Jagadhatri Serial Today JULY 1ST:: ఆశ్రమం ముసుగులో యాదమ్మ చేస్తున్న కుట్రల గుట్టురట్టు..కాచీ సాయంతో నిజం బయటపెట్టిన జేడీ
Jagadhatri Serial To్day Episode July 1st: ఆశ్రమం ముసుగులో యాదమ్మ చేస్తున్న మాదకద్రవ్యాల రవాణా గుట్టు ఆమెతోనే చెప్పిన జేడీ.. కాచీకి అండగా నిలిచిన కుటుంబం

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. ఆశ్రమంలో జరుగుతున్న దందా కాచీ ద్వారా తెలుసుకున్న జేడీ...ఆమెనే పావుగా వాడుకుని యాదమ్మ గుట్టు ఆమెనోటితోనే బయటపెట్టిస్తుంది. యాదమ్మను అరెస్ట్ చేసి భక్తుల కళ్లు తెరిపిస్తుంది. అటు కాచీకి కౌషికి సహా అందరూ మద్దతుగా నిలుస్తారు.
ఆశ్రంలో ఏం జరిగిందో చెప్పిన కాచీ
మొదటిసారి తక్కువ రేటుకు బంగారం ఇచ్చిన దయామయి అమ్మా రెండోసారి మళ్లీ పిలిస్తే వెళ్లానని ఈసారి ఓ బ్యాగ్ తెచ్చి నా ముందు ఉంచిందని అందులో మత్తుపదార్థాలు ఉన్నాయని జేడీకి చెబుతుంది. నేను వజ్రపాటివారి అమ్మాయిని కాబట్టి నన్ను ఎవరూ చెక్ చేయరని అందుకే పెద్దమొత్తంలో డ్రగ్స్ నాతో రవాణా చేయించాలని చూశారని చెబుతుంది.నేను నిజం బయటపెడతానని బెదిరించగా...ఇంతకు ముందు నువ్వు కొనుగోలు చేసింది దొంగ బంగారమని...ఓ వృద్ధురాలిని హత్య చేసి ఆ బంగారం దోచుకున్నారని బెదిరిస్తుంది. నువ్వు మా గురించి తెలిసేలోగా ఈ విషయం అన్ని మీడియా ఛానెళ్లకు వెళ్తుందని.. అప్పుడు మీ అక్క పరువే పోతుందని బెదిరిస్తుంది. కాబట్టి మర్యాదగా మేం చెప్పినట్లు చేయమని చెప్పారని కాచీ జేడీకి చెబుతుంది.
కాచీతోనే నిజం బయట పెట్టించిన జేడీ
యాదమ్మ డ్రగ్స్ రవాణా చేస్తుందని తెలిసినా...ఆమెను పట్టుకోవడానికి మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని...మేం లోపలికి వెళ్లే ఆమె నిజం బయటపెట్టదని జేడీ అంటుంది.కాబట్టి నువ్వే యాదమ్మ నోటిద్వారా తానే డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు ఒప్పుకునేలా చేయాలని చెబుతుంది.అందుకు అవసరమైన ఏర్పాట్లు తాను చేస్తానని చెబుతుంది. కాచీ మొదట భయపడినా...జేడీ ధైర్యం చెప్పడంతో ఓకే అంటుంది.కాచీ పెట్టుకున్న ఉంగరానికి కెమెరా ఫిక్స్ చేసి...ఆమెను ఆశ్రమంలోకి పంపిస్తారు. అలాగే బ్లూటూత్ ద్వారా ఎప్పటికప్పడు ఆమెకు బయట నుంచి జేడీ సూచనలు చేస్తూనే ఉంటుంది. లోపలనికి వెళ్లిన కాచీ నేరుగా యాదమ్మ దగ్గరకు వెళ్తుంది. ఆ పోలీసులకు మొత్తం చెప్పేశావా అంటే...వాళ్లకు చెబితే నాకు ఏం లాభం వస్తుందని అందుకే ఏ విషయం వారికి చెప్పలేదని చెబుతుంది.మరి ఎందుకు వచ్చావని అడిగితే...నువ్వు ఇచ్చిన డ్రగ్స్ నువ్వు చెప్పిన చోట నేను అందిస్తానని అందుకు నాకు పదిశాతం కమీషన్ ఇవ్వాలని అడుగుతుంది. దీనికి సరేనన్న యాదమ్మ....ఢీల్ ఓకే చేస్తుంది.ఈ ఆధారం సరిపోదని...యాదమ్మ నోటి నుంచే నిజం చెప్పించాలని జేడీ సూచిస్తుంది. దీంతో కాచీ యాదమ్మను ప్రశ్నిస్తుంది. ఈ దందాలోకి ఎలా వచ్చావని అడిగితే...జైలులో ఉన్నప్పుడే ఈ డ్రగ్స్ సరఫరా చేయాలని ప్లాన్ వేశానని చెబుతుంది.అందుకే ఆశ్రమం పేరిట మహిళలను దగ్గర చేసుకుని వారితోనే ఈ దందా సాగిస్తున్నానని క్లియర్‌గా చెప్పేస్తుంది.
రంగంలోకి దిగిన జేడీ,కేడీ
మత్తుపదార్థాలు తానే రవాణా చేస్తున్నానని యాదమ్మ ఒప్పుకోవడంతో ఇక జేడీ, కేడీ రంగంలోకి దిగుతారు.యాదమ్మను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు.ఇంతలో రౌడీలను యాదమ్మ ఉసిగొల్పుతుంది.జేడీ,కేడీ వాళ్లందరినీ తన్ని యాదమ్మను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా.... యాదమ్మ మనుషులు భక్తులను రెచ్చగొడతారు. వాళ్లు అమ్మను అరెస్ట్ చేస్తే తగులబెట్టుకుని చచ్చిపోతామంటూ పెట్రోలు తీసుకుని వస్తారు.దీంతో జేడీ యాదమ్మ మాట్లాడిన మాటల వీడియో వారికి చూపించడంతో వారి కళ్లు తెరుచుకుంటాయి. ఆశ్రమం పేరిట ఇక్కడ చేస్తున్న దందా గురించి చెప్పడంతో వాళ్లే యాదమ్మను తగులబెట్టి చంపేస్తామని వస్తారు. వాళ్లకు నచ్చజెప్పి జేడీ యాదమ్మను బయటకు తీసుకెళ్తుంది. ఆ ముగ్గురి మహిళలు ఎలా చనిపోయారని చెబితే...కాచీలాగే వాళ్లు కూడా పోలీసులకు చెబుతామని బెదిరించడంతో మా మనుషులే గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి వారి నోటిలో విషం పోసి చంపేశారని యాదమ్మ చెబుతుంది. ఇక ఇంటికి వచ్చిన కాచీకి అందరూ అండగా నిలుస్తారు.ఇంత జరుగుతున్నా మాకు చెప్పకుండా ఎందుకు నువ్వే నరకయాతన అనుభవించావని కౌషికి అడుగుతుంది.మేమంతా నీకు అండగా లేమా అని అడుగుతుంది. నిషిక కూడా నువ్వు ఈ ఇంటి ఆడబిడ్డవని నీకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పడంతో జగధాత్రి కూడా సంతోషిస్తుంది.
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు





















