Jabardasth Pavithra: 'జబర్దస్త్' పవిత్రకు సీరియల్ ఆఫర్... మాజీ లవ్ బర్డ్స్ లేటెస్ట్ 'స్టార్ మా' సీరియల్‌లో
Star Maa Telugu Serials: జబర్దస్త్ చూసే జనాలకు ఫిమేల్ ఆర్టిస్ట్ పవిత్ర తెలిసే ఉంటుంది. తనదైన కామెడీతో ఆవిడ జనాలను ఎంతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది.

'జబర్దస్త్' ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఆ కామెడీ రియాలిటీ షో ద్వారా తమ టాలెంట్ చూపించుకున్న ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు. ఆ లిస్టులోని ఫిమేల్ ఆర్టిస్టులలో 'జబర్దస్త్' పవిత్ర (Jabardasth Pavithra) ఒకరు. ఒక వైపు ఆ షో చేస్తూ మరో వైపు సీరియల్స్ చేసే అవకాశాలు అందుకుంది. ఆ అమ్మాయికి 'స్టార్ మా'లో సూపర్ హిట్ సీరియల్ (Star Maa Serials) చేసే ఛాన్స్ వచ్చింది.
'చిన్ని' సీరియల్‌లో 'జబర్దస్త్' పవిత్ర ఎంట్రీ
Jabardasth Pavithra joins Chinni serial: స్టార్ మా ఛానల్ సూపర్ హిట్ సీరియళ్లలో 'చిన్ని' ఒకటి. ఆల్మోస్ట్ 220 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఇందులో స్పందన పాత్రలో 'జబర్దస్త్' పవిత్ర ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మాయి క్యారెక్టర్ మున్ముందు ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి పాత్ర ద్వారా ఎటువంటి ట్విస్టులు దర్శక రచయితలు ఇవ్వబోతున్నారు? అనేది త్వరలో తెలుస్తుంది.
'జబర్దస్త్' ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పవిత్రకు ఆ తర్వాత 'శ్రీదేవి డ్రామా కంపెనీ', 'ఫ్యామిలీ స్టార్స్', ఇంకా స్టార్ మాతో పాటు జీ తెలుగులో ప్రసారం అయ్యే కొన్ని రియాలిటీ షోలలో చేసే అవకాశం వచ్చింది. అలాగే కొన్ని సీరియల్స్ కూడా చేసింది. ఇప్పుడు మరొక సీరియల్ చేసే అవకాశం అందుకుంది.
Also Read: సినిమాల్లో బోల్డ్, సె*** సీన్స్... ఎందుకు చేయడం లేదో చెప్పిన కరీనా కపూర్
'చిన్ని'లో మాజీ లవ్ బర్డ్స్ నిఖిల్, కావ్య శ్రీ!
'చిన్ని'లో కావ్య శ్రీ (Kavya Sree) మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పాత్ర సీరియల్ మెయిన్ పిల్లర్. ఒక చిన్నారికి తల్లిగా డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. మధ్యలో ఆవిడ డ్యూయల్ రోల్ చేస్తున్నారని చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు. కొత్తగా ఇందులోకి కావ్య శ్రీతో బ్రేకప్ అయిన నిఖిల్ ఎంటర్ అయ్యాడు.
నిఖిల్ మలియక్కల్ (Nikhil Maliyakkal) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు కన్నడిగ అయినప్పటికీ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రజలకు దగ్గర అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిలిచాడు. ఆ వెంటనే అతను చేస్తున్న సీరియల్ ఇది. ఇందులో నిఖిల్, కావ్య శ్రీ మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయి? వీళ్లిద్దరి జోడి మళ్లీ ఒకటి అవుతుందా? లేదా? అనే ఆసక్తి కూడా బుల్లితెర వీక్షకులలో మొదలయ్యింది. నిఖిల్ ఎంట్రీ 'చిన్ని'కి కావాల్సినంత ప్రచారాన్ని తీసుకువచ్చింది.
బిగ్ బాస్ విన్నర్ అయ్యాక నిఖిల్ సినిమాల మీద కాన్సెంట్రేట్ చేస్తాడని చాలా మంది భావించారు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అతను మళ్లీ బుల్లి తెర మీదకు వచ్చాడు. గతంలో బిగ్ బాస్ షో విజేతలుగా నిలిచిన కౌశల్ మండ సహా కొంత మంది సినిమాల మీద దృష్టి పెట్టగా... వాళ్లకు ఆశించిన విజయాలు రాలేదు బహుశా అది దృష్టిలో పెట్టుకున్నాడో ఏమో మళ్లీ తనకు పాపులారిటీ తీసుకొచ్చిన టీవీ వైపు అడుగులు వేశాడు నిఖిల్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

