Jagadhatri Serial Today JULY 10th:జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్
Jagadhatri Serial Today Episode July 10th: జగధాత్రి తల్లిని మరోసారి అవమానించిన తాయర్...శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయిన మీనన్

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. జగధాత్రి తల్లి గొప్పతనం పొగుడుతూ ఆమె అవార్డును ధాత్రికి ఇస్తుండగా...మంత్రి తాయర్ అక్కడికి వచ్చి గొడవ చేస్తుంది.ధాత్రి తల్లి మంచిది కాదని నిరూపించి అక్కడ ఫంక్షన్ చెడగొడుతుంది. అందరూ ఇంటికి వెళ్లిపోతుండగా...మీనన్ వచ్చి శ్రీవల్లిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోతాడు.
జగధాత్రిని అవమానించిన తాయార్
అనాథ ఆశ్రమానికి జగధాత్రి తల్లి పేరు పెట్టి ఆమె పేరిట అవార్డును జగధాత్రికి ఇవ్వడానికి ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. అక్కడ వాళ్ల అమ్మ కావ్య గొప్పతనం గురించి ధాత్రి గొప్పగా చెబుతుంది. ఈ ఆవార్డు మానాన్న చేతుల మీదుగా తీసుకుంటానని చెబుతుంది. అవార్డు అందజేస్తుండగా....నిషిక, జగధాత్రి కోపంతో రగిలిపోతుంటారు. అనవసరంగా ఆ మంత్రితో పెట్టుకున్నామని ఇప్పటి వరకు రాలేదని మండిపడిపోతుంటారు. మనమే ఏదో ప్లాన్ చేసి ఈ ఫంక్షన్ చెడగొట్టి ఉంటే బాగుండేదని అనుకుంటుండగానే మంత్రి తాయారు అక్కడికి వస్తుంది. నిన్ను ఈ ఫంక్షన్‌కు పిలవలేదని...అనవసరంగా వచ్చి గొడవ చేయవద్దని కేదార్ హెచ్చరిస్తాడు. నేను ఈ ఫంక్షన్ కోసం రాలేదని...ఇక్కడ తప్పు జరగుతోందని తెలిసి హెచ్చరించడానికి వచ్చానని తాయర్ అంటుంది. డబ్బుకోసం న్యాయాన్ని అమ్ముకున్న ఓ ఆఫీసర్ పేరు అనాథ శరణాలయానికి పెట్టడమేగాక,...అవార్డు ఇవ్వడం ఏంటని అంటుంది. దీంతో జగధాత్రికి కోపం వచ్చి తాయర్‌కు వార్నింగ్ ఇస్తుంది.అనవసరపు ఆరోపణలు, ఆధారాలు లేని మాటలు వద్దని గట్టిగా చెబుతుంది.
తాయర్‌కు జగధాత్రి వార్నింగ్
జగధాత్రికి మంత్రి తాయార్ కూడా దీటుగా జవాబిస్తుంది. మీ అమ్మ తప్పుడు మనిషి అని...తప్పులు చేసిందని నిరూపించే ఆధారాలు చూపిస్తే నమ్ముతావా అని అంటుంది. వెంటనే కార్మికసంఘం నాయకుడు నాగరాజును పిలుస్తుంది. ఇతను ఎవరో తెలుసా అని అడగ్గా....ధాత్రి తండ్రి గుర్తుపట్టి నాగరాజు అని చెబుతాడు. పాతికేళ్ల క్రితం చూసిన మనిషిని కూడా గుర్తుపట్టారంటే....అప్పుడు జరిగిన విషయం కూడా గుర్తే ఉండి ఉంటుందని అంటుంది. అదేంటో మీ నోటితో మీరే చెప్పండని మినిష్టర్ చెబుతుంది. దీంతో జగధాత్రి వాళ్ల నాన్న అసలు విషయం చెబుతాడు. పాతికేళ్ల క్రితం ఓ మినిష్టర్‌కు చెందిన కంపెనీలో అగ్నిప్రమాదం జరిగిందని....20మంది కూలీలు చనిపోగా,వందలాది మంది గాయపడ్డారని చెబుతాడు.ఆ కేసు మీ అమ్మకే అప్పగించారని అంటాడు.ఆ తర్వాత కథ నేను చెబుతానని తాయర్ చెప్పడం ప్రారంభిస్తుంది. ఈ కూలీలకు న్యాయం చేస్తానని నమ్మించి ఆధారాలన్నీ తీసుకుని వాటిని మినిస్టర్‌కు అందజేసి డబ్బులు తీసుకుందని అంటుంది. ఇదంతా అబద్ధమని జగధాత్రి అంటుంది. ఆ కేసు కోర్టులో ఓడిపోయిందని కార్మికులు రోడ్డున పడ్డారని అంటుంది.అందుకు అవసరమైనా సాక్ష్యాలుగా పేపర్‌లో పడిన వార్తలు చూపిస్తుంది. ఏం జరిగింది నాన్న అని అడిగితే....ఆ కేసులో అవసమరైన సాక్ష్యాలను మీ అమ్మ కోర్టులో ప్రవేశపెట్టలేకపోయిందని చెబుతాడు. దీంతో ధాత్రి కల్పించుకుని మా అమ్మ కోర్టులో సాక్ష్యాలు నిరూపించలేకపోయినంత మాత్రాన అమె తప్పు చేసినట్లు కాదని అంటుంది. కానీ మినిష్టర్ తీసుకొచ్చిన నాగరాజు మాత్రం...మీ అమ్మవల్లే వేలాది మంది కార్మికులు రోడ్డునపడ్డారని తిట్టి వెళ్లిపోతాడు. దీంతో ఫంక్షన్ చేస్తున్న నిర్వాహుకులు కూడా ఇలాంటి ఆవిడకు సన్మానం చేయమని...అవార్డు కూడా ఇవ్వమని చెప్పి వెళ్లిపోతారు. జగధాత్రి తీవ్ర అమానపడటంతో మినిస్టర్ అక్కడి నుంచి వెళ్లిపోగా...నిషిక, వైజయంతి మాత్రం సంతోషిస్తారు.
శ్రీవల్లి కిడ్నాప్
ఫంక్షన్ చెడిపోవడంతో అందరూ ఇంటికి వెళ్లిపోతుండగా....కారు ఎక్కుతున్న శ్రీవల్లిని మీనన్ మనుషులు ఎత్తుకునిపోతారు. జగధాత్రి,కేదార్, కౌషికి వెంటపడినా ఆగరు.దీంతో కౌషికి పోలీసుస్టేషన్‌కు బయలుదేరగా...జేడీ, కేడీ మీనన్‌ను వెతుక్కుంటూ బయలుదేరతారు. శ్రీవల్లిని ఎత్తుకెళ్లిపోయింది మీనన్ అని మనకు తెలుసు కాబట్టి వాడు అంత ఈజీగా దొరకడని...ఆ డెన్ ఎక్కడ ఉందో కూడా కనిపెట్టలేమని ధాత్రి అంటుంది. కాబట్టి మనలో ఒకరు మీనన్ మనుషులకు దొరికిపోయి కిడ్నాప్ అవ్వాలని అప్పుడే మనం ఆ స్థలం కనిపెట్టి తీరుతామని జగధాత్రి ప్లాన్ వేస్తుంది.
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు






















