Jagadhatri Serial Today May 28th: కేదార్,వైజయంతిని చంపడానికి వచ్చిన పాపారాయుడు....ఇద్దరినీ జగధాత్రి ఎలా కాపాడింది...?
Jagadhatri Serial Today Episode May28th: కేదార్‌ను గన్‌తో కాల్చడానికి పాపారాయుడు చేసిన ప్రయత్నం జగధాత్రివల్ల విఫలమవుతుంది. వైజయంతిని కూడా కాపాడటంతో ఇవాల్టి ఏపీసోడ్ ఆసక్తిగా మారుతుంది.

Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌లో ఈరోజు పాపారాయుడు గన్‌షాట్ నుంచి త్రుటిలో కేదార్, వైజయంతి తప్పించుకుంటారు.శుభమా అంటూ యువరాజు తొలిరోజు ఆఫీసుకు బయలుదేరి వెళ్తుండగా బుల్లెట్లు దూసుకురావడంతో ఈరోజు ఏపీసోడ్ రసవత్తరంగా మారుతుంది.
బుల్లెట్‌కు బలైపోయిన నరసింహా
అబ్దుల్ పేరుతో చలామణి అవుతున్న నరసింహాను పట్టుకోవడానికి జేడీ,కేడీ వెళ్తారు. ఫోన్లు దొంగతనం చేసే వాడిని నరసింహ దగ్గరకు పంపిస్తారు. వాడు పోలీసులు వచ్చారని పారిపొమ్మని సైగ చేయడంతో నరసింహా పారిపోతాడు. దీంతో,జగధాత్రి వెంటపడి నరసింహన్ పట్టుకుని స్టేషన్‌కు తరలిస్తుండగా మీనన్ మనుషులు వచ్చి నరసింహాను కాల్చిపడేస్తారు. దీంతో జేడీ నరసింహా ఫోన్ తీసుకుని కాల్‌డేటా ఓపెన్ చేయమని మనవాళ్లకు చెప్పు అంటూ కేదార్‌కు అందిస్తుంది. ఈకేసు జేడీ టేకప్ చేసిందని తెలిసిన లక్ష్మణ్ భయంతో మీనన్ దగ్గరకు పరుగులుతీస్తాడు. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి పాటిల్‌ను చంపితే...ఎలాంటి క్లూలేకుండానే జేడీ ఇక్కడి వరకు వచ్చిందని భయపడతాడు. ఈ మీనన్ ఉండగా నీకు భయం లేదని....ఆ నరసింహాను చంపేశాం కదా అని మీనన్ అంటాడు.వాడిని చంపినా కాల్‌లిస్ట్‌లో నా పేరు తెలిసిపోతుందని లక్ష్మణ్ చెప్పగా....నువ్వు అసలు భయపడకు నేను ఉన్నానని అభయమిస్తాడు మీనన్.
జగధాత్రిపై కోపం తగ్గలేదు
ఇంట్లో ఎవరూలేని సమయంలో సుధాకర్‌కు ఆస్తమా రావడంతో ఇన్‌హెల్‌ర్ కోసం ప్రయత్నిస్తుంటాడు.కానీ అప్పటికే ఊపిరితిత్తుల్లో నొప్పి ఎక్కువగా వచ్చి ఇబ్బందిపడుతుంటాడు.అది చూసిన జగధాత్రి, కేదార్ అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చి ఇన్‌హెల్లర్ ఇవ్వడానికి ప్రయత్నించగా తీసుకోడు.నేను చావనైనా చస్తాను గానీ మీ చేతులతో ఇచ్చింది తీసుకోనని చెబుతాడు. వాళ్లు ఎంత బ్రతిమలాడినా తీసుకోడు.ఇంట్లో ఎవరూ లేరని చెప్పినా వినడు. ఆస్తి కోసం కడుపులో బిడ్డను చంపేసిన మీకు ఇప్పుడు నా చావుతో ఆస్తిమొత్తం వస్తుందని ఆశపడుతున్నారనిఅంటాడు.అలా మాట్లాడవద్దని జగధాత్రి చెప్పినా వినడు. ఇంతలో వైజయంతి రావడంతో ఆమె ఇన్‌హెల్లర్ ఇవ్వగా తీసుకుంటాడు. సుధాకర్ మాటలకు జగధాత్రి బాధపడుతుండగా...కౌషికి వచ్చి ఓదార్చుతుంది.ఏం జరిగినా జగధాత్రి తప్పు చేస్తుందంటే మాత్రం నేను నమ్మనని అంటుంది. ఆ నిజం ఏంటో నిరూపించిన రోజు బాబాయి మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటాడని చెప్పడంతో కొంత ఉపశమనం కలుగుతుంది.
తొలిసారి ఆఫీసుకు బయలుదేరిన యువరాజు
.యువరాజును ఆఫీసుకు తీసుకెళ్తానని కౌషికి చెప్పడంతో అతన్ని రెడీ చేయడానికి నిషిక తంటాలుపడుతుంది.తొలిసారి ఆఫీసులో అడుగుపెడుతున్నారంటే అందరూ చూసి గర్వపడేలా ఉండాలని అంటుంది. ఇంతలో వైజయంతి అక్కడికి వచ్చి నువ్వు ఆలస్యం చేస్తే మీ అక్క వదిలిపెట్టి వెళ్లినా వెళ్తుందని అంటుంది.కాబట్టి త్వరగా కిందకు రమ్మని చెబుతుంది.ఇంతలో కేదార్,జగధాత్రి పూజ చేసి హారతి తీసుకుని వస్తారు.యువరాజుకు హారతి ఇస్తారు. తొలిసారి ఆఫీసుకు వెళ్తున్నావని ఇంట్లో వేసినట్లు అక్కడ కూడా తింగరి వేషాలు వేస్తే కోట్లరూపాయల నష్టంతోపాటు వేలాది మందికి ఉపాధి పోతుందని సుధాకర్ కొడుకుని హెచ్చరిస్తాడు. మీకు,అక్కకు ఎలాంటి ఇబ్బంది రాకుండా నడుచుకుంటానని చెప్పి తండ్రి కాళ్లకు దణ్ణంపెట్టి ఆశీర్వాదం తీసుకుంటాడు.వైజయంతి కాళ్లకు కూడా మొక్కడంతో ఆమె ఎంతో పొంగిపోతుంది.
కేదార్‌కు తుపాకీ గురి, వైజయంతిపై కాల్పులు
ఫోన్ రావడంతో కేదార్ బయటకు వచ్చి మాట్లాడుతుండగా...అప్పుడే అక్కడికి గన్‌తో వచ్చిన పాపారాయుడు...కేదార్‌కు గురిపెట్టి కాల్చబోతాడు.ఇంతలో జగధాత్రి అడ్డురావడంతో ఆగిపోతాడు. కానీ కిటీకీ అద్దంలో నుంచి పాపారాయుడుని చూసి కేదార్‌ను అక్కడి నుంచి తప్పిస్తుంది.ఇంట్లోకి వెళ్లి పాపారాయుడు బాబాయి వచ్చాడని పిన్నిని కాల్చేస్తాడని బయటకు వెళ్లొద్దని జగధాత్రి చెబుతుంది.యువరాజు తొలిసారి ఆఫీసుకు వెళ్తుంటే నాటకాలు ఆడుతున్నారా అంటూ నిషిక వాళ్లను తిడుతుంది. చెబుతున్నా వినకుండా బయటకు వెళ్లగానే...పాపారాయుడు వైజయంతిని గురిపెట్టి కాలుస్తాడు.ఇంతలో జగధాత్రి వచ్చి ఆమెను కిందకు కూర్చోబెడుతుంది.రెండుమూడు రౌండ్లు కాల్పులు జరపగా అందరూ భయపడి చస్తారు.ఇంతలో కేదార్ పాపారాయుడిని పట్టుకోవడానికి వెళ్తాడు. అంతా మీ వల్లే జరిగిందని నిషిక అనగా....వాళ్లు చెబుతున్నా వినకుండా మీరే కదా బయటకు వచ్చారని కౌషికి తిడుతుంది. ఇంతలో కేదార్ వెళ్లి పాపారాయుడిని కొట్టి గన్‌లాక్కుంటాడు. కేదార్‌పై పాపారాయుడు తిరగబడగా....అప్పుడే అక్కడికి వచ్చిన జగధాత్రి పాపారాయుడికి ఒక్కటి ఇవ్వడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
ట్రెండింగ్ వార్తలు





















