Jagadhatri Serial Today July 14th: జగద్ధాత్రి సీరియల్: ఆదిలక్ష్మి పిచ్చి పరాకాష్ట! జగద్ధాత్రి, కేథార్‌కి కౌషికి ఇంట్లో అవమానం!
Jagadhatri Today Episode కౌషికి ఇంటికి మినిస్టర్ తాయారు రావడం కేథార్, జగద్ధాత్రిలకు నిషిక వాళ్లకి పడదు అని తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జేడీ చనిపోయినట్లు నటిస్తుంది. మీనన్ అక్కడికి యామినిని తీసుకొని వెళ్తుంటాడు. జేడీ ఏదో ప్లాన్ వేసిందని అనుమానంతో మీనన్ కారు మధ్యలో దిగిపోయి కేవలం యామినిని మాత్రమే పంపిస్తాడు. కేడీ, జేడీలు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. జేడీ మనసులో నువ్వు చేసే తప్పులకు నీకు శిక్ష పడే వరకు నేను చావను మీనన్ ఇది నా ప్రామిస్ అని అనుకుంటుంది.
మీనన్ తనలో తాను జేడీ నీ ప్లాన్స్ నీకు ఉంటే నా ప్లాన్స్ నాకు ఉంటాయి అని అనుకుంటాడు. యామిని అత్త జేడీకి కృతజ్ఞతలు చెప్తుంది. మీలాంటి పోలీసుల వల్ల మేం సంతోషంగా ఉంటున్నామని అంటారు. సాధుసార్ జేడీ, కేడీలు మంచి వర్క్ చేశారని పొగుడుతారు. రేపు తాయారు ప్రమాణ స్వీకారం ఉందని చెప్తారు. దాంతో కేడీ రేపటి నుంచి ఆమె మమల్ని డైరెక్ట్‌గా టార్చర్ చేస్తుందన్న మాట అని అంటాడు. మీనన్‌కి జేడీని కాల్చేశా అని కాల్ చేసిన రౌడీని మీనన్ కాల్చేస్తాడు.
కౌషికి బాబు ఏడుస్తుంటాడు. కౌషికి బాబు దగ్గరకు వెళ్తుంటే ఆదిలక్ష్మీ వచ్చి కౌషికి చేయి పట్టుకొని బాబుకి దూరంగా ఉండమని అంటుంది. నా బిడ్డకు నాకు దూరంగా ఉండమని చెప్తారు ఏంటి అని కౌషికి అడుగుతుంది. ఆదిలక్ష్మీ బిడ్డను పట్టుకోవద్దని ఎంత చెప్పినా కౌషికి ఆదిలక్ష్మీతో మీకు పిచ్చి పట్టింది అత్తయ్య అని కోప్పడి బాబుని ఎత్తుకుంటుంది. దాంతో ఆదిలక్ష్మీ కరెంట్ వైరు పట్టుకొని బాబుని కింద పెట్టకపోతే చనిపోతా అని బెదిరిస్తుంది. కౌషికి అందరిని పిలుస్తుంది. కౌషికి బాబుని ఎత్తుకుంటే ప్రాబ్లమ్ ఏంటి అని అడిగితే దానికి ఆదిలక్ష్మీ కౌషికి ఈ బాబుని రేపు దత్తత తీసుకొని నా మనవరాలికి అన్యాయం చేస్తే ఎలా అని అంటుంది. అందరూ ఎంత చెప్పినా ఆదిలక్ష్మీ వినదు. బాబుని కింద పెట్టమని అంటుంది.
కౌషికి బాబుని కింద పెట్టడానికి రెడీ అయిపోతుంది. బాబు ఎక్కువ సేపు ఏడిస్తే ప్రాణానికే ప్రమాదం అని జగద్ధాత్రి, కేథార్ మాట్లాడుకుంటారు. ఆదిలక్ష్మీని మాటల్లో పెట్టమని జగద్ధాత్రి కేథార్‌కి చెప్పి మెల్లగా వెనక నుంచి వెళ్లి ఆదిలక్ష్మీని నెట్టేస్తుంది. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నేను చూస్తూ ఉండను అని సురేశ్ తల్లికి వార్నింగ్ ఇస్తాడు. ఇంతలో కౌషికి బాబాయ్ వచ్చి హోంమినిస్టర్ మన ఇంటికి వస్తున్నారు. ఏర్పాట్లు చూడండి అని చెప్తారు. సరే అని నిషిక మామయ్యతో చెప్పి జగద్ధాత్రితో చెప్పింది వినపడలేదా పోయి ఏర్పాట్లు చూడు అంటుంది.
జగద్ధాత్రి జ్యూస్ తయారు చేస్తుంటుంది. కేథార్ జగద్ధాత్రిని పిలిచి నువ్వు ఎప్పుడైనా ఏ పుణ్యం చేసుకుంటే ఇంత గొప్ప భర్త దొరికాడా అని అనిపించిందా అని అనుకుంటుంది. తర్వాత కేథార్ నాకు మాత్రం చాలా అదృష్టం చేసుకున్నానని నిన్నుచూసినప్పుడు అనిపిస్తుందని జేడీలా జగద్ధాత్రిగా భలే వర్క్ చేస్తున్నావ్ అంటుంది. జగద్ధాత్రి, కేథార్ ఇద్దరూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటే నిషిక చూసి మినిస్టర్ వచ్చే టైం అయింది పని చేయడం తెలీదా.. ముందు పని చేసి తర్వాత నవ్వుకోండి అని పొగరుగా చెప్తుంది. జగద్ధాత్రి సరే అని అంటుంది. కేథార్ మాత్రం అలా ఆర్డర్‌లు వేయడం కాదు వచ్చి నువ్వు పని చేయ్ అంటాడు. నేను పని చేయడం ఏంటి నేను ఈ ఇంటి కోడలిని అని నిషిక అంటే ధాత్రి కూడా ఈఇంటి కోడలే అని కేథార్ అంటారు.
నిషిక కేథార్‌తో మామామయ్యకి మా ఆయన ఒక్కడే కొడుకు నేను ఆయన భార్యని అంటే నేనే కోడలిని కదా అంటుంది. దాంతో జగద్ధాత్రి కేథార్ సుధాకర్ మామయ్య మొదటి కొడుకు అని మీకు తెలుసు. ఏం చేస్తే అందరూ ఒప్పుకుంటారో మాకు తెలుసు కానీ పరువు పోతుందని ఏం చేయడం లేదని జగద్ధాత్రి అంటుంది. ఇక కేథార్ అయితే నాకు ఆస్తిలో వాటా అవసరం లేదు కానీ నా భార్యకి మర్యాద ఇవ్వకపోతే ఒప్పుకోను అంటాడు. వాళ్ల మాటలు మొత్తం మినిస్టర్ తాయారు, విక్కీ వింటారు. ఇంతలో సుధాకర్ వాళ్లు వచ్చి మినిస్టర్‌ని పలకరిస్తారు. తాయారు వాళ్లు సుధాకర్‌తో మీ కోడళ్లతో మాట్లాడాలి అనుకున్నా కానీ వాళ్లు పోట్లాడుకుంటే మాట్లాడటం లేదని అంటుంది.
కౌషికి, సుధాకర్ వాళ్లు మినిస్టర్‌కి మర్యాద చేస్తారు. జగద్ధాత్రి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. సుధాకర్ తన భార్యని కొడుకు యువరాజ్, కోడలు నిషికని పరిచయం చేస్తారు. జగద్ధాత్రి, కేథార్ గురించి అడిగితే నిషిక అక్క అని కౌషికి పరిచయం చేస్తుంది. కేథార్ నాకు తమ్ముడు లాంటివాడు అంటే తమ్ముడు లాంటి వాడా నిజంగా తమ్ముడేనా అని అంటే యువరాజ్ కలగజేసుకొని ఒక్కడే వారసుడని అది నేనే అని అంటాడు. తాయారు మనసులో కేథార్‌కి ఇంట్లో వాళ్లకి పడటంలేదు ఇదే నాకు ఛాన్స్ అని అనుకుంటుంది. జగద్ధాత్రి జ్యూస్ ఇస్తే తాయారు ఈ కళ్లు ఎక్కడో చూసినట్లు ఉందని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: షాకింగ్.. విహారి కిడ్నాప్.. నడి రోడ్డు మీద కారు.. అర్థరాత్రి ఏం జరిగింది?





















