అన్వేషించండి

Jagadhatri Serial Today June 5th:నిషిక ప్రెగ్నెన్సీ గురించి సుధాకర్‌కు నిజం చెప్పేసిన డాక్టర్‌...జగధాత్రి, కేదార్‌కు సుధాకర్‌ క్షమాపణలు

Jagadhatri Serial Today Episode June 5th: నిషిక ప్రెగ్నెన్సీ, అబార్షన్‌ అన్నీ అబద్ధమేనని డాక్టర్‌తో చెప్పించిన జగధాత్రి...కుటుంబాన్ని నమ్మి తప్పు చేశానంటూ సుధాకర్‌ క్షమాపణలు చెబుతాడు

Jagadhatri Serial Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు  ట్విస్టులతో అదిరిపోయింది. జేడీ ఇచ్చిన వార్నింగ్‌తో కౌషికి ఇంటికి వచ్చిన డాక్టర్‌ సుధాకర్‌కు నిజం చెప్పేస్తుంది. నిషిక అసలు ప్రెగ్నెంట్ కాలేదని...ఆలాగే మొన్న జగధాత్రి తోసివేస్తే ప్రెగ్నెన్సీ కూడా పోలేదని చెబుతుంది.రెండుసార్లు కూడా నాకు డబ్బులు ఇచ్చి అలా అబద్ధం చెప్పమని చెప్పారని చెబుతుంది. దీంతో నిషిక, వైజయంతి, యువరాజుపై సుధాకర్‌ మండిపడతాడు. తనను క్షమించమని జగధాత్రి, కేదార్‌ను వేడుకోవడంతో ఈరోజు ఏపిసోడ్‌ రసవత్తరంగా సాగుతుంది

శ్రీవల్లి బెదిరింపు

జగధాత్రి, కేదార్ ఇంట్లో లేకపోవడంతో ఎక్కడికి వెళ్లారో అడగడానికి నిషిక, వైజయంతి ఇద్దరూ కిచెన్‌లో ఉన్న శ్రీవల్లి దగ్గరకు వెళ్తారు. ఆ జగధాత్రి ఎక్కడికి వెళ్లిందని నిషిక శ్రీవల్లిని అడుగుతుంది. మీ పనిమీదే వెళ్లారని శ్రీవల్లి సమాధానమిస్తుంది. ఎక్కడికని మళ్లీ నిలదీయగా...నాకు తెలియదు వదిన కాకపోతే ఇవాల్టితో మీ పని అయిపోతుందని మాత్రం చెప్పారని అంటుంది. దీంతో నిషికకు కోపం వస్తుంది. తిక్కతిక్క సమాధానాలు చెబితే బాగుండదని అసలు వాళ్లు ఎక్కడికి వెళ్లారో నీకు తెలుసుకదా అని అంటుంది. తెలుసు అయినా కానీ నీకు చెప్పనని అంటుంది. కాసేపట్లో మీకే తెలుస్తుంది కదా అని వెటకారంగా మాట్లాడి వెళ్లిపోతుంది. మనల్ని చూస్తేనే భయంతో చచ్చిపోయే శ్రీవల్లి మనతోనే ఇంత ధైర్యంగా మాట్లాడుతోందంటే ఆ జగధాత్రి ఏదో గట్టి ప్లాన్ వేసి  ఉంటుందని నిషిక అంటుంది.

డాక్టర్‌ను తీసుకొచ్చిన జగధాత్రి

బయట నుంచి వస్తున్న జగధాత్రిని ఆపి ఎక్కడికి వెళ్లావని నిషిక నిలదీస్తుంది. నీ సంగతి తేలుద్దామనే వెళ్లామని జగధాత్రి బదులిస్తుంది.లేని కడుపు ఉన్నట్లు నమ్మించి..అది మేమే పోగొట్టామని మామయ్యగారిని నమ్మించి మమ్మల్ని ఓడించావని తెగ సంతోషపడుతున్నావనుకుంటే...నువ్వేంటి అంత కంగారుపడుతున్నావని అంటుంది. ఇప్పుడు మీరు నిజం చెప్పినా మామయ్యగారు నమ్మేస్థితిలో లేరని అంటుంది. ఎవరితో చెప్పిస్తే నమ్ముతారో వాళ్లనే తీసుకొచ్చామని చెప్పి డాక్టర్‌ను పిలుస్తారు. డాక్టర్‌ను చూసిన వెంటనే నిషిక తోపాటు మిగిలిన వాళ్లు అదిరిపడతారు. మాకు చెప్పిన నిజం మా మామయ్యగారికి కూడా చెప్పండని జగధాత్రి ఆమెను లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. డాక్టర్‌ను అడ్డుకున్న వైజయంతి మీకు ఎంత డబ్బుకావాలన్నా ఇస్తాను కానీ మా ఆయనకు నిజం చెప్పడానికి వీల్లేదని వైజయంతి అంటుంది.

నిజం తెలుసుకున్న సుధాకర్‌

అప్పుడే అక్కడికి వచ్చిన సుధాకర్‌ నాకు నిజం తెలియకుండా ఉండడానికి డబ్బులు ఇస్తావా..? ఏంటి ఆ నిజమని సుధాకర్‌ గట్టిగా నిలదీయడంతో  వైజయంతి భయంతో వణికిపోతుంది. ఇంతకీ డాక్టర్ మన ఇంటికి ఎందుకు వచ్చిందని అడుగుతాడు. ఏంలేదని వైజయంతి చెబుతుండగా...జగధాత్రి అడ్డుపడి డాక్టర్‌ మీకు ఓ నిజం చెప్పడానికి వచ్చారని అంటుంది. మీరు కేదార్‌, జగధాత్రిపై కోపంగా ఉన్నారు కదా మామయ్య...అందుకే వీళ్లు ఆ డాక్టర్‌ను తీసుకొచ్చి ఏదో అబద్ధాలు ఆడించి మీకు దగ్గరవ్వాలని చూస్తున్నారని  నిషిక అంటుంది. ఇంతలో డాక్టర్ కల్పించుకుని మీరు అనుకుంటున్నట్లు నిషిక అసలు గర్భవతి కాలేదని...అబార్షన్‌ కూడా జరగలేదని చెబుతుంది. ఆ మాటలకు సుధాకర్‌ షాక్‌ తింటాడు. నాకు డబ్బులిచ్చి అలా చెప్పించారని చెప్పగానే నిషిక, వైజయంతిపై మండిపడతాడు. మీరు అసలు మనుషులేనా అని కోప్పడతాడు. మిమ్మల్ని నమ్మిన ప్రతిసారీ నేను తలదించుకునేలా చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.

జగధాత్రిని క్షమాపణలు కోరిన సుధాకర్‌

మీమాటలు నమ్మి బంగారం లాంటి జగధాత్రి, కేదార్‌ను అనుమానించి అవమానించానని సుధాకర్‌ బాధపడతాడు. మీరు మోసగాళ్లని తెలుసి కూడా  మిమ్మల్ని నమ్మి నేను మోసపోయానని అంటాడు. నన్ను క్షమించమ్మా అంటూ జగధాత్రి, కేదార్‌ను సుధాకర్‌ క్షమాపణలు కోరతాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Godavari Serial Today August 19th: 'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
'గోదావరి' సీరియల్: ఫింగర్ బౌల్‌ని ఇలా కూడా వాడుతారా..! పరువు తీసేసిన కృష్ణుడు! కిన్నెరకు సీరియస్‌!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 19th:ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
నువ్వులేక నేను లేను: ఏకులా వచ్చి మేకులా మారిన సుందరి...రాధ,దమయంతికి పెద్ద షాక్‌ ఇచ్చిన దొంగ చిట్టి
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget