అన్వేషించండి

Guppedantha Manasu మే 7 ఎపిసోడ్: రిషి ప్రేమలో వసుధార, లవ్‌ సంగతి బయటపెట్టిన గౌతమ్

ఒకరంటే ఇంకొకరికి ఇష్టం. అయినా బయటకు చెప్పుకోవాలంటే ఒకరికి ఇగో... ఇంకొకరికి ఆత్మ గౌరవం. వసుధార మనసులో మాట తెలుసుకునేందుకు రిషి వేసిన ప్లాన్ ఫెయిల్ అవుతుంది.

వసుధార మొహం మీదే తలుపు వేసేయడం... అన్ని మాటలకు రిషి బాధపడుతుంటాడు. జరిగింది తలచుకుంటే మహేంద్ర తీసుకొచ్చి సర్ది చెబుతాడు. ఏమైపోతున్నావ్‌.. ఎటు వెళ్తున్నావ్‌ అనే అడుగుతాడు మహేంద్ర. జీవితంలో ప్రశ్న, జవాబుతో ముడిపడి ఉంటుందంటాడు. ఒక్కసారి చిక్కుపడింతే కష్టమవుతుందని వివరిస్తాడు. సాక్షి నుంచి దూరమవడానికా తప్పించుకోవడానికా అని అడుగుతాడు మహేంద్ర. సాక్షి విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నానని చెప్పేస్తాడు రిషి. తనే అనవసరంగా ఇండియా వచ్చిందని చెప్తాడు రిషి. కానీ వసుధార విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నావని అంటాడు మహేంద్ర. మీరు ఏదో నానుంచి ఆశిస్తున్నారని..రిషి అంటాడు. ప్రశ్నే తప్పయినప్పుడు కోరుకున్న జవాబు ఎప్పటికీ రాగదని చెప్పేస్తాడు. ఇద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంది. నీవు ఒక్క వసుధారకే తప్ప ఎవరికీ అర్థం కావంటాడు మహేంద్ర. మొహం మీద తలుపు వేస్తే అర్థం చేసుకోవడమా అని ప్రశ్నిస్తాడు రిషి. సాక్షి విషయంలో నీ అభిప్రాయమేంటని అడుగుతాడు. ఆ విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నానని చెప్పేస్తాడు. అక్కడి నుంచి మహేంద్ర వెళ్లిపోతాడు. తర్వతా వస్తానని చెప్పి రిషి అక్కడే ఉండిపోతాడు. 

ఒంటరిగా వసుధార చెప్పిన మాటలే గుర్తుకు వస్తుంటాయి. వసుధార ఎందుకు దూరం పెడుతుందని ప్రశ్నించుకుంటాడు. మా ఇద్దరి మధ్య బంధం ఏమీ లేదా అని అనుకుంటాడు. వసుధార అడిగిన ప్రశ్నలకు నా వద్ద సమాధానం లేదని... కనీసం వసుధార వద్దైనా సమాధానాలు ఉంటాయా అని అనుకుంటాడు. 

వసుధార ఒంటరిగా కూర్చొని బస్తీ వాళ్లు అడిగిన ప్రశ్నలు గుర్తుకు తెచ్చుకుంటుంది. రిషి మొహంపై తలుపు వేసిన సన్నివేశం కూడా గుర్తుకు వస్తుంది. రిషి సార్ ఎంత ఫీల్ అయి ఉంటారో అని అనుకుంటుంది. అటు రిషి కూడా ఒంటరిగా బెడ్‌రూంలో కూర్చొని దాని కోసమే ఆలోచిస్తుంటాడు. ఇటు మహేంద్ర, జగతి కూడా అదే ఆలోచిస్తుంటారు. రిషిని బాధపెట్టాలని నాకు లేదని.. తన మనసులో ఏముందో తెలుసుకనేందుకే కఠినంగా మాట్లాడను అని జగతికి చెబుతాడు మహేంద్ర. 

ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్న రిషికి తండ్రి అడిగిన ప్రశ్నలు గుర్తుకు వస్తాయి. వాటిపై సమాధానాలు మీకు కాదు... నాకు నేను చెప్పుకోవాలని అనుకుంటాడు రిషి. వీటన్నింటికీ సమాధాం ఏదో ఉందని అదేంటో క్లారిటీ లేదని సందేహపడుతుంటాడు. ఇక్కడ రిషికి, అక్కడ వసుధారకు ఒకేలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. ఒకరికి ఒకరం ఏమవుతామని అనుకుంటావుంటారు. తెల్లారిపోతుంది. 

వసుధార పోస్టర్ పట్టుకొని గౌతమ్‌ తన ప్రేమ గురించి మాట్లాడుతుంటాడు. ఎలాగైనా మనసులో మాట చెప్పేస్తానని గట్టిగా అరుస్తున్న టైంలో రిషి అక్కడికి వస్తాడు. ఏంటీ పొద్దున్నే రెడీ అయ్యావని ప్రశ్నిస్తాడు రిషి. ప్రేమ సంగతిని వసుధారకు చెప్పేస్తానని గౌతమ్‌  సమధానం చెప్తాడు. గౌతమ్‌కి ఆల్‌ది బెస్ట్ చెప్పి పంపిస్తాడు రిషి. వెళ్లి నేరుగా వెళ్లి తేల్చేమని చెప్పి పంపిస్తాడు. రిషి చెప్పేదానికి షాక్ తింటాడు గౌతమ్. రిషి చెప్తున్న మాటలు గౌతమ్‌కు అర్థం కావడం లేదు. మొత్తానికి రిషి ఇచ్చిన ప్రోత్సాహంతో తన ప్రేమ సంగతి చెప్పేందుకు గౌతమ్ వెళ్తాడు. 

వసుధార మనసులో ఏముందో తెలుసుకోవడానికే ఇలా చేశాని మనసులో అనుకుంటాడు రిషి. తన ప్రశ్నలకు వసుధార వద్దయిన సమాధానాలు దొరుకుతాయోమో అని ఆలోచిస్తుంటాడు. కాలేజీలో ఒంటరిగా కూర్చొన్న రిషి మైండ్‌లో వీళ్ల సంగతే ఉంటుంది. ఇంతలో గౌతమ్‌ వసుధారతో మాట్లాడుతున్న దృశ్యం కనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్లిపోదామని అనుకుంటాడు కానీ.. వసుధార ఏం చెబుతుందో అని కాసేపు ఉండి వెళ్దామని ఆగుతాడు. 

అక్కడ తన మనసులో మాట చెప్పడానికి గౌతమ్ ఇబ్బంది పడుతుంటాడు. ఏదేదో మాట్లాడుతుంటాడు. ముందు తన చేతిలో పెయింటింగ్ పోస్టర్ ఇస్తాడు. ఎందుకని అడుగుతున్నా చేతిలో పెట్టేస్తాడు. అప్పుడే చూడొద్దని అంటాడు. నసుగుతూనే... ఐ లవ్‌ యూ వసుధార అని చెప్పేస్తాడు గౌతమ్. ఆ మాటకు షాక్ తింటుంది వసుధార. ఇక్కడ వసుధారతోపాటు అక్కడ రిషి కూడా అదే ఫీల్‌తో ఉంటాడు. 

నేను సరదాగా జాలీగా ఉంటానే కానీ నా ప్రేమ మాత్రం నిజమని గౌతమ్‌ చెప్తాడు. చూసిన తొలిచూపులోనే ప్రేమలో పడిపోయానని వివరిస్తాడు. అప్పటి నుంచి నీ గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదంటాడు. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది...

సోమవారం ఎపిసోడ్‌

గౌతమ్ ఇచ్చిన పెయింట్‌ ఓపెన్ చేస్తుంది వసుధార. చాలా బాగుందని మెచ్చుకుంటుంది. ఎవరు గీశారని అడిగితే... కనిపెట్టమని ఫజిల్ ఇస్తాడు గౌతమ్. కారులో కూర్చున్న తర్వాత వసుధార మనసులో ఎవరో ఉన్నారని సందేహపడతాడు గౌతమ్. మరింత ఆతృతంగా నీకు ఎలా తెలుసని అడుగుతాడు రిషి. ఎవరో ఆ ఆదృష్టవంతుడు అనకుంటాడు గౌతమ్. పెయింట్ చూసిన వసుధార కూడా తన బొమ్మను గొప్పగా గీసిన వ్యక్తి గురించి ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తుంటుంది.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Siddhu Jonnalagadda Tillu Square Pre Release: ఈవెంట్ కు అనుపమ  ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధుMalla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp DesamNaveen Polishetty Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం బారినపడ్డ నవీన్ పోలిశెట్టి.. ఎంత సీరియస్..?Malla Reddy Speech | KTR | ఈ అవ్వ మాటలు వింటే మల్లారెడ్డి కూడా సరిపోరు.. ఎన్ని పంచులో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Embed widget