స్కిన్ షో చేయడం కూడా సనాతన ధర్మంలో భాగమా? రష్మికి నెటిజన్ కౌంటర్ - ఆమె రిప్లై ఇదీ!
సనాతన ధర్మానికి సంబంధించి ఓ నెటిజన్ బుల్లితెర యాంకర్ రష్మిని, స్కిన్ షో చేయడం కూడా సనాతన ధర్మమేనా? అని ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది రష్మీ.
బుల్లితెర గ్లామరస్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓవైపు యాంకర్ గా బుల్లితెరపై కొనసాగుతూనే మరోవైపు సినిమాల్లోనూ నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. నచ్చిన విషయాలను, తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది రష్మీ. ఎక్కువగా మూగజీవాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తూ ఉంటుంది. అలాంటిది మొదటిసారి రష్మీ తాజాగా సనాతన ధర్మం గురించి సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతోంది. దీంతో చాలామంది రష్మీ ని ట్రోల్ చేస్తున్నారు. మూగజీవాలతో పాటు స్త్రీ వాదం గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడే రష్మీ ఈసారి సనాతన ధర్మం గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడిన దానికి ఓ నెటిజన్ కౌంటర్ వేశాడు.
‘‘స్కిన్ షో, ఎక్స్‌పోజింగ్ చేయడం చేయడం కూడా సనాతన ధర్మమేనా?’’ అంటూ ‘బాయ్స్ హాస్టల్’ మూవీ గురించి ఓ నెటిజన్ రష్మీని ప్రశ్నించాడు. దానికి రష్మీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ‘‘వాదన గెలవలేనప్పుడు ఇలాంటి ఫోటోలు పెట్టి సంబంధం లేని ప్రశ్నలు అడుగుతారు’’ అని నెటిజన్స్ పై అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు రష్మీ రిప్లై ఇస్తూ.. "ఇది సంస్కృతిలో ఒక భాగం. మీరు ఏ స్కిన్ షో గురించి మాట్లాడుతున్నారు? దండయాత్రలు జరగడానికి ముందు మేము ఎలా దుస్తులు ధరించామో దయచేసి తెలుసుకోవాలి. హిందూ బాలికలు ఎలా ధరించారు లేదా ఏమీ ధరించారు అనేది తెలుసుకోవాలి. మేము ఎప్పుడూ ఇంత నిస్సారంగా లేము. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఆంక్షలు మానవ నిర్మితమే. వాటికి హిందూ మతం లేదా సనాతన ధర్మంతో సంబంధం లేదు" అంటూ రష్మీ పేర్కొంది.
దీంతో సనాతన ధర్మం గురించి మాట్లాడే హీరోయిన్లు ముందుగా స్కిన్ షో చేయడం మానేయాలి అనే వ్యాఖ్యను వెంటనే నెటిజన్ తోసిపుచ్చాడు. హిందూ మతం సనాతన ధర్మానికి చెందిన చాలామంది మద్దతుదారులు రష్మీ రిప్లైకి సపోర్ట్ చేశారు. అంతేకాకుండా ఓ పొరుగు రాష్ట్రానికి చెందిన హీరో చేసిన వ్యాఖ్యలను ఖండించినందుకు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్లతో చర్చల్లో పాల్గొనవద్దని కోరారు. మరోవైపు ఇదే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఓ వీడియోను రష్మీ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఆ వీడియోపై కూడా ట్రోల్స్ చేశారు నెటిజన్స్.
నిజానికి ఈ సనాతన ధర్మం వివాదం తమిళ హీరో ఉదయనిది స్టాలిన్ వ్యాఖ్యలతో మొదలైంది. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన ఉదయనిది స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ.. "సనాతన ధర్మం అనేది ఒక రోగం లాంటిది. డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి రోగాలు ఎంత ప్రమాదకరమో, సనాతన ధర్మం కూడా అంతే ప్రమాదం. దాన్ని వెంటనే నిర్మించాలి" అని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారాయి. అప్పటినుంచి సినీ, రాజకీయ ప్రముఖులంతా ఉదయనిది స్టాలిన్ వ్యాఖ్యల్ని తప్పబడుతూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. వీళ్ళతోపాటు పలు హిందూ సంఘాలు కూడా ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
Also Read : చంద్రబాబు అరెస్టుపై స్పందించిన దర్శకుడు రాఘవేంద్రరావు, అలిపిరి ఘటనను గుర్తుచేసుకుంటూ..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial