అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today April 27th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: పాత ప్రేమ పోయి కొత్త ప్రేమ వచ్చే.. వల్లీ ప్రెగ్నెన్సీ నాటకమేనా! వీళ్లకి ఈ జన్మలో బుద్ధి రాదా!

Illu Illalu Pillalu Serial Today Episode April 27th వల్లీని అత్తారింటికి పంపాలి అని భాగ్యం డాక్టర్‌తో వల్లీ ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode శ్రీవల్లి ప్రెగ్నెంట్ అయిందని రామరాజు ఇంటి ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. ఇంటి మొత్తాన్ని డెకరేషన్ చేయించి.. సామియానా వేయించి హడావుడి చేస్తాడు. ఇక శ్రీవల్లి ఫంక్షన్‌కి ఏ చీర కట్టాలా అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంతలో నర్మద, అమూల్య, వేదవతి, భాగ్యం, ఇడ్లీబాబాయ్ అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. ఏంటే ఏం చేస్తున్నావ్ అని వల్లీని వేదవతి అడిగితే నేను నెల తప్పానని ఫంక్షన్‌ పెట్టారు కదా అత్తయ్యగారు గ్రాండ్‌గా కనిపించాలి అంటే ఏ చీర కట్టుకోవాలో తేల్చుకోలేకపోతున్నా అంటుంది. 

వేదవతి వల్లీకి పట్టు చీర, బంగారం నగలు, గాజులు, దుద్దులు అన్నీ ఇస్తుంది. వల్లీ తెగ సంబర పడిపోతుంది. భాగ్యం ఇడ్లీబాబాయ్‌తో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని అంటుంది. దానికి ఇడ్లీ బాబాయ్ అదేంటి అండీ ఆవిడ  గారు మామూలుగా అయితే అవన్నీ ఎలా కొట్టేయాలా అని చూస్తారు కదా మీరు అలాంటిది వాళ్లే బంగారం పెడుతున్నా ఇప్పుడు ఎందుకు అంటారేంటి అని అడుగుతాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా అని భాగ్యం అంటే రామరాజు వచ్చి ఇది చిన్న విషయం ఏంటమ్మా మాకు చాలా గొప్ప విషయం.. మా కోడలు మమల్ని తాతని చేయనుంది.. అయినా వీటికే ఇలా అంటున్నారు.. రేపు సీమంతం చూడండి ఎంత గ్రాండ్‌గా చేస్తామో.. మా కోడల్ని నగలతో ముంచెత్తుతాం అని రామరాజు చెప్తాడు. 

భాగ్యం మనసులో అమ్మో.. నా కూతురు నెల తప్పింది అని తెగ సంబర పడిపోతున్నారు.. వీళ్లకి అసలు విషయం తెలిస్తే పరిస్థితి ఏంట్రా దేవుడా అనుకుంటుంది. ఫ్లాష్‌ బ్యాక్‌లో శ్రీవల్లి గర్భవతి కాకుండానే భాగ్యం డాక్టర్‌తో అలా చెప్పించింది.. ఆ విషయం భాగ్యం తలచుకొని ఈ కడుపు నాటకం అని తెలిస్తే అప్పుడు పరిస్థితి వేరేలా అంటుందని అనుకుంటుంది. భాగ్యాన్ని నర్మద గమనించి పక్కకి వెళ్లగానే భాగ్యం భయపడుతుంది. ఏమైంది అని అడిగితే మీరంతా నా కూతురి మీద చూపించే ప్రేమకి నోట మాట రావడం లేదు అనేస్తుంది. భాగ్యం నగలు వద్దు అనేస్తే మా ఇంటి వారసుడిని మోస్తున్న మా వదిన మహాలక్ష్మీలా ఉండాలని ధీరజ్ అంటాడు. 

ప్రేమ( పాత ప్రేమ స్థానంలో కొత్త ప్రేమ) అందంగా రెడీ అవుతుంటుంది. ఇంతలో వేదవతి ప్రేమని పిలుస్తుంది. ధీరజ్‌ని అడిగితే రెడీ అవుతుందని చెప్తాడు. ఇంతలో తన గదిలోకి బల్లి తన మీద పడటంతో ఇళ్లంతా పీకి గోల గోల చేస్తుంది. అదేంటి చెల్లాయ్ బల్లిని చూసి అంత భయపడుతున్నావ్ అని వల్లీ అడిగితే దానికి నర్మద బల్లి బయటకు ఏం తెలీని నంగనాచిలా అమాయకంగా కనిపిస్తుంది కానీ లోపల చాలా విషం ఉంటుంది అంత తేలికగా తీసుకోకూడదు అని అంటుంది. నేను ఇంతకు ముందు బల్లుల విషయంలో అలాగే అనుకునే దాన్ని కానీ ఏది ఏమైనా బల్లుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటుంది వేదవతి. డైలాగ్స్ అన్నీ మనకే అని భాగ్యం, ఇడ్లీ అనుకుంటారు. బల్లి పడితే కంచి వెళ్లి వచ్చిన వాళ్లని ముట్టుకోవాలి అంటారు కదా మన ఇంట్లో ఎవరూ లేరు కదా అని రామరాజు అంటే నేను ఉన్నాకదా అని వేదవతి తల్లి ప్రేమ నానమ్మ ఎంట్రీ ఇస్తుంది. 

ప్రేమ నానమ్మని హగ్ చేసుకుంటుంది. నువ్వు ఎప్పుడు నెల తప్పుతావే అని బామ్మ ప్రేమని అడిగితే ఆ విషయం మీ మనవడిని అడుగు అని ప్రేమ అంటుంది. ఇక రామరాజు అత్తతో మీరు అయినా వచ్చారు.. ఫంక్షన్‌ అయ్యే వరకు ఉండండి అని అంటాడు. ధీరజ్‌, తిరుపతి డెకరేషన్ చేస్తుంటే తిరుపతి ధీరజ్‌తో నువ్వు గిల్లడం వల్లే కదా ప్రేమ అరిచింది.. రేయ్ డెకరేషన్‌ చేయలేక అలిసిపోతున్నారా.. కొంచెం గ్యాప్ ఇవ్వండ్రా అని అంటాడు. ఇక రామరాజు పెద్ద కూతురు కామాక్షి భర్తని ఈడ్చుకొని ఫంక్షన్‌కి వస్తుంది. ఈ డెకరేషన్ మొత్తం ఎవరు చేశారురా.. అచ్చం మా తిరుపతి మామయ్య ముఖంలా పెళ్లి కానట్లు ఉందని అంటుంది. ప్రేమ కామాక్షితో ఏంటి వదినా నువ్వు కనీసం పుట్టింటికి వచ్చాక అటు 9 వరకు నిద్రే లేవవు కదా మరి ఇంత పని చేస్తేస్తున్నావ్ ఏంటి అని అంటే కనీసం తులం అయినా గిట్టు బాబు కావాలి కదా వదినా అని నర్మద అంటుంది. 

నర్మద తల్లి దండ్రులు కూడా ఫంక్షన్‌కి వస్తారు. రామరాజు వాళ్లకి ఎదురు పడతాడు. గతంలో జరిగిన విషయం గుర్తు చేసుకొని రామరాజు ముభావంగా ఉంటాడు. అందరూ అక్కడికి చేరుకుంటారు. ధీరజ్ తండ్రితో మామయ్య వాళ్లని నేనే పిలిచాను నాన్న.. ఈ రోజు మనం ఇంత సంతోషంగా ఉండటానికి నర్మద వదినే కారణం కదా అందుకే వదిన సంతోషంగా ఉంటుందని వాళ్ల తల్లిదండ్రుల్ని పిలిచా అంటాడు. కూతుర్ని ఇచ్చాం కాబట్టి ఒక మెట్టు దిగి వచ్చా అని ప్రసాద్ రావు అంటాడు. ఇక రామరాజు నర్మదతో అమ్మా నర్మద మీ అమ్మానాన్నలకు మర్యాదలో ఏం తేడా రాకుండా చూసుకోమ్మా అని చెప్పి వెళ్లిపోతాడు. నర్మద తల్లి నర్మదతో అమ్మా నర్మద ఆ నగలు ప్రేమవేనా అని అడుగుతుంది. నర్మద నగలు తాకట్టు విషయం గుర్తు చేసుకొని అమ్మా అది అని అంటుంది. దానికి ప్రేమ పిన్ని నాకు నర్మద అక్కకి మధ్య నా నగలు అక్క నగలు అని తేడా ఉండదు.. అవి మా నగలు అని అంటుంది. అందరూ సంతోషిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 
 

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని చూసిన లక్ష్మీకి తెలిసిన నిజం! కేడీ, సంధ్యలకు షాక్‌ ఇచ్చిన సిరి!
Gundeninda Gudigantalu August 17th:ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు...పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు: ప్రభావతిని ఆడుకున్న మీనా,బాలు..! పార్లరమ్మకు శృతి చేసిన మేలు ఏంటి..?
Podarillu Serial Today August 17th:మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ...కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
పొదరిల్లు సీరియల్: మాధవ్‌ కోసం అమ్మవారికి మొక్కు చెల్లించిన మహాలక్ష్మీ..! కేశవ్‌ లేడని తెలిసి శైలూకు బలవంతంగా పెళ్లి
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 17th: నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
నువ్వులేక నేను లేను: వ్రతం సమయానికి ఇంటికి చేరుకున్న రాధ..! సుందరి, దమయంతికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget