Illu Illalu Pillalu Serial Today October 31st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: శోభ కోసం అత్తాకోడళ్ల హైడ్రామా! కిడ్నాపర్లు దొరికారా? ధీరజ్ పరిస్థితి ఏంటి?
Illu Illalu Pillalu Serial Today Episode October 31st అత్తా ముగ్గురు కోడళ్లు కలిసి గెటప్‌లు వేసుకొని మరీ శోభని కాపాడి ధీరజ్‌ని విడిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode శోభ కనిపించడం లేదని.. శోభని వెతుకుతున్నాం అని వాళ్లకి తెలిసిపోయింది కాబట్టి వాళ్లు అలర్ట్ అయిపోతారు.. ఇక మనం ధీరజ్‌ని కాపాడుకోలేం అని ప్రేమ ఏడుస్తుంది. దానికి వల్లీ నువ్వు భలే చెప్తున్నావ్ ప్రేమ.. వాళ్లు ఎక్కడికీ వెళ్లరు ఇక్కడే ఉంటారు అని అంటుంది. అంత కచ్చితంగా ఎలా చెప్తున్నావ్ అని వేదవతి అడుగుతుంది. 
వల్లీ అత్త వాళ్లతో ఇంత పట్టపగలు కిడ్నాప్ చేసిన వ్యక్తిని ప్లేస్ మార్చడం అంత సామాన్య విషయం కాదు.. పైగా మనం ఇక్కడే ఉన్నాం అని వాళ్లని వెతుకుతున్నాం అని తెలుసు కాబట్టి అస్సలు బయటకు రారు. సాయంత్రం వరకు ఇక్కడే ఉండి చీకటి పడితే ప్లేస్ మార్చే పని చేస్తారు కాబట్టి ఈలోపు మనం ప్రతి ఇంటిని వెతికితే శోభ దొరికిపోతుంది అని వల్లీ అంటుంది. దానికి నర్మద అబ్బో పుల్లలు అంటించే పనే అనుకున్నా ఇలాంటి బాగానే చెప్తున్నావ్ అంటుంది. నాలాంటి మంచిదాన్ని మాటలంటే ఆ దేవుడు ఊరుకోడు అని అంటుంది వల్లీ. వల్లీకి బుర్ర లేకపోయినా మంచి ఐడియా ఇచ్చిందని అంటుంది వేదవతి.
వల్లీ చెప్పినట్లు ప్రతీ ఇల్లు వెతకాలి అని వేదవతి అంటుంది. ఐడియా ఐడియా అంటూ వేదవతి గెంతి ఇంటింటికి పాలు వేద్దాం అంటుంది. ఇంటింటికి పేపర్ వేద్దాం అని వల్లీ అంటుంది. ఉదయం వేయాల్సిన పేపర్ మధ్యాహ్నం వేస్తే చితక్కొడతారు అని ప్రేమ అంటుంది. తర్వాత వల్లీ ఇంటింటికి వెళ్లి జనాభా లెక్కలు అని అంటుంది. ఈ ఐడియా బెడిసి కొడుతుందని నర్మద అంటే ఇంత కంటే మంచి ఐడియా నీ దగ్గర ఉందా అని వేదవతి అడుగుతుంది. లేదు అని నర్మద అంటే అయితే మూసుకొని ఫాలో అయిపో అంతే అని అంటుంది. 
అత్తాకోడళ్లు గెటప్‌లు మార్చేస్తారు. నలుగురు డ్రస్‌లు వేసుకొని క్యాప్స్ పెట్టుకొని జనాభా లెక్కలు అంటూ వెళ్తారు. నలుగురు జనాభా లెక్కలు అంటూ తిరుగుతారు. ఇంతలో నలుగురికి అసలైన జనాభా లెక్కల వాళ్లు కనిపిస్తారు. నలుగురు వాళ్ల నుంచి తప్పించుకోవడానికి పరుగులు పెడతారు. చివరకి ఒక పైపులో దాక్కుంటారు. నర్మద, ప్రేమలు వల్లీ, వేదవతిని గుర్రుగా చూస్తారు. 
ఇంతలో ఫుడ్ డెలివరీ బాయ్ వచ్చి మీరే ఆర్డర్ ఇచ్చారా అని అంటే నేనే నేనే అని వల్లీ తీసుకుంటే వద్దు అది మనది కాదు అని ప్రేమ, వల్లీ చెప్తారు. ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి కరెక్ట్ అడ్రస్ ఇవ్వలేదని చెప్పడంతో కిడ్నాపర్లే ఇలా అడ్రస్ ఇచ్చుంటారు వాడిని ఫాలో అవుదాం అని వల్లీ అంటే నర్మద, ప్రేమ నమ్మరు.. ఇక కిడ్నాపర్లలో ఒకడు ఫుడ్ కోసం రావడంతో నలుగురు వాడి వెంట పరుగులు పెడతారు. నలుగురు నాలుగు వైపుల వెళ్లి పరుగులు పెట్టి పెట్టి వాడిని పట్టుకుంటారు. 
కిడ్నాపర్ ప్రేమని తోసేసి పారిపోతాడు. బయట ఉన్న వల్లీ పట్టుకోగానే వల్లీని నెట్టేసి పారిపోతూ పోవే పంది దానా అంటాడు. నన్నే అంత మాట అంటావారా అని వల్లీ వాడి వెంట పడి పట్టుకొని చితక్కొట్టేస్తుంది. నర్మద వాళ్లు వెళ్లి ఆపుతారు. నన్ను పంది అన్నాడు అని వల్లీ చితక్కొట్టేస్తుంది. వాడిని పట్టుకొని శోభని కాపాడి పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు.

శోభ తండ్రి కూతుర్ని చూసి హ్యాపీగా ఫీలవుతాడు. వేదవతి ఎస్‌ఐ గారితో అజయ్ వాళ్లని పట్టిస్తారు. శోభ ఎస్‌ఐకి జరిగింది చెప్తాడు. ధీరజ్ తనని కాపాడాడని చెప్తుంది. శోభ తండ్రి రామరాజుకి సారీ చెప్తాడు. ఎస్‌ఐ ధీరజ్‌ని వదిలేస్తాడు. ప్రేమ వెళ్లి హగ్ చేసుకొని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.



















