అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 20th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నర్మద తెలుసుకున్న నిజమేంటి? విశ్వక్, అమూల్యలకు రామరాజు పెళ్లి చేస్తాడా!

Illu Illalu Pillalu Serial Today Episode March 20th సాగర్ ఉద్యోగం గురించి ఇంట్లో తెలియడానికి శ్రీవల్లీనే కారణం అని నర్మదకు తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu  Serial Today Episode: శారద రామరాజుతో అల్లుడు గారు నా మనవడు చేసింది ముమ్మాటికీ తప్పే కానీ ఇది మన రెండు కుటుంబాలు కలవడానికి నాందీ అవుతుందని అనుకుంటున్నాను అని అంటుంది. ఏం అంటున్నారో అర్థం కావడం లేదు అని రామరాజు అంటే నిన్నటి వరకు నా మనవడు నీ కూతురు లోకం దృష్టిలో భార్యాభర్తలు దాన్ని ఇప్పుడు నిజం చేద్దాం అని అంటుంది. బామ్మ మాటలకు అందరూ షాక్ అయిపోతారు. 

రామరాజు అత్తతో ఏం మాట్లాడుతున్నారండీ మీరు వాళ్లు నా మీద పగతో రగిలిపోతున్నారు.. నిన్నటి వరకు నా కూతురికి నరకం చూపించారు.. అలాంటిది మళ్లీ నా కూతుర్ని అక్కడికి పంపాలని చెప్తున్నారా అర్థం లేకుండా అని అడుగుతాడు. నీ కోపంలో అర్థం ఉంది రామరాజు.. కానీ రెండు కుటుంబాల మధ్య రగులుతున్న రావణ కాష్టం ఈ పెళ్లితో ముగింపు అవుతుంది. మన రెండు కుటుంబాలు ఒక్కటి అవుతాయి అని అంటుంది. ఏంటండీ మీరు అనేది.. నా కూతురు వాడిని పెళ్లి చేసుకుంది అనగానే నేను దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాను.. నా కూతురు అక్కడ ఉన్న 4 రోజులు గుండెలు గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాను. అన్నీ తెలిసి ఎలా అడుగుతున్నారు. మీకు దండం పెడతాను ఇంకెప్పుడూ ఈ విషయం మాట్లాడొద్దు.. ఈ విషయం మాట్లాడటానికి ఇంకెప్పుడూ ఈ ఇంటికి రావొద్దు అని అంటాడు. నీ కూతురి భవిష్యత్‌ గురించి కూడా ఆలోచించు అని శారద అంటే ధీరజ్ వచ్చి నా చెల్లి  భవిష్యత్‌కి ఏం ఢోకా లేదు అండీ తను ఇంతకు ముందు లాగే చదువుకుంటుంది అని అంటాడు.

వేదవతి నువ్వు అయినా అర్థం చేసుకో అని తల్లి చెప్తే దానికి రామరాజు నా నిర్ణయం నా భార్య నిర్ణయం ఒకటే దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లండి అని అంటారు. శారద వాళ్లు వెళ్లిపోయిన తర్వాత రామరాజు ధీరజ్‌ని చూసి బుజ్జమ్మా ఇన్నాళ్లు వీడికి బాధ్యత తెలీదు అని అనుకున్నా.. కానీ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఎలా నిలబడాలో చిన్నోడికి మాత్రమే తెలుసు. రైసు మిల్లు బాధ్యత నా పెద్ద కొడుకు తీసుకుంటే.. అమూల్యకి సంబంధించిన నిర్ణయాలు అన్నీ చిన్నోడు తీసుకుంటాడు. ఈ ఇంట్లో మన  మధ్య ఇంకొకడు ఉన్నాడు కదా వాడు ఉన్నా లేనట్లే.. మనలో మన జీవితాల్లో లేనట్లే అని రామరాజు అంటాడు. దాంతో నర్మద, సాగర్ చాలా ఫీలవుతారు.

ప్రేమ ధీరజ్ వైపు చూస్తే ధీరజ్ కూడా ఏం మాట్లాడకుండా బాధగా చూస్తాడు. ధీరజ్ అని ప్రేమ అంటే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక సాగర్ కోపం, చిరాకుతో నర్మద వస్తాను అన్నా పట్టించుకోకుండా.. వేదవతి బాక్స్ ఇస్తున్నా తీసుకోకుండా ఆఫీస్‌కి వెళ్లిపోతాడు. వేదవతి ఎవరూ చూడకుండా తన తల్లి శారదని పిలుస్తూ ఏడుస్తూ అమూల్య, విశ్వక్‌లు గురించి మొత్తం చెప్తుంది. ఇంత జరిగిందా అని శారద నోరెళ్లబెడుతుంది. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందమ్మా.. అన్నింటికీ ఆ దేవుడే పరిష్కారం చెప్తాడు.. నువ్వు జాగ్రత్త అని శారద వేదవతితో చెప్తుంది. 

నర్మద రామరాజు మాటలు తలచుకొని బాధ పడుతూ వెళ్తుంది. మరోవైపు భాగ్యం, ఇడ్లీబాబాయ్ ఓ చోట టిఫెన్స్ అమ్ముతూ ఉంటారు. శ్రీవల్లి పరుగు పరుగు అక్కడికి వచ్చి విశ్వక్ అరెస్ట్ గురించి చెప్తుంది. ఇంత చిన్న విషయానికి ఇక్కడికి వచ్చావా అని భాగ్యం అంటే ఇది చిన్న విషయమా అమూల్యని తీసుకెళ్లడానికి మన హస్తం ఉందని వాడు పోలీసులకు చెప్తే మన పరిస్థితి ఏంటి అని శ్రీవల్లి అంటే వాడు చెప్పడులే అని అంటుంది. ఇక అక్కడికి జాబ్‌లు ఇచ్చే బ్రోకర్ వచ్చి ముగ్గురిని గుర్తు పడతాడు. ఇంతలో అటుగా నర్మద రావడం చూసి శ్రీవల్లి చాలా టెన్షన్ పడుతుంది. భాగ్యం కూడా చూసి కంగారు పడుతుంది. ఇటు వీడు అటు నర్మద ఇప్పుడు మన పరిస్థితి ఏంటి.. వీడిని ఇక్కడ నర్మద చూస్తే సాగర్ ఉద్యోగం గురించి మనమే బయట పెట్టామని తెలిసిపోతుందని కంగారు పడుతుంది. నర్మద చూసి వల్లీ అక్కలా ఉందే అని దగ్గరకు వెళ్తుంది. ఇంతలో బ్రోకర్ నర్మద దగ్గరకు వచ్చి నన్ను గుర్తు పట్టలేదా  మేడం.. సాగర్ పది వేలు ఇస్తా అని 5 వేలు ఇచ్చాడు మరో 5 వేలు ఇవ్వండి మేడం అని బతిమాలుతాడు. నర్మద లాగి పెట్టి కొడుతుంది. 

నర్మదని చూసి శ్రీవల్లి వాళ్లు పారిపోతారు. నర్మద అతనికి నువ్వేంటి అసలు ఇక్కడ అంటే 5 లక్షలు ఇస్తాం జాబ్ కావాలని చెప్పి పారిపోయారు.. కిలాడీలు అని చెప్తాడు. నర్మద శ్రీవల్లి వాళ్ల ఫొటో చూపిస్తే వీళ్లే మేడం అని వచ్చిన గెటప్‌ల గురించి చెప్తాడు. దాంతో నర్మదకు సాగర్ జాబ్ గురించి లీక్ చేసింది వల్లీ వాళ్లే అని అర్థమైపోతుంది. మరోవైపు ధీరజ్ పర్సు కోసం వెతికితే ప్రేమ తీసుకొని ఇస్తే ధీరజ్ తీసుకోకుండా పక్కన పెట్టమని చెప్పి తీసుకుంటాడు. నేను పోలీస్ స్టేషన్‌కి వస్తానురా అని ప్రేమ అంటే.. ఎందుకు మీ అన్నయ్యని తప్పించడానికా.. నువ్వు మా ఇంట్లో ఉంటూ మా ఇంట్లో తింటూ మీ వాళ్లకే సపోర్ట్ చేస్తావ్ కదా అని మోసం చేశావ్ అని అంటాడు. నేను నిన్ను ప్రేమించాను అని చెప్తే పిచ్చోడిని చేశాను అని లోలోపల నవ్వుకుంటున్నావ్.. అని అంటాడు. వల్లీనే ఇదంతా చేసింది అని ప్రేమ చెప్పాలని ప్రయత్నించడంలో ఆపు నీ వల్ల నర్మద వదిన బలైంది ఇప్పుడు.. దేవత లాంటి వల్లీ వదినను ఇరికించాలని చూస్తున్నావా.. నువ్వు ఏం చెప్పకు నాతో మాట్లాడాలి అని చూడకు అని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 18th: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
నువ్వులేక నేను లేను: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
Podarillu Serial Today August 18th:పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
పొదరిల్లు: పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
Brahmamudi Serial Today August 18th: ‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: ఐషును రెచ్చగొట్టిన రేఖ – ఇందుతో చలపతి ఎమోషన్‌
Gundeninda Gudigantalu August 18th:రోహిణి ఏటీఎం కార్డు లాక్కున్న ప్రభావతి..సుమతి ప్రేమ వ్యవహారం మీనాకు తెలిసిపోయిందా..?
గుండెనిండా గుడిగంటలు:రోహిణి ఏటీఎం కార్డు లాక్కున్న ప్రభావతి..సుమతి ప్రేమ వ్యవహారం మీనాకు తెలిసిపోయిందా..?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget