అన్వేషించండి

Guppedanta Manasu Serial Today June 29th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: రంగాకు డెడ్ లైన ఇచ్చిన సరోజ తండ్రి – శైలేంద్ర పంపించిన రౌడీలను చితక్కొట్టిన మను

Guppedanta Manasu Today Episode: నువ్వు కాళ్లు కడిగి కన్యాదానం చేసిన సరోజను పెళ్లి చేసుకోనని రంగ, సంజీవయ్యతో చాలెంజ్ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: వసుధార వచ్చి శైలేంద్రకు ఎండీ అయ్యే అర్హత ఉందని చెబితేనే శైలేంద్రను ఎండీని చేస్తామని ఫణీంద్ర చెప్పడంతో ఇంతలో ధరణి వచ్చి వసుధార ఎప్పటికీ అలా చెప్పదని అంటుంది. దీంతో దేవయాని, ధరణిని తిడుతుంది. నువ్వు హద్దులో ఉండు అని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో ఫణీంద్ర దేవయానిని తిడతాడు. వీళ్లు ఎప్పటికీ మారరని నువ్వు వెళ్లి పని చూసుకోమని ధరణికి చెప్పి తాను వెళ్లిపోతాడు ఫణీంద్ర. మరోవైపు రంగ తాను దాచుకున్న డబ్బులు లెక్కిస్తుంటాడు.

రాధమ్మ: ఏం నాన్నా మీ మామయ్యకు ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు లెక్కిస్తున్నావా?

రంగ: అవును నాన్నమ్మా ఏది జరిగినా ఏది జరగకపోయినా ఆయన మాత్రం నెల కాగానే వడ్డీ డబ్బుల కోసం వస్తాడుగా? అందుకే ముందే లెక్కలేసి పెట్టుకుంటున్నా

రాధమ్మ: ఏంటోరా ఆ సరోజేమో నిన్నే పెళ్లి చేసుకుంటానని నీ వెంట తిరుగుతుంటే వాళ్ల నాన్నమే డబ్బుల కోసం తిరుగుతుంటాడు.

సంజీవయ్య: ఏరా లెక్క సరిపోయిందా?

రంగ: రండి మామయ్య.. కూర్చోండి.

సంజీవయ్య: మర్యాదలొద్దులేరా కాస్త డబ్బులిస్తే చాలు

రంగ: లెక్క పెట్టుకోండి మామయ్య.

సంజీవయ్య: నువ్వు ఇచ్చేది తక్కువైనా నీ లెక్క సరిగ్గా ఉంటుందిలేరా?

 అంటూనే వెటకారంగా డబ్బులు లెక్కపెడతాడు. తర్వాత ఇక ఎప్పుడూ వడ్డీలు కడుతూనే ఉంటావా? అని సంజీవయ్య అడగ్గానే త్వరలోనే అసలు కూడా కడతానులే మామ అంటాడు రంగ. ఇంతలో రాధమ్మ సరోజ పెళ్లి గురించి అడుగుతుంది. రంగాతో సరోజ పెళ్లి చేద్దామని చెప్తుంది. దీంతో సంజీవ కోపంగా అప్పు కట్టలేక పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? అనగానే మీకు మీరే నా కాళ్లు కడిగి పెళ్లి చేస్తానన్నా నేను పెళ్లి చేసుకోనని రంగ చెప్తాడు. ఇంతలో వసుధార రాగానే మీకే తిండికి గతి లేదంటే ఇంకొకరిని ఉద్దరిస్తారా? అని వెటకారంగా మాట్లాడి వెళ్లిపోతాడు. మరోవైపు మహేంద్ర జగతి ఫోటో దగ్గర నిలబడి బాధపడుతుంటాడు. నేను కూడా చనిపోతానని తల గోడకేసి కొట్టుకుంటాడు. మను, అనుపమ వచ్చి ఆపుతారు.

మను: ఏమైంది సార్‌ చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఇంత బాధ

మహేంద్ర: ఎందుకింత బాధ అంటావేంటి మను. బ్రతుకంతా బాధే కదా? నువ్వు చెప్పు నాలో ఏరోజైనా సంతోషం కనిపించిందా? పోనీ ఈ మధ్య కాలంలో నేను నవ్వడం ఎప్పుడైనా చూశావా? లేదు కదా? ఇంకెందుకు మను ఈ జన్మ.

మను: సర్‌ బాధలు అందరికీ ఉంటాయి. అలాగని బతుకును దూరం చేసుకోకూడదు కదా?

 

ALSO READ: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్పై స్పందిస్తూ సెటైరికల్కామెంట్స్

 

మహేంద్ర: నిజమే మను బాధలు అందరికీ ఉంటాయి. కానీ ఎవరి బాధ వారిదే కదా? నీ బాధ ఈరోజు కాకపోయినా రేపు తీరుతుంది. మీ అమ్మా నోరు విప్పితే నీ బాధ తీరిపోతుంది. నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కానీ నేను ఏం చేసినా నా జగతి తిరగిరాదు కదా?   ఈ బాధలు తీరేవేనా? అందరూ నాకు దూరం అయిపోయాక ఇక నేను ఎవరి కోసం బతకాలి.

అనుపమ: అలా అనొద్దు మహేంద్ర. అందరూ దూరం అయ్యారని నువ్వు అనుకుంటే సరిపోదు. నీకోసం ఎదురుచూసేవాళ్లు, నీ ప్రేమ పొందాల్సిన వాళ్లు ఇంకా ఉన్నారు.

మహేంద్ర: లేరు అనుపమ.. ఎవ్వరూ లేరు.

అనుపమ: ఉంటారు మహేంద్ర, కాలం కలిసొచ్చిన రోజు ఆ దేవుడు వాళ్లను నీ దగ్గరకు పంపిస్తాడు. ఆ దేవుడే మిమ్మల్ని కలుపుతాడు.

మహేంద్ర: వద్దు అనుపమ నా జీవితంలో నాకు దూరం అయిపోయే వాళ్లే తప్పా కొత్తగా వచ్చే వాళ్లు ఎవ్వరూ లేరు.

మను: సార్‌ ఏంటా మాటలు..

అనగానే మహేంద్ర మీరిద్దరూ కూడా నాకు దూరంగా వెళ్లిపోండి. లేదంటే నా దురదృష్టం మీకు అంటుకుంటుంది అంటాడు మహేంద్ర. ఇలాంటివన్నీ నమ్ముతారా అటూ మను ప్రశ్నిస్తాడు. ఎందుకు నమ్మలేము మీ అమ్మా ఒక ఫ్రెండ్‌గా నా జీవితంలోకి వచ్చింది కానీ ఎన్ని బాధలు పడుతుంది అందుకే మీరు కూడా వెళ్లిపోండి అంటాడు మహేంద్ర. తర్వాత మను వెళ్తుంటే రౌడీలు అడ్డగించి చంపబోతే వాళ్లను చితక్కొడతాడు మను. నా మీద ఎందుకు దాడి చేశారని మను రౌడీలను అడగ్గానే శైలేంద్ర నిన్ను చంపమని సుపారి ఇచ్చాడని చెప్పి రౌడీలు పారిపోతారు. మరోవైపు రౌడీలు ఈపాటికే మను గాన్ని చంపి ఉంటారని శైలేంద్ర హ్యాపీగా ఫీలవుతుంటాడు. ఇంతలో మను అక్కడకు వస్తాడు. మనును చూసిన శైలేంద్ర షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today March 11th:  మాధవ్‌పై దాడిచేశారనగానే తెలియగానే తమ్ముళ్లు ఏం చేశారు..? చక్రి అన్నదమ్ములను అరెస్ట్ చేయడానికి కారణమేంటి..? 
పొదరిల్లు: మాధవ్‌పై దాడిచేశారనగానే తెలియగానే తమ్ముళ్లు ఏం చేశారు..? చక్రి అన్నదమ్ములను అరెస్ట్ చేయడానికి కారణమేంటి..? 
Nindu Manasulu Serial Today March11th:హోలీ సంబరాలకు వచ్చి గొడవ పెట్టుకున్న గణ...ప్రేరణకు  తన ప్రేమ విషయం సిద్ధూ చెప్పాడా..? లేదా...?
నిండుమనసులు: హోలీ సంబరాలకు వచ్చి గొడవ పెట్టుకున్న గణ...ప్రేరణకు  తన ప్రేమ విషయం సిద్ధూ చెప్పాడా..? లేదా...?
Gunde Ninda Gudi Gantalu March 11th Episode: మీనా విశ్వరూపం, ఆ నవ్వు వెనుక రహస్యం, పార్లలమ్మకు షాక్ ఇచ్చిన బాలు - గుండెనిండా గుడిగంటలు మార్చి 11 ఎపిసోడ్
మీనా విశ్వరూపం, ఆ నవ్వు వెనుక రహస్యం, పార్లలమ్మకు షాక్ ఇచ్చిన బాలు - గుండెనిండా గుడిగంటలు మార్చి 11 ఎపిసోడ్
Nindu Noorella Saavasam Serial Today march 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మోడ్రన్‌ డ్రెస్‌లో మనోహరి – చూసి షాకైన రాథోడ్‌  
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మోడ్రన్‌ డ్రెస్‌లో మనోహరి – చూసి షాకైన రాథోడ్‌  

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
Kerala Assembly Elections 2026: కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
కేరళ కాంగ్రెస్‌లో సీఎం సెగ - వేణుగోపాల్ రాకతో ముదురుతున్న గ్రూపు రాజకీయాలు!
Telangana Politics: బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
బీఆర్ఎస్‌ను మించి గ్రౌండ్ పాలిటిక్స్‌లో కవిత దూకుడు - క్యాడర్, లీడర్‌ను ఆకర్షిస్తారా?
Rajendra Prasad : మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్ - స్టేజ్‌పై అలా మాట్లాడతారా అంటూ...
Andhra Pradesh alliance Politics: ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
ఏపీలో కూటమి గడబిడ - పైస్థాయిలో బాండింగ్ సరే - నియోజకవర్గ నేతల మధ్య ఆధిపత్యపోరు సంగతేంటి?
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
MG Comet నుంచి Gloster వరకు - రూ.60 వేల నుంచి రూ.4 లక్షల వరకు స్పెషల్‌ డిస్కౌంట్స్‌
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Embed widget