Jagadhatri Serial February 13th: 'జగద్ధాత్రి' సీరియల్: తెలివిగా కౌషికిని సేవ్ చేసిన ధాత్రి.. సారీ చెప్పమన్న నిషిక!
Jagadhatri Serial Today Episode: కౌషికిని దివ్యాంకకి సారీ చెప్పమంటుంది నిషిక. కౌషికి సారీ చెప్తుందా లేదంటే ధీటైన సమాధానం చెబుతుందా అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.
Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో నీ మొహంలో కంగారు కనిపిస్తుంటే కంగారు పడటం లేదు అంటావేమిటి అంటూ లోపలికి వస్తుంది దివ్యాంక.
దివ్యాంకని అక్కడ చూసి షాక్ అవుతారు ధాత్రి వాళ్లు.
కౌషికి (కోపంగా): నువ్వేంటి ఇక్కడ (దివ్యాంకని కోపంగా అడుగుతుంది)
నిషిక: నేనే తనని రమ్మన్నాను.
ధాత్రి: సరే ఇక్కడ ఆఫీస్ మీటింగ్ అవుతుంది. లోపలికి వెళ్లి మాట్లాడుకోండి.
దివ్యాంక: పర్వాలేదు, మేము ఇక్కడే ఉంటాం.
కౌషికి (చేసేదేమీ లేక బోర్డు మెంబర్స్ తో మాట్లాడుతూ..): మా బాబాయి ఢిల్లీ వెళ్లారు. రెండు రోజుల్లో వచ్చేస్తారు.
దీంతో నిషిక యువరాజ్ సుధాకర్ జైలుకు వెళ్లాడని చెప్పినట్లు, బోర్డు మెంబర్స్ యువరాజ్‌ను MDని చేసినట్టు అక్కడే కలగనేస్తుంది. దివ్యాంక పిలవడంతో బ్రమ నుంచి బయటికి వస్తుంది.
దివ్యాంక: వాళ్ళ బాబాయ్ జైలుకు వెళ్లారు, అంతగా ఢిల్లీ వెళ్ళినట్లయితే ఒకసారి వీడియో కాల్ చేయమనండి.
కౌషికి మరింత కంగారు పడిపోతుంది. అయితే ధాత్రి ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్పి సుధాకర్ కి ఫోన్ చేసి కౌషికికి ఇస్తుంది. కౌషికితో సహా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.
సుధాకర్ (కౌషికితో మాట్లాడిన తర్వాత బోర్డు మెంబర్స్ తో మాట్లాడుతూ): నేను ఢిల్లీ వచ్చాను, నేను రావటానికి ఆలస్యం అవుతుంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను వచ్చిన తర్వాత కలుద్దాం అని చెప్తాడు.
బోర్డు మెంబర్స్: సరే అని చెప్పి ఫోన్ పెట్టేసి, మీ నిజాయితీ తెలిసి కూడా మిమ్మల్ని అనుమానించాం. సుధాకర్ గారు వచ్చిన తర్వాతే మళ్ళీ కలుద్దాం అని కౌషికితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
నిషిక (ఆశ్చర్యంగా): ఇదంతా ఎలా సాధ్యమైంది? జైల్లో ఉన్న మామయ్య గారు ఎలా ఫోన్లో మాట్లాడారు?
కౌషికి కూడా ధాత్రిని అదే ప్రశ్న వేస్తుంది.. అప్పుడు కౌషికిని పక్కకి తీసుకువెళ్లి ఇలా చెప్తుంది.
పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తుంటే ఒక కానిస్టేబుల్ కనిపిస్తాడు.
కానిస్టేబుల్: ఈఎస్ఐ చాలా దుర్మార్గుడు.. వాడితో పెట్టుకోకండి.
ధాత్రి: ఆయన మీకు తెలుసా అని అడగటంతో.. ఈ సిటీలో వజ్రపాటి కుటుంబం గురించి తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. మా అన్న కొడుకు వాళ్ళ దగ్గరే జాబ్ చేస్తున్నాడు.
ధాత్రి: పోలీస్ స్టేషన్లో ఆయనకి ఏం జరుగుతుందో అనే భయం మాకు ఉంది.. అందుకే ఏమీ అనుకోకుండా ఈ ఫోన్ మీ దగ్గర ఉంచండి, అవసరమైనప్పుడు మేము ఫోన్ చేస్తాం. ఆయనకు ఇవ్వండి చాలు.
మీకు ఏ అవసరమైన హెల్ప్ చేయమని ఐజి గారు చెప్పారంటూ పోలీస్ ఆ ఫోన్ తీసుకుంటాడు. ఇదంతా కౌషికికి చెప్పి ఆ పోలీస్ సహాయంతోనే మావయ్య గారితో మాట్లాడించాను అని చెప్తుంది.
కౌషికి ( ధాత్రికి థాంక్స్ చెప్తూ..): ఇదంతా ఆ దివ్యాంక వల్లే తన పని చెప్తాను అంటూ ఆమె దగ్గరికి వస్తుంది.
దివ్యాంక : నువ్వు బోర్డు మెంబర్స్ కి అబద్దం చెప్పి మోసం చేశావు.. నీ బ్రతుకు మోసం, నీ వ్యాపారం మోసం.
కౌషికి ఆ మాటలకి కోప్పడుతూ ఆమెపై చెయ్యెత్తుతుంది.
నిషిక: నా ఫ్రెండ్ పై చేయి ఎత్తుతారా? ఇంటికి వచ్చిన అతిథిని అవమానిస్తారా?
కౌషికి: నిషికని మందలిస్తుంది.
వైజయంతి : ఏందమ్మి నువ్వు బయట వాళ్ల ముందు ఇంట్లో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. మన ఇంటికి వచ్చిన అతిథిపై చేయి ఎత్తకుండా ఉండాల్సింది.
దివ్యాంక: నా మీదే చెయ్యెత్తుతావు కదా.. ఇది ఇక్కడితో పోదు. నీ బ్రతుకు మీద కొడతాను. ఏదైతే నువ్వు ప్రపంచానికి తెలియకూడదు అని దాచావో.. అదే రేపు ప్రపంచానికి తెలియజేస్తాను.
ఆ మాటలకి షాక్ అవుతుంది కౌషికి. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: CBN లక్కీ నెంబర్ 23, వ్యూహం విడుదల తేదీ 23