Guppedantha Manasu మే 11 ఎపిసోడ్: వసుధారతో సాక్షికి చెక్ పెట్టాలని రిషి ప్లాన్- చేతులు కలిపిన గురుశిష్యులు
సాక్షితో రిషి పెళ్లి చేయాలని ఫ్యామిలీ మెంబర్స్‌తో దేవయానికి ప్లాన్ చేస్తుంటే... సాక్షిని వసుధారతో చెక్ పెట్టాలని చూస్తున్నాడు రిషి.
మాట్లాడుకున్న తర్వాత రూమ్ వద్ద వసును డ్రాప్ చేసి వెళ్లిపోతాడు రిషి. నాకెందుకు వసుధారతో ఉన్నంతసేపు ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అవుతుంది ఎందుకో అనుకుంటాడు రిషి. వసుధారలో కూడా సేమ్ ఫీలింగ్ కలుగుతుంది.
బెడ్రూమ్‌లో జగతి, మహేంద్ర రిషి గురించి ఆలోచిస్తుంటారు. సాక్షి విషయంలో ఏం మాట్లాడితే దేవయానికి మనకు తేడా ఉండదని చెబుతుంది జగతి. ఇంతలో దేవయాని వస్తుంది. నీ 22 ఏళ్ల కల నెరవేరిందని బాగుంది కానీ.. రిషి గురించి ఆలోచిస్తున్నారా లేదా అని అడుగుతుంది. అదే సాక్షి గురించి ఏం ఆలోచించారని అడుగుతుంది దేవయాని. దానిపై మాట్లాడకపోవడమే కరెక్టేనని అనుకుంటున్నట్టు చెబుతుంది జగతి. అది రిషి జీవితానికి సంబంధించిన విషయమని.. అందులో ఎవరి ప్రమేయం లేకుండా ఉంటే మంచిదని చెప్పేస్తుంది జగతి. దీన్ని మహేంద్ర సమర్ధిస్తాడు. ఎవరెవరి విషయంలో జోక్యం చేసుకుని రిషి విషయం పట్టించుకోరా అని దెప్పిపొడుస్తుంది. రిషి మనసులో ఏముందో తెలియదు కానీ.. సాక్షికి ఈ ఇంటికి కోడలు అయ్యే అర్హత ఉందంటుంది దేవయాని. పనిలో పనిగా వసుధారను రిషికి దూరంగా ఉంచమని జగతిని వార్నింగ్ ఇస్తుంది. సాక్షితో రిషికి పెళ్లి చేస్తానంటూ చెప్పేసి వెళ్లిపోతుంది.
రిషి, సాక్షి పెళ్లికి మనల్ని దేవయానికి వాడుకోవడానికి చూస్తోందని.. దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని చెబుతుంది జగతి. దీన్ని పరిష్కరించడానికి మహేంద్రకి ప్లాన్ చెబుతుంది.
ఇంతలో బెడ్రూమ్‌లో వసుధార గురించి ఆలోచిస్తుంటాడు. అప్పట్లో గోలీలు వేసిన ఇచ్చిన
గాజు సీసా పట్టుకొని ఏంటా మాయ అనుకుంటాడు. వసుధార విషయంలో రిషి మారిపోతున్నాడా అనుకుంటాడు. పక్కనే ఉన్న లవ్ లెటర్ చూస్తాడు. ఎప్పుడూ ఓ కవిత కూడా రాయని నేను ప్రేమ లేఖ ఎలా రాశానో అనుకుంటాడు. అసలు ప్రేమ లేఖ ఇలానే రాస్తారా అని అనుకుంటాడు రిషి. అక్కడే నిలబడి వింటున్న మహేంద్ర ఆ లేఖ చూస్తాడు. జగతిని కూడా తీసుకొచ్చి ఆ లెటర్ చూపిస్తాడు.
ఆ లెటర్ చూసిన జగతికి కాలేజీలో జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. అంటే అది రిషి రాశాడా అని ఆశ్చర్యపోతుంది జగతి. తిట్టిన సంగతి కూడా గుర్తుకు వస్తుంది. ఈ విషయం తెలిసిన మహేంద్ర ఆనందంతో గెంతులేస్తాడు.
తెల్లారేసరికి రిషి బయటకు వెళ్తుంటాడు... ఫణీంద్ర ఆపి కాలేజీకి సంబంధించిన వివరాలు అడుగుతాడు. పనిలో పనిగా సాక్షి విషయం ప్రస్తావిస్తాడు ఫణీంద్ర. ఆ టాపిక్‌లో ఏం మాట్లాడలేనని చెప్పేసి వెళ్లిపోతాడు రిషి. ఇంతలో రిషి విషయం పట్టించుకోరా అని దేవయానికి మహేంద్రను అడుగుతుంది. మా మాట కంటే మీకే ఎక్కువ గౌరవిస్తాడని చెప్పి భారాన్ని ఆమెపైకి నెట్టేస్తాడు మహేంద్ర.
కాలేజీలో రిషి క్యాబిన్ సర్దుంటుంది వసుధార. మీకు సంబంధించిన ఏ వర్క్ చేయాలన్నా ఆనందమే అంటుంది వసుధార. నీ కంపెనీ కూడా నచ్చుతుంది మనసులో అనుకుంటాడు రిషి. ఇంతలో వసుధార కూడా సేమ్ డైలాగ్ చెప్తుంది. నేను కూడా హెల్ప్ చేస్తానంటూ లేస్తాడు. ఇంతలో ఫైల్స్ పడిపోతుంటే వసుధార పట్టుకుంటుంది. అదే టైంలో రిషి కూడా పట్టుకుంటాడు. ఇద్దరు ఒకే టైంలో ఫైల్స్ పట్టుకుంటారు. భలే క్యాచ్ చేశానంటూ మురిసిపోతుంది. వదులు కోవడం చాలా ఈజీ కానీ పట్టుకోవడం చాలా కష్టమంటాడు రిషి. పనులు సంగతి పక్కన పెడితే.. చదువు సంగతి ఏంటని అడుగుతాడు. ఎప్పుడు చదువు సంగతి మర్చిపోనని.. చెబుతుంది. ఇంతలో సాక్షి కాలేజీకి రావడాన్ని చూస్తాడు రిషి.
రేపటి ఎపిసోడ్
సాక్షి వచ్చిన సంగతి చూసి... వసుధారతో టూర్ ప్లాన్ చేస్తాడు. కాలేజీ నుంచి బయటకు వెళ్దామంటాడు. ఎక్కడికి అంటే... నా అయిష్టాన్ని దూరం చేసేందుకు హెల్ప్ చేయమంటాడు రిషి. మీ అయిష్టాన్ని దూరం చేయడానికి ఏమైనా చేస్తానంటుంది వసుధార.