Jagadhatri Serial Today July 17th: జగద్ధాత్రి సీరియల్: మరో లవ్‌స్టోరీ: కేథార్ కోసం మేఘనకు విషం తాగించేసిన ద్ధాత్రి! అసలు ట్విస్ట్ ఏంటంటే..?
Jagadhatri Today Episode జగద్దాత్రి కేథార్‌ని ప్రేమిస్తున్నానని మేఘన వాళ్లతో పాటు డీజీపీకి చెప్పడం మేఘన, ద్ధాత్రిలో కేథార్‌కి ఎవరు ఇష్టమో చెప్పమని డీజీపీ అడగటంలో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode మేఘన, కేథార్‌లు ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ ఫొటోలు, డ్యాన్స్‌లు చేస్తారు. జగద్ధాత్రి అడ్డుకోవడంతో మేఘన విషం తాగి చస్తా అని బెదిరిస్తుంది. దాంతో కేథార్ మేఘనతో కలిసి డ్యాన్స్‌లు చేస్తాడు. జగద్ధాత్రి కోపంగా వెళ్లి మేఘన మీద కోపం అంతా కుంకుడు కాయల మీద చూపిస్తుంది. కుంకుడు కాయల్ని చితక్కొట్టి జ్యూస్ తీసి పక్కన పెడుతుంది.
జగద్ధాత్రి తర్వాత కోపంగా హాల్‌లోకి వెళ్లి పాటలు ఆపేస్తుంది. దాంతో మేఘన విషం తాగేస్తానని జగద్ధాత్రిని బెదిరిస్తుంది. కేథార్‌తో సహ అందరూ జగద్ధాత్రిని తప్పుకోమని అంటారు. జగద్ధాత్రి మాత్రం మొండి పట్టు పడుతుంది. మేఘన విషం తాగేస్తా అని అంటుంది. జగద్ధాత్రి కూడా తాగమని అంటుంది. మేఘన తాగేస్తా తాగేస్తా అంటే జగద్ధాత్రి కోపంతో తాగేస్తా అనడం కాదు తాగేయాలి అని మేఘనతో విషం తాగించేస్తుంది. బామ్మ మేఘనని పట్టుకొని జగద్ధాత్రిని తిడుతుంది. అందరూ జగద్ధాత్రిని తిడతారు. ఇలా ఎందుకు చేశావ్ అని అంటుంది. కేథార్ కూడా జగద్ధాత్రితో ఎందుకు ఇలా చేశావ్ అంటాడు. జగద్ధాత్రి కేథార్‌కి అది విషం కాదని సైగ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లో బామ్మ కేథార్‌ని మేఘన తన వైపు తెప్పికోవడానికి విషం తాగమని చెప్పి తెనె బాటిల్ ఇస్తుంది.
బామ్మ, మేఘనల ప్లాన్‌ని జగద్ధాత్రి చాటుగా వినేస్తుంది. ఇక బామ్మ మేఘనని హాస్పిటల్‌కి తీసుకెళ్తా అని అంటే అంత టైం లేదని ఇందాకే కుంకుడు కాయ రసం చేశానని జగద్ధాత్రి మేఘనతో తాగించేస్తుంది. మేఘన బయటకు వెళ్లి వాంతులు చేస్తుంది. జగద్ధాత్రి మేఘన దగ్గరకు వెళ్లి కుంకుడు కాయ రసం ఇంకా కావాలా.. తేనె కావాలా అని అంటుంది. తెలిసే అంతా చేశావా అని మేఘన అని జగద్ధాత్రిని కొట్టడానికి చేయి ఎత్తుతుంది. దాంతో జగద్ధాత్రి కూడా మేఘన చేయి పట్టుకుంటుంది. బామ్మ ఆ వీడియో తీసి తన కొడుకు డీజీపీకి పంపిస్తుంది. వెంటనే డీజీపీకి కాల్ చేస్తుంది. జగద్ధాత్రి గురించి మేం ఏం చెప్పినా వినవు కదా మాట్లాడు అని జగద్ధాత్రికి ఫోన్ ఇస్తుంది.
డీజీపీ జగద్ధాత్రితో ఏంటి అమ్మా నువ్వు మేఘన, కేథార్‌ల మధ్యలోకి వస్తున్నావ్ కారణం ఏంటి చెప్పమ్మా అని డీజీపీ అడుగుతారు. దాంతో జగద్ధాత్రి సార్ నేను కేథార్‌ని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. కేథార్‌ని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను.. కేథార్‌కి కూడా ఆ విషయం తెలీదు. మేఘన రావడంతో చెప్పలేకపోయాను అంటుంది. ముందు మేఘన తన మనసులో మాట చెప్పింద కాబట్టి నువ్వు తప్పుకోవాలి అని అందరూ జగద్ధాత్రితో అంటారు. జగద్ధాత్రి డీజీపీతో పాటు అందరితో మనం పోట్లాడుకోవడం ఎందుకు కేథార్ మనసులో ఎవరు ఉన్నారో కేథారే చెప్తాడని అంటుంది. కేథార్ ఇప్పుడు చెప్పలేను అనుకుంటూ నాకు కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అవి నచ్చితేనే వాళ్లని చేసుకుంటా అంటాడు. ఏంటి అవి అని బామ్మ అడిగితే ఉదయమే లేవాలి. వంట చేయాలి. అందర్ని ప్రేమగా చూసుకోవాలి అంటూ మేఘనలో లేని క్వాలిటీస్ చెప్తాడు. వీటన్నింటిని కొన్ని రోజులు చూసి చెప్తానని అంటాడు. మేఘనని ఈ అన్ని క్వాలిటీస్‌లో ఎక్స్‌ఫర్ట్‌ని చేసి తీసుకొస్తానని బామ్మ తీసుకెళ్తుంది.
నిషిక, వైజయంతి మేఘన వల్ల ఇప్పట్లో ఏం జరగదు అని ఇప్పుడు కౌషికి బాబుని విడదీయాలని ఆదిలక్ష్మీని రెచ్చగొట్టాలి అనుకుంటారు. జగద్ధాత్రి కోపంగా గదిలోకి వెళ్తుంది. కేథార్ వెనకాలే వెళ్లి నవ్వుతాడు. జగద్ధాత్రి కోపంగా చూసి ఏంటి మాస్టారూ అలా నవ్వుతున్నారు అని అడుగుతుంది. చేయి పట్టుకుంటే కుంకుడు కాయ రసం తాగించేస్తావా అంటే ఇది నా ఆస్తి అని కేథార్‌ని పట్టుకొని చెప్తుంది. జగద్ధాత్రి చాలా కోపంగా ఉంటే కేథార్ ఐలవ్‌యూ అంటూ చెప్తాడు. జగద్ధాత్రి కోప్పడిన ప్రతీ సారి ఐలవ్‌యూ ఐలవ్‌యూ అని చెప్తాడు. జగద్ధాత్రి కూల్ అయిపోతుంది. ఇక కౌషికి పరుగున వచ్చి ఆదిలక్ష్మీ బాబుని ఆనాథాశ్రమంలో పడేయాలి అని తీసుకెళ్తుందని చెప్తుంది. సురేశ్, బాబాయ్ ఆపుతున్నా ఆగడం లేదని చెప్తుంది. ఆదిలక్ష్మీ నిషికకి కారు కీస్ తీసుకురమ్మని అంటే నిషిక తాళాలు తీసుకొచ్చి వెళ్తామని అంటే జగద్ధాత్రి ఆపి తిడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: అర్ధరాత్రి లోహితని చెట్టుకి కట్టేసిన మధు.. వెక్కి వెక్కి ఏడుస్తున్న లోహిత.. వీడియో వైరలైతే?





















