ప్రేమలో మరింత దగ్గరవుతున్న రిషి వసుధార- సాక్షితో మరో డ్రామాకు తెర లేపిన దేవయాని
రిషి చేయి దాటిపోతున్నాడని గ్రహించిన దేవయాని, సాక్షి మరో డ్రామాకు తెరలేపుతారు. దేవయాని, సాక్షి మధ్య ఫైట్ క్రియేట్ చేసి హంగామా సృష్టిస్తారు. ఇవేమీ తెలియని రిషి మాత్రం వసుధారతో సరదాగా గడుపుతున్నాడు.
రిషికి నువ్వంటే ఇష్టం లేదని సాక్షికి చెబుతుంది దేవయాని. దానికి అంతా షాక్ అవుతారు. నువ్వంటే ఎవరికీ ఇష్టం లేదని... వాస్తవంలో జీవించమని సలహా ఇచ్చి రెచ్చొగొడుతుంది. ఏం చేసుకుంటావో చేసుకోమని అంటుంది. మొన్నటి వరకు నాకు సపోర్ట్ చేసినట్టే చేసి... ఇప్పుడు రివర్స్ అవుతున్నవేంటని దేవయానని సాక్షి ప్రశ్నిస్తుంది. రిషి మనుసులో నువ్వు లేనప్పుడు ఎలా సపోర్ట్ చేస్తానంటూ గదమాయిస్తుంది దేవయాని. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోమని... ఎవరి పరువు తీసుకుంటావో తీసుకోమని కీ ఇచ్చినట్టు రెచ్చగొడుతుంది. కేసు పెట్టి కోర్టుకు ఈడుస్తానంటూ హెచ్చరిస్తుంది సాక్షి. న్యాయం ఎవరివైపు ఉంటే వాళ్లే గెలుస్తారని అంటాడు మహేంద్ర. దేవయానికి కూడా అదే చెబుతుంది. ఇప్పుడు తామంతా ఒక్కటయ్యామని తమను నువ్వు ఏం చేయలేవని అంటుంది దేవయాని.
దీంతో రెచ్చిపోయిన సాక్షి... రెండు రోజుల్లో రిషి, సాక్షి పెళ్లి లగ్నపత్రిక ఇంటికి రాకపోతే మీ అందరి పేర్లు రాసి పెట్టి మీ ఇంట్లోనే విషం తాగి సూసైడ్ చేసుకుంటానని చెబుతుంది. మీ కుటుంబాన్ని నాశనం చేసే వరకు సాక్షి నిద్రపోదని హెచ్చరించి వెళ్లిపోతుంది సాక్షి.
కారు రిపేర్ కావడంతో రోడ్డుపై వసుధార, రిషి ఇబ్బంది పడుతుంటారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా తమ పిల్లలు చదువుకుంటున్నారని చెప్పి పరిచయం చేసుకుంటాడు. కారు రిపేర్ అయిందని గ్రహించి తన ఇంటికి ఇద్దర్నీ ఆహ్వానిస్తాడు. సరే అని మెకానిక్‌కు ఫోన్ చేసి వాళ్ల ఇంటికి వెళ్తారు.
ఇక్కడ సాక్షి ఇచ్చిన వార్నింగ్‌తో ఫ్యామిలీ టెన్షన్ పడుతుంది. దేవయాని కూడా కంగారుపడుతున్నట్టు కటింగ్ ఇస్తుంది. దీనిపై గౌతమ్‌కు అనుమానం వస్తుంది. అదే విషయాన్ని ధరణిని అడుగుతాడు. పెద్దమ్మది ఫెర్ఫార్మెన్సా... లేకా నిజంగా బాధ పడుతుందా అని డౌట్ పడతాడు. ఇన్నేళ్ల నుంచి నాకు అది తెలియకే ఇబ్బంది పడుతున్నాను అంటుంది ధరణి. ఇంతలో తనకు ఆరోగ్యం బాగాలేదని రిషికి ఫోన్ చేయమని గౌతమ్‌కు చెబుతుంది దేవయాని. అలాగే అని చెప్పి బయటకు వెళ్తాడు.
దేవయాని చేస్తున్న హడావుడిపై మొదటి నుంచి అనుమానం పడుతున్న జగతి... ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుందా అని మనసులో ప్రశ్నించుకుంటుంది. అదే టైంలో అసలు తాను వేస్తున్న స్కెచ్ ఎవరికీ అర్థం కావడం లేదు.. తెలిస్తే షాక్ అవుతారని దేవయాని తన మనసులో అనుకుంటుంది.
కారు చెడిపోవడంతో రిషి, వసుధార రైతు దామోదర్ ఇంటికి వెళ్తారు. అక్కడ అంతా తెలిసినట్టు మాట్లాడటంతో రిషి ఆశ్చర్యపోతాడు. ఎలా తెలుసు అంటే... మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా చదువు అందిస్తున్న మిమ్మల్ని ఎలా మర్చిపోతామంటారు వాళ్లంతా. అక్కడే భోజనం చేయమంటారు. సరే అంటాడు రిషి.
చీకటి పడుతుందీ... అక్కడ ఉన్న పిల్లలతో వసుధార మాట్లాడుతుంది. ఇంతలో కరెంటు పోతుంది. పక్కింట్లో కరెంటు ఉంది ఇక్కడ పోవడం ఏంటని ఆలోచిస్తుంది వసుధార. నేను చూస్తానంటూ వెళ్తుంది.
ఇక్కడ దేవయానికి దేని కోసమో ఆలోచిస్తుంది. ఇంతలో ధరణి కాఫీ తీసుకొస్తుంది. ఆమెపై ఇంత ఎత్తున లేస్తుంది దేవయాని. రిషి జీవితం ఏమైపోతుందో అని నేను కంగారు పడుతుంటే... నువ్వు కాఫీ టీలు అందిస్తావని నిలదీస్తుంది. అక్కడకు వచ్చిన జగతి.. అనవసరమైన విషయాల్లో ఎందుకు కంగారుపడుతున్నారని ప్రశ్నిస్తుంది. నా బాధ ఎవరికీ అర్థం కాదని... రిషికి మాత్రమే అర్థమవుతుందని ఫోన్ చేయబోతుంది.
తాము అతిథిగా వచ్చిన రైతు ఇంట్లో కరెంటు పోవడంతో దాన్ని రిపేర్ చేసే పనిలో వసుధార బిజీగా ఉంటుంది. ఇంతలో షాక్ కొట్టి రిషిపై పడుతుంది వసుధార. అలా ఉంటూ తన మనసులో మాట చెబుదామనే సరికి పిల్లలు వచ్చి మేడం ఏమైందని ప్రశ్నిస్తారు. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఫ్యూజ్ పెట్టేస్తుంది. కరెంట్ వచ్చాక భోజనాలకు వెళ్తారు. ఆ రాత్రికి అక్కడే ఉండిపోమని అంతా రిక్వస్ట్ చేస్తారు. సరే అని ఒప్పుకుంటా రిషి.
రిషి ఇచ్చిన వార్నింగ్, దేవయాని చేస్తున్న హాంగామాతో జగతి, మహేంద్ర, గౌతమ్‌కు అనుమానం వస్తుంది. ఇంత సడెన్‌గా సాక్షికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటారు.