీ కొత్త చిచ్చు పెట్టేలా ఉంది. అమాంతం పెరిగిపోయిన జానకి ప్రతిష్టపై అత్తలో ఈర్ష్య మొదలైనట్టు కనిపిస్తుంది. దీనికి మల్లిక తాలింపు గట్టిగానే వేస్తోంది.
మీడియా వాళ్లు ప్రశ్నలు అడిగితే ఏం సమాధానం చెప్పాలో అర్థంకాదని జానకితో జ్ఞానాంభ అంటుంది. ఆ మైక్‌లు ముందు కంగారుగానే ఉంటుందని చెబుతుంది. అయ్యో మీకు కంగారేంటి... ఎప్పుడూ ఎలా హుందాగా ఉంటారో అలానే ఉండాలని సజెస్ట్ చేస్తుంది. క్వశ్చన్స్ అడగడానికి వాళ్లే భయపడతారని అంటుంది.
టీవీలో కనిపించడానికి మల్లిక పుల్‌గా ప్రిపేర్ అవుతుంది. దానిపై భర్త విష్ణు సెటైర్లు వేస్తాడు. ఆయనపై మండిపడుతుంది మల్లిక.
మీడియా ముందు కాస్త కంగారుగా ఉంటుంది జ్ఞానాంభ. జానకి మాట్లాడుతూ మీరు ధైర్యంగా ఉండి... రామచంద్రకు ధైర్యం చెప్పాలంటుంది. ఇంతలో ఇంటర్వ్యూ మొదలవుతుంది. వాళ్లు తల్లి గురించి వంటల గురించి అడిగితే చెప్తాడు రామచంద్ర. ఇంటర్వ్యూ పూర్తైన తర్వాత రామచంద్రకు తల్లి ఎంత అండగా ఉందో... భార్య జానకి కూడా అంతే అండగా ఉందని చెప్పి వెళ్లిపోతారు.
తర్వాత రామచంద్రను జానకి పొగడ్తలతో ముంచెత్తుతుంది. గెలుపులో తన పాత్ర ఎంత ఉందో నీ పాత్ర కూడా అంతే ఉందని... ఎన్ని అవమానాలు ఎదురైనా తట్టు నిలబడి తనను గెలిపించావంటాడు. ఈ క్రమంలో చదువుపై శ్రద్ధ తగ్గించారని... ఇకపై చదువుపై దృష్టి పెట్టాలని జానకికి చెప్తాడు రామచంద్ర. రేపటి నుంచి ఫ్రెష్‌గా చదువు స్టార్ట్ చేస్తానని చెప్తుంది.
ఉదయం అంతా కలిసి గుడికి వస్తారు. అక్కడ కనిపించిన వారంతా పలకరించి టీవీలో చూశామని... చాలా అందంగా ఉన్నారని పొగడ్తలతో ముంచెత్తుతారు. రామచంద్ర కూడా చాలా బాగా మాట్లాడాడని అంటారు. ధైర్యంగా తడబడకుండా బాగా మాట్లాడవని అంటారు. దీనంతటికీ కారణం జానకి అని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. ఇదంతా విన్న వాళ్లంతా ఇలాంటి కోడలు రావడం మీ అదృష్టం అని అంటారు. ఇప్పుడు వచ్చిన కోడళ్లు వేరు కాపురం పెడుతున్నారని... జానకి మాత్రం మీ ఫ్యామిలీ గౌరవం కాపాడటానికి పాటుపడుతుందని అంటారు.
ఈ మాట విన్న మల్లిక కడుపు మండిపోతుంది. ఏదో మంట పెట్టాలని ఆలోచిస్తుంది. జ్ఞానాంభ దగ్గరికి వచ్చి వాళ్లంతా పొగడానికి వెనుక పెద్ద కుట్ర ఉందని చెవి కొరుకుతుంది. జానకి వల్లే రామచంద్ర గెలిచాడని... రామచంద్రకు అంత సీన్ లేదని అంటున్నారని చెవుళ్లు కొరుకుంటున్నట్టు పొగపెడుతుంది. ఇకపై ఇలాంటి చాడీలు చెబితే మాత్రం మంచిగా ఉండదని.. వాళ్లను చూసి ఏం చేయాలో నేర్చుకోమని మల్లికకు క్లాస్ తీసుకుంటుంది.
ఇంతలో పూజ కోసం కొబ్బరికాయ కొని డబ్బులు ఇస్తుంది జ్ఞానాంభ. వద్దని వారిస్తాడు అక్కడి పూజరి. మీరు ఈ గుడిలో ఏ పూజలు దేనికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని అంటారు. ఈ గుడి పెద్ద కోడలు విరాళం ఇచ్చారని... ఇకపై ప్రతి సందర్భంలో మీ ఫ్యామిలీ బాగుండాలని పూజలు చేస్తామంటారు పూజరి. అలాంటి కోడలు రావడం మీ అదృష్ణని చెప్తారు.