jagadhatri serial Today july 2nd Promo: జగద్ధాత్రి సీరియల్ ప్రోమో: తన తల్లి కేసులో తాయారు హస్తం ఉందని తెలుసుకున్న జేడీ!
jagadhatri Today Promo తన తల్లి కావ్య చావు కుట్ర వెనక తాయారు ఉందని అపొజిషన్ లీడర్ బసిరెడ్డి ద్వారా జేడీ తెలుసుకోవడంతో ఇవాళ్టి ప్రోమో ఆసక్తికరంగా మారింది.

jagadhatri serial Today Promo జేడీ అండ్ కేడీ ఈ పేరు వింటే చాలా తప్పు చేసిన వాళ్లు గజగజా వణికిపోవాల్సిందే. ఎన్నో కేసులను అత్యంత చాకచక్యంగా పరిష్కరించి ఇంట్లో వాళ్లకి ఈ భార్యభర్తలు తన వృత్తి గురించి తెలీకుండా జాగ్రత్త పడుతున్న భార్యభర్తలు జేడీ కేడీ. నిన్నటి ఎపిసోడ్‌లో జేడీ కేడీలకు తాయారుకి హోం మంత్రి పదవి ఇచ్చారనే న్యూస్ తెలిసి షాక్ అవుతారు. ఇలాంటి దుర్మార్గుల చేతిలో అధికారం ఉంటే అరాచకాలే చోటు చేసుకుంటాయి అనుకుంటారు. ఈ తరుణంలో తాజా ఎపిసోడ్ జగద్ధాత్రి తల్లి పోలీస్ అధికారి అయిన కావ్య చావుకి తాయారుకు సంబంధం ఉందని తెలియడంతో ఆసక్తికరంగా మారింది.. ఇంతకీ ప్రోమోలో ఏం ఉంది అంటే..
" తాయారుకి హోం మినిస్టర్ పదవి ఇస్తారు. ఈ సందర్భంగా అందరూ తాయారుని విష్ చేయడానికి వెళ్తుంటారు. తాయారు తన ఇంటి దగ్గర బందోబస్తుకి జేడీ కేడీలు వచ్చేలా ఐజీతో చెప్పిస్తుంది. జేడీ కేడీలు బందోబస్తులో ఉంటారు. అయితే ప్రతిపక్ష నేత బసి రెడ్డి తన కార్యకర్తలతో తాయారు ఇంటికి వచ్చి ఈమెకు ఎలా హోం మనిస్టర్ పదవి ఇస్తారు అని తాయరు డౌన్ డౌన్ అని నిరసన తెలుపుతారు. జేడీ వాళ్లని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు బసిరెడ్డి తాయారుతో పాతికేళ్ల క్రితం ఓ చిన్ని కేసుతో మొదలైన నీ కథ నీకు గుర్తుందా.. నీకు మినిస్టర్ కుర్చీలో కూర్చొనే అర్హత ఉందా అని ప్రశ్నిస్తారు. జేడీ వెంటనే మీరు మాట్లాడుతుంది ఏ కేసు గురించి సార్ అని అడుగుతుంది. దాంతో బసి రెడ్డి ఇన్‌స్పెక్టర్ కావ్య మోస్తున్న నిందకి కారణం నువ్వుని తెలిసి ఎలా మర్చిపోగలను. ఇన్నాళ్లు అయినా ఆ కుటుంబం తప్పు చేసిన వాళ్లలా నలుగురిలో నిలబడ్డారు అంటే ఎవరి వల్ల అంటారు. జగద్ధాత్రి కుప్పకూలిపోతుంది. కేథార్ జగద్ధాత్రితో అతను చెప్పిన దాని ప్రకారం అత్తయ్య చావుకి తాయారుకి సంబంధం ఉందని అనిపిస్తుంది అంటాడు. దీంతో ప్రమో పూర్తయిపోతుంది."
నిన్నటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..
యువరాజ్ తాగిన మైకంలో రంగా అనే వ్యక్తిని కొడతాడు. అతని తలకు గాయం అయి రక్తం కారిపోతుంది. రంగ మనుషులు వచ్చి కౌషికి ఇంటి దగ్గర గొడవకు దిగుతారు. కౌషికి, జగద్ధాత్రి, కేథార్ అందరూ వాళ్లని బతిమాలుతారు. డబ్బు ఇస్తామని అంటారు. తమ్ముడిని కాపాడుకోవడానికి కేథార్ తానే రంగాని కొట్టానని చెప్తాడు. దాంతో కేథార్ రంగ తరఫు మనషులు కొడతారు. కౌషికి బతిమాలడంతో తిండి పెట్టిన మీకు ఇబ్బంది కలిగించమని వెళ్లిపోతారు. తర్వాత ఫంక్షన్ పనులు మొదలవుతాయి. ఫంక్షన్‌కి కౌషికి భర్త సురేశ్, తల్లి ఆదిలక్ష్మీ కూడా బయల్దేరుతారు. కౌషికి ఇంట్లో విషయం చెప్పడంతో ఆదిలక్ష్మీని అడ్డు పెట్టుకొని కౌషికిని ఇబ్బంది పెట్టాలి అని నిషిక అత్త అనుకుంటారు. తర్వాత పోలీసులైన జేడీ కేడీలకు తమ పై అధికారి కాల్ చేసి తాయారుకి మినిస్టర్ పదవి ఇచ్చారని అంటారు. అలా ఎలా ఇస్తారని తనకు చాలా క్రైమ్ బ్యాక్‌గ్రౌండ్ ఉందని అనుకుంటారు. ఇక తాయారు ఇంటికి బందోబస్తుకి జేడీ కేడీలను వెళ్లొద్దని అధికారి చెప్తారు. ఇంతలో ఐజీ కాల్ చేసి జేడీ కేడీలను పంపాలని అంటారు.
Also Read: చిన్ని సీరియల్: మహి కారుని ఆటోలా వాడేసుకున్న మధుమిత.. దేవా హోంమంత్రి.. శ్రియ ఎవరో తెలుసా!





















