అన్వేషించండి

Jabardasth Vinod: నాపై చేతబడి - రూ.5 లక్షలు పోగొట్టుకున్నాను: ‘జబర్దస్త్’ ఫేమ్ వినోద్

జబర్దస్త్‌లో వినోదినిగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న వినోద్.. తన ఆర్థిక పరిస్థితుల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

బుల్లితెరపై ప్రేక్షకులు నవ్వుతూ చూసే నటీనటుల జీవితకథ అనేది ఒక్కొక్కసారి చాలా బాధాకరంగా ఉండవచ్చు. అలాగే ‘జబర్దస్త్’ అనే స్టాండప్ కామెడీ షో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వినోద్ అలియాస్ వినోదిని జీవితంలో కూడా అలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. లేడీ గెటప్స్ వేయడం వల్ల ముందు నుండే వినోద్‌పై పలువురు ప్రేక్షకుల్లో నెగిటివిటీ ఏర్పడింది. అంతే కాకుండా ఆర్థికంగా కొందరిని నమ్మి కూడా అతను చాలా విధాలుగా నష్టపోయాడు. తాజాగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో మరోసారి తను ఎదుర్కున్న ఆర్థిక ఇబ్బందుల గురించి బయటపెట్టాడు వినోద్.

‘జబర్దస్త్’ ఫ్యామిలీ సాయం..
‘జబర్దస్త్’ మాత్రమే కాకుండా మరెన్నో ఈటీవీ షోలలో కూడా లేడీ గెటప్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు వినోద్ అలియాస్ వినోదిని. కెరీర్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో పర్సనల్‌గా తను ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కున్నాడు. సొంతింటి కలను నెరవేర్చుకునే విషయంలో మోసపోయి, దెబ్బలు తినడం అప్పట్లో బుల్లితెరపై సంచలనం సృష్టించింది. ఆ సమస్య తీరకముందే పలు ఆరోగ్య సమస్యలతో వినోద్ ఆసుపత్రిపాలయ్యాడు. అనారోగ్య సమస్యల నుండి కోలుకున్న తర్వాత వినోద్.. పలు ఇంటర్వ్యూలలో పాల్గొని, తన పర్సనల్ విషయాలను బయటపెట్టాడు. తాజాగా తను పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం బాలేనప్పుడు జబర్దస్త్ నటుల్లో ఎవరెవరు సాయం చేశారు అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు.

ఫోన్ చేసి అడగను..
చమ్మక్ చంద్ర, అభి, రాకేశ్, గెటప్ శ్రీను, సుధీర్, రామ్‌ప్రసాద్.. వీరందరూ తన జబర్దస్త్ ఫ్యామిలీ అని వారందరూ తనకు ఆరోగ్యం బాలేనప్పుడు ఆర్థిక సాయం చేశారని తెలిపాడు వినోద్. అయితే తనంతట తానుగా ఎవరిని ఫోన్ చేసి ఆర్థిక సాయం అడగలేదని, అందరూ తన ఆరోగ్యం గురించి తెలుసుకొని సాయం అందించడానికి ముందుకు వచ్చారని తెలిపాడు. ఆర్థికంగా తాను ఇబ్బందులు పడుతున్నప్పుడు రోజా కూడా సాయం చేయడానికి ముందుకొచ్చారని అన్నాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం కుదుటపడిందని అన్నాడు. అందుకే ఈవెంట్స్ చేయడానికి ఒప్పుకుంటానని, త్వరలోనే కామెడీ షోలలో కూడా పాల్గొంటానని చెప్పాడు.

ఎముక విరిగింది..
తన ఆరోగ్యం బాలేని సమయంలో చాలామంది చేతబడిలాంటిది జరిగుంటుంది అని అనుమానంగా చెప్పారని, అందుకే దానికోసం కూడా ఖర్చు చేశానని, దాంతో పాటు ఆసుపత్రి ఖర్చులు అన్నీ కలిపి దాదాపుగా రెండున్నర లక్షలు అయ్యిందని వినోద్ బయటపెట్టాడు. ప్రస్తుతం తనకు ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవని, నెలాఖరు వచ్చేసరికి తన ఖర్చులతో పాటు తన కుటుంబానికి సంబంధించిన ఖర్చులు కూడా తాను భరించగలిగే పరిస్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ తన ఇంటి సమస్య తీరలేదని వాపోయాడు. ఇల్లు కోసం జరిగిన గొడవలో తన ఎముక కూడా విరిగిపోయిందని, తన ఆరోగ్య సమస్యల వల్ల ఆసుపత్రిలో జాయిన్ అయినప్పుడు ఈ విషయం బయటపడిందని తెలిపాడు. అంతే కాకుండా ఒకరి విషయంలో హామీగా నిలిచి రూ.5 లక్షలు కోల్పోయానని బయటపెట్టాడు. 

Also Read: అభిమానులకు షాకిచ్చిన 'ఫ్యామిలీ స్టార్' - అదేంటీ, అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Telangana Group 2 Exams: నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
నిమిషం ఆలస్యమైనా ఇంటికే- తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు కీలక సూచనలివే
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Embed widget