అన్వేషించండి

Guppedantha Manasu September 24th Update: రిషిధార దోబూచులాట, రిషి కోపాన్ని డామినేట్ చేసిన వసు ప్రేమ

Guppedantha Manasu September 24th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు( శనివారం) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్  ( Guppedantha Manasu September 24 Today Episode 564)

రిషిని చూసుకోకుండా ఏదేదో మాట్లాడేసిన వసుధార ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూసి అక్కడ రిషిని చూసి షాక్ అవుతుంది.  కూరగాయలు కట్ చేసిన రిషి..ఆ తర్వాత జ్యూస్ చేసి వసుకి ఇస్తాడు. నాకు వద్దు సార్ అంటుంది..తీసుకో అంటాడు..ఇద్దరూ అటూ ఇటూ తోయడంతో ఆ జ్యూస్ గ్లాస్ రిషి డ్రెస్ పై పడుతుంది. కంగారు పడిన వసుధార తుడుస్తూ ఉంటుంది..ఇంతలో దేవయాని ఎంట్రీ ఇచ్చి ఫైర్ అవుతుంది. 

కట్ చేస్తే రిషి ఆ డ్రెస్ మార్చుకునేందుకు వెళతాడు.. తనవల్లే జరిగిందని బాధపడుతూ ఏదో ఆలోచనలో రిషి రూమ్ కి వెళుతుంది వసుధార. డ్రెస్ మార్చుకునే ప్రయత్నంలో ఉన్న రిషి వసుని చూసి సిగ్గుపడి దాక్కుంటాడు.. sorry సార్ అంటూ మీ డ్రెస్ నేనే ఉతికి ఇస్తానని తీసుకెళుతుంది. ఈ రోజు (శనివారం ఎపిసోడ్ ప్రోమో ఇక్కడ చూడొచ్చు)

Also Read: డాక్టర్ బాబుకి గతం గుర్తుచేసేందుకు దీప సరికొత్త సాహసం, కార్తీక్ లో మార్పు చూసి మురిసిపోయిన మోనిత
జరిగిన కథ
రిషి దేవయానితో ఒక విషయం చెప్పాలి పెద్దమ్మ, ఎలా చెప్పాలో, ఏం చేయాలో, అర్థం కావట్లేదు అనగానే, చెప్పు నాన్నా అంటుంది దేవయాని
రిషి: నాకు ఆమెను చూస్తే అసహ్యం వేస్తుంది, కోపం వస్తోంది అనగానే( వసుని, జగతిని ఉద్దేశించే మాట్లాడతున్నాడు అనుకుని దేవయాని సంతోషిస్తుంది).నాకు సాక్షి చేసే పనులు చూస్తే కోపం వస్తోంది పెద్దమ్మ ( సాక్షి మాట వినిపించేసరికి షాక్ అయి చూస్తుంది). అసలు వసుధారని కిడ్నాప్ చేయించింది ఎవరో తెలుసా ఈ సాక్షి, సీసీటీవీ ఫుటేజ్ లొ సాక్షి చేసిన పనంతా చూశాను, తను ఇంత నీచానికి దిగజారింది, తన మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది, మీరే తనని అసలు ఇక్కడి నుంచి వెళ్ళిపొమ్మని చెప్పండి  లేదంటే కోపంలో ఏం చేస్తానో తెలియదని చెప్పి వెళ్లిపోతాడు
దేవయాని: రిషి వెళ్లిన తర్వాత ఆలోచనలో పడిన దేవయాని..ఈ విషయం నాకు చెప్పి మంచిపని చేశాడు నేరుగా సాక్షిని నిలదీసి ఉంటే మొత్తం బయటపడేదని టెన్షన్ పడుతుంది...

ఆ తర్వాత రిషి కిచెన్లోకి వెళ్లి జగతితో... మేడం నన్ను నన్నలా ఉండనీయమని మీ స్టూడెంట్ కి చెప్పండి అని ఇన్ డైరెక్ట్ గా గురుదక్షిణ ఒప్పందం గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత తన రూమ్ కి వచ్చి కూర్చుని కాఫీ తాగుతుండగా ముందు గౌతమ్ వెళతాడు..ఏవో సెటైర్స్ వేసి గౌతమ్ ను అక్కడి నుంచి పంపించేస్తాడు రిషి. ఆ తర్వాత మహేంద్ర వెళ్లి కాసేపు కూర్చుని వచ్చేస్తుండగా..ఎందుకొచ్చారు డాడ్ అన్న రిషితో నిన్ను చూడాలి అనిపించింది వచ్చానంటాడు.

Also Read: కిచెన్లో రిషిధార - కళాశాల నుంచి వంటింటికి చేరిన ప్రేమకథ

కట్ చేస్తే వంటగదిలో జగతి-వసుధార మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రిషి వచ్చి..జగతిని చూసి వెనక్కు వెళ్లిపోతాడు. అది గమనించిన జగతి..నేను ఇప్పుడే వస్తాను వసుధార అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.  జగతి వెళ్లిన విషయం గమనించని వసుధార గలగలా మాట్లాడేస్తుంది
వసుధార: మేడం మీతో ఒక మాట చెప్పాలి, ఏ మాటకామాటే సార్ కూడా మీలాగే మల్టీ ట్యాలెంటెడ్ అన్ని పనులూ వచ్చు, కానీ కోపమొక్కటే ఎక్కువ, మేడమ్ రిషి సార్కి నేను దొరకడం లక్కీ కదా అనడంతో అని అంటుంది, అయినా మీరు ఒప్పుకోరు లెండి..  నేనే లక్కీ అంటారు అంతే కదా అని ఏదో చెప్పబోతూ, ఏంటి మేడమ్ మీరు ఏమీ మాట్లాడటం లేదు అని ఒక్కసారిగా వెనక్కి తిరిగి సార్ మీరా అని  చేతిలో గరిట కిందపడేస్తుంది.
రిషి: కూరగాయలు కట్ చేశాను, జ్యూస్ చేశాను ఇంకా ఏమైనా చేయాలా మేడం 
వసు: మిమ్మల్ని చూడలేదు సార్ అంటుంది
ఇదిగో జ్యూస్ అని చేతికిస్తాడు..నాకు వద్దు సార్ అంటుంది..తీసుకో అంటాడు..ఇద్దరూ అటూ ఇటూ తోయడంతో ఆ జ్యూస్ గ్లాస్ రిషి డ్రెస్ పై పడుతుంది. కంగారు పడిన వసుధార తుడుస్తూ ఉంటుంది..ఇంతలో దేవయాని ఎంట్రీ ఇస్తుంది.. దీనికి కొనసాగింపే పైన ప్రోమో....

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget