అన్వేషించండి

Guppedantha Manasu మే ౩౦(ఈరోజు) ఎపిసోడ్: దేవదాసులో మారిపోతున్న రిషి- అడ్డుకున్న వసుధార

సాక్షి దెబ్బకు బెదిరిపోయిన వసుధార...రిషి ప్రేమను రిజెక్టే చేసింది. దీంతో రిషి మైండ్ పూర్తిగా బ్లాంక్ అవుతుంది. దేవదాస్‌లో మారిపోతున్న రిషిని మళ్లీ మనిషిలా మారుస్తుంది వసుధార.

రిషిని వదిలి వెళ్లకోపోతే మాత్రం రిషి పరువు, కాలేజ్ ప్రతిష్టను బజారును పెడతానంటూ వసుధారకు వార్నింగ్ ఇస్తుంది సాక్షి. ఎంగేజ్‌మెంట్‌ ఒకమ్మాయితో ఎంటర్‌టైన్‌మెంట్‌ మరో అమ్మాయితో అంటూ రిషి ఫ్యామిలీని రోడ్డున పడేస్తానంటూ  హెచ్చరిస్తుంది. ఏం చేస్తావో చెప్పుకుంటావో నీ ఇష్టం...  చెప్పింది చేయకోపోతే మాత్రం రిషిని నడిరోడ్డుపై నిలపబెడతానంటూ వార్నింగ్ ఇస్తుంది. 

సాక్షి ఇచ్చిన వార్నింగ్‌తో రిషి ప్రేమను వసుధార రిజెక్ట్ చేస్తుంది. ప్రేమ ఉన్నచోట భయం ఉంటుందంటే ఇలానే ఉంటుందని సాక్షి అంటుంది. నీకు భయపడి ఇలా చేయలేదని... ఏం చేయబోతున్నానో నీ లాంటి వాళ్లకు అర్థం కాదులే అంటుంది వసుధార. మొత్తానికి రిషి జీవితంలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేశావని అంటుంది సాక్షి. నీ లాంటి వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా రిషీ సార్ లాంటి జీవితంలోకి వెళ్లలేవంటుంది వసుధార. వాట్‌ ఇంకేం అడ్డు ఉంది నాకు అని ఆశ్చర్యపోతుంది. ఇంత జరిగాక అని క్వశ్ఛన్‌ చేస్తుంది. రిషిసార్‌కి ఏం కాలేదని.. నాకు ఏం కాలేదని అంటుంది వసుధార. మా ఇద్దరం ఫుల్ క్లారిటీతో ఉన్నామంటుంది. నువ్వే అర్థం కాని అయోమయంలో ఉన్నావచి సాక్షికి చెబుతుంది వసుధార.  ఏంటి నీ ధైర్యం అని అడుగుతుంది సాక్షి. నా ఆత్మవిశ్వాసమే నా ధైర్యం అంటుంది వసుధార. ఇంతలో రిషి నుంచి మెసేజ్‌ వస్తుంది. 

నువ్వు వదిలేసినా నేను మధ్యలో వదిలేసే రకం కాదంటూ క్యాబ్‌ బుక్‌ చేశాను అందులో వెళ్లమంటూ రిషి మెసేజ్ చేస్తాడు. అది చదువుతూ కంగారు పడుతుంది వసుధార. వెంటనే సాక్షి అందుకొని.. ఏంటీ భయపడుతున్నావ్‌... నేను డ్రాప్ చేస్తానంటూ ఆఫర్ ఇస్తుంది. నేను డ్రాప్ అయ్యానని... డ్రాప్ చేసే అవకాశం వేరేవాళ్లకు ఇవ్వనంటుంది. ఎలా వెళ్తావని అడిగితే నా ప్లానింగ్ నాకు ఉంటుందని అంటుంది వసుధార. ఇంతలో క్యాబ్ వస్తుంది. మంచి ప్లానింగ్‌లోనే ఉన్నావే అంటుంది సాక్షి. రిషి సార్ విషయంలో నీ ప్లాన్లు ఏ మాత్రం పని చేయవని గుర్తు పెట్టుకోమని చెప్పి వసుధార వెళ్లిపోతుంది. 

కారులో వెళ్తూ రిషి చెప్పిన సంగతులు గుర్తు చేసుకుంటుంది. ప్రేమ గురించి ఇలా చెప్తారని అనుకోలేదంటుంది. మరోవైపు సాక్షి ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వస్తుంది. ఫస్ట్‌టైం ఏదో తెలియని భయం చుట్టుముడుతోందని బాధపడుతుంది. ఇదంతా ఊహించలేదని అనుకుుంటుంది. 

హాల్‌లో సాక్షి, దేవయాని కూర్చొని మాట్లాడుకుంటారు. అసలు అక్కడ ఏం జరిగిందని అడుగుతుంది దేవయాని.  ఓ అద్భుతం జరిగిందని అంటుంది సాక్షి. ఏంటా ఆద్భుతమని దేవయాని అడుగుతుంది. ఇంతలో రిషీ ఎక్కడ ఉన్నాడని ఆరా తీస్తుంది సాక్షి. కాలేజీ  పని మీద బయటకు వెళ్లాడని సమాధానం చెబుతుంది దేవయాని. కాలేజీ పని మీద బయటకు వెళ్లాలేదని... వసుధారతో కలిసి ఎగ్జామ్‌ రాపించడానికి వచ్చాడని వివరిస్తుంది. వాళ్లిద్దరి ఫొటోలు తీస్తూ నువ్వు ఎంజాయ్ చేశావా అని దెప్పిపొడుస్తుంది దేవయాని. తొందర పడొద్దని చెప్పేది వింట షాక్ అవుతారని అంటుంది సాక్షి. వసుధారకు రిషి లవ్‌ ప్రపోజ్‌ చేశాడని చెబుతుంది. దీన్ని విని ఆశ్చర్యపోతుంది దేవయాని. అయితే వసుధార రిజెక్ట్ చేసిందని సాక్షి షాక్ ఇస్తుంది. ఆశ్చర్యపోతుంది దేవయాని. వసుధార నో చెప్పిందంటే చాలా ఆలోచించి ఉంటుంది.. ఆమెను తక్కువ అంచనా వేయొద్దంటుంది దేవయాని. జరిగిందేంటే తెలియకుండా మీరు భయపడుతున్నారని వివరించే ప్రయత్నం చేస్తుంది సాక్షి. వసుధారతో ఎగ్జామ్‌ రాయకుండా చేద్దామని వెళ్లాను కానీ అది జరగలేదని.. ఆమెను మాత్రం అన్ని రకాలుగా భయపెట్టానంటుంది. అందుకే తను రిషికి నో చెప్పిందని వివరిస్తుంది. పెద్దలు అంటారు కదా... ప్రేమ ఉన్న చోటే భయం ఉంటుందనే స్లోగన్ వర్కౌట్‌ అయిందంటుంది సాక్షి. ప్రేమపై భయం ఎప్పుడూ గెలవదని... చాలా సార్లు ప్రేమే గెలుస్తుందని అంటుంది దేవయాని. అయితే వసుధారకు ప్రేమ కంటే భయమే ఎక్కువ ఉందని చెబుతున్న సాక్షి. అందుకే వసుధార నో చెప్పిందని అంటుంది. ఏది ఏమైనా మనం అనుకున్న పని అయిందని అంటుంది దేవయాని. మొత్తానికి రిషికి నాకు మధ్యలో ఉన్న వసుధార అడ్డు తొలగిపోయిందని సంబరపడిపోతుంటారు ఇద్దరు. సాక్షిపై దేవయానికి, దేవయానిపై సాక్షికి నమ్మకాలు ఉండవు. వసుధార ఇంకా ఏదో ప్లాన్ చేస్తుందని... ఇంకా వేరే దేని కోసమే రిషి ప్రేమను రిజెక్ట్ చేసి ఉంటుందని... సాక్షి అంత దూరం ఆలోచించలేదని మనసులో అనుకుటుంది దేవయాని. వీళ్లద్దరూ రిషి వసుధార గురించి మాట్లాడుకోవడం.. వాళ్లికి లైఫ్‌లో కలవలేరు అనుకోడం ధరణి వింటుంది. వీళ్లిద్దరు ఇంత హ్యాపీగా ఉన్నారంటే ఎవరికో ఆనందం దూరం చేస్తున్నారని అనుకుంటుంది. 

హాల్‌లో దేవయాని, సాక్షి మధ్య జరిగిన విషయాన్ని మహేంద్ర, జగతికి చెబుతుంది. ఆమెకు ఇద్దరూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. అయినా ధరణిలో కంగారు తగ్గదు. నేను ఫోన్ చేసి మాట్లాడతానంటూ ఫోన్ తీసుకుంటాడు మహేంద్ర. జగతి వద్దని చెబుతుంది. తను వసుధారకు ఫోన్ చేసి అడుగుతానంటుంది. జగతి ఫోన్ కట్ చేస్తుంది వసుధార. మళ్లీ చేస్తుంది. లిఫ్ట్ చేస్తుంది. ఎక్కడున్నావని అడుగుతుంది జగతి. మళ్లీ మాట్లాడతానంటూ కట్ చేస్తుంది వసుధార. మాట్లాడకుండానే కట్ చేసిందనుకుంటారు. మళ్లీ కాల్ చేస్తుంది జగతి. మహేంద్ర రిషికి కాల్‌ చేస్తాడు. రిషి రోడ్డుపై కారు ఆపి నిద్ర పోతుంటాడు. ఆ ప్రాంతంలో ఫుల్‌గా ట్రాఫిక్‌ జామ్ అయి ఉంటుంది. ఇంతలో వేరే వ్యక్తి వచ్చి  రిషిని లేపి కారు పక్కకు తీయిస్తాడు. మళ్లీ రాత్రి జరిగిన సంఘటన రిషికి గుర్తుకు వస్తుంది. 

ఫోన్ తీయడం లేదని బాధపడతారు మహేంద్ర జగతి. ధరణి చెప్పినట్టు ఏమైనా జరిగి ఉంటుందా అని అనుమానం పడతారు. అక్కడ కారులో కూర్చొని ఇంకా వసుధార గురించే ఆలోచిస్తుంటాడు రిషి. 

రేపటి ఎపిసోడ్ 

ఇంటికి వచ్చిన రిషిని మహేంద్ర ఏం జరిగిందని అడుగుతాడు. ఎందుకు అలా ఉన్నావని ప్రశ్నిస్తాడు. నాకేమువుతుంది.. నేను ప్రిన్స్‌ కదా అంటాడు. చిన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్లిందని... మధ్యలోనే సాక్షి వెళ్లిపోయిందని... ఇప్పుడు అంటూ ఆపేస్తాడు. మహేంద్ర మళ్లీ మళ్లీ అడుగుతాడు ఇప్పుడు ఏమైందని అయినా రిషి చెప్పడు. ఇద్దరూ కలిసి బార్‌కు వెళ్తారు. రిషి ముందు తాగుతుంటే... మీరు మందు తాకేసేంత బలహీనమైన వాళ్లా అని ప్రశ్నించినట్టు అనిపిస్తుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడు - 10 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడు - 10 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్.. ఫిఫ్టీ దాటిన లీడ్
Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
Haindava Sankharavam: రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Game Changer Trailer Decode | గేమ్ చేంజర్ ట్రైలర్ లో మీరు ఇవి గమనించారా..? | ABP DesamRam Charan Game Changer Mumbai | బాలీవుడ్ ప్రమోషన్స్ మొదలుపెట్టిన రామ్ చరణ్ | ABP DesamRare Black panther Spotted | పిల్ల చిరుతతో కలిసి నల్ల చిరుత సందడి | ABP DesamAus vs Ind sydeny Test Day 1 Highlights | సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన భారత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడు - 10 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
Yadadri Blast News: యాదాద్రి జిల్లాలో విషాదం, కంపెనీలో భారీ పేలుడు - 10 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
Breaking News: బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్
బుమ్రాకు గాయం.. మైదానం వీడి వెళ్లిపోయిన స్టార్ పేసర్.. ఫిఫ్టీ దాటిన లీడ్
Human Metapneumovirus: వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
వైరస్ తీవ్రత నిజమే.. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - చైనాలో పర్యటించవచ్చన్న ప్రభుత్వం
Haindava Sankharavam: రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
రేపు విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ ‘హైందవ శంఖారావం’ భారీ సభ- ప్రధాన డిమాండ్లు ఇవే
Sydney Test Live Updates: ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్
ఇండియాకు స్వల్ప లీడ్.. 181 పరుగులకు ఆసీస్ ఆలౌట్.. రాణించిన బమ్రా, ప్రసిద్ధ్, సిరాజ్
Hyderabad Regional Ring Road: త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
త్వ‌ర‌గా ఆర్ఆర్ఆర్‌కు భూ సేక‌ర‌ణ, మూడేళ్ల‌లో నిర్మాణం పూర్తి- రైతుల‌కు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
PF Balance Check: మూడేళ్లు పని చేస్తే మీ PF అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్‌ ఉంటుంది?, ఇలా చెక్‌ చేయండి
మూడేళ్లు పని చేస్తే మీ PF అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్‌ ఉంటుంది?, ఇలా చెక్‌ చేయండి
Hrithik Roshan: ఇదన్యాయం హృతిక్ - అందరూ జనవరి1న ప్రారంభించారు - నువ్వు పూర్తి చేస్తావా ?
ఇదన్యాయం హృతిక్ - అందరూ జనవరి1న ప్రారంభించారు - నువ్వు పూర్తి చేస్తావా ?
Embed widget