అన్వేషించండి

Guppedanta Manasu Serial Today June 28th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: సరోజనే పెళ్లి చేసుకోమని రంగాకు చెప్పిన వసు – శైలేంద్రకు షాకిచ్చిన ధరణి

Guppedanta Manasu Today Episode: సరోజ నిన్ను చాలా ప్రేమిస్తుందని ఆమెనే నువ్వు పెళ్లి చేసుకోమ్మని వసుధార, రంగకు చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode:  వసుధారను రాధమ్మ మందలిస్తుంది ఇంకోసారి అలా వెళ్లోద్దని చెప్తుంది. ఎందుకు వెళ్లావని అడగ్గానే వసుధార బాధపడుతుంది. రిషి సార్‌ ఎవరు? అసలు నువ్వు ఎవరు? అని అడగ్గానే తన గురించి మొత్తం చెప్తుంది వసుధార. రిషి గురించి చాలా గొప్పగా చెప్తుంది. వసుధార కథ విన్న అందరూ బాధపడతారు. మరి రిషి సార్‌ ఎలా దూరమయ్యారని అడగ్గానే శైలేంద్ర వల్ల రిషి సర్‌ దూరమయ్యాడని చెప్తుంది.  దీంతో రంగ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

సరోజ: బావేంటి? కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. నిజంగా బావే రిషి సారా? ( అని మనసులో అనుకుంటుంది. )

వసుధార: సర్‌ ఇప్పటికైనా ఒప్పుకుంటారా? మీరు రిషి సార్‌ అని

రంగ: ఆదేంటండి అలా అంటారు. నేను రంగాని కదా? రిషి సార్‌ అని ఎలా అంటారు.

వసుధార: మరెందుకు సార్‌ నేను చెప్తుంటే మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు.

రంగ: కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన ఒప్పుకున్నట్టా ఏంటి? మీరు చెప్తున్న కథ సినిమా కథలా ఉంది. చాలా ఎమోషనల్‌గా ఉంది. అందుకే తెలియకుండా కన్నీళ్లు వచ్చాయి. అంతమాత్రాన నేను నేను కాకుండా మారిపోతానా?

అని చెప్పగానే మీరు నా రిషి సార్‌ కాదా? అని వసుధార మనసులో అనుకుంటుంది. సరోజ కూడా ఇది చెప్పినట్టు 15 రోజుల్లో నా బావను రిషి సర్‌లా మార్చేలా ఉన్నట్టుంది అని మనసులో అనుకుంటుంది. రాధమ్మ, వసుధారను ఓదారుస్తుంది. నీ భర్త నీకు త్వరగా దొరుకుతాడని చెప్తుంది. మరోవైపు అనుపమ, ఎంజేల్‌ మాట్లాడుకుంటుంటారు.

ఎంజేల్‌: చెప్పండత్తయ్యా ఏదో చెప్పాలన్నారు.

అనుపమ: మను గురించి మాట్లాడాలి. కొన్ని విషయాలు నీతో చెప్పాలనుకుంటున్నాను. నా కొడుకు అని కాదు కానీ మను లాంటి క్యారెక్టర్‌ ఉన్నవాళ్లు చాలా రేర్‌గా ఉంటారు.

ఎంజేల్‌: ఈ విషయం నాకు తెలుసు అత్తయ్యా.. నాకే కాదు మను గురించి తెలిసిన వాళ్లందరికీ తెలుసు. పది మంది మంచి కోరుకుంటాడు. బావ మీద నాకు చాలా పాజిటివ్‌ ఒపినియన్‌ ఉంది.

    అని చెప్పగానే అనుపమ నువ్వు వాడి గతం గురించి ఆలోచించకు. నువ్వు వాడి మనసులో ఉన్నావు కాబట్టే నువ్వు ఎంత అల్లరి చేసినా భరిస్తున్నాడు. నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తున్నాడు. అందుకే బంధాలు బలపడాలంటే గతం గురించి పట్టించుకోవద్దు. ఇద్దరూ హ్యాపీగా ఉండండి అని చెప్తుంది అనుపమ. మరోవైపు రంగ ఏదో పని చేస్తుంటే సరోజ వచ్చి రొమాంటిక్‌గా చూస్తుంది. రంగ కోప్పడతాడు. సరోజ మాత్రం ఏరోజుకైనా నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వే నా మొగుడివి అంటుంది. ఇంతలో వసుధార వస్తుంది.

రంగ: చెప్పండి మేడం ఏం కావాలి?

వసుధార: ఏం లేదు... నిజంగానే మీరు సరోజ బావా?

సరోజ: బావా సైలెంట్‌గా ఉన్నావేంటి? చెప్పు

రంగ: అవును తన బావనే..

వసుధార: ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. మరి మీరు తనని పెళ్లి చేసుకోవచ్చు కదా? చెప్పండి సర్‌ ఎందుకు ఆ అమ్మాయిని దూరం పెడుతున్నారు.

ALSO READ: తెల్ల చీరలో దేవకన్యలా ఉన్న 'పొన్నియన్ సెల్వన్ ' బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి!

రంగ: నా అభిప్రాయం నాకు ఉంటుంది కదా మేడం.

  అని రంగ చెప్పగానే ఆ అమ్మాయి అయితే మీకు ఇష్టం లేదా? అని వసుధార అడగ్గానే ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడొద్దని సరోజకు నాకంటే మంచి వాడే దొరుకుతాడని చెప్తాడు. దీంతో సరోజ బాధపడుతుంది. నిన్ను తప్ప వేరే వాళ్లను పెళ్లి చేసుకోనని అంటుంది. వసుధారను తిడుతుంది. దీంతో వసుధార నిన్ను పెళ్లి చేసుకోను అంటున్నాడు అంటే తనకు ఇంతకుముందే పెళ్లి అయిందని తను నా రిషి సార్‌ అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు దేవయాని, ఫణీంద్రతో అందరి ముందు శైలేంద్రను తిట్టొద్దని చెప్తుంది.. దీంతో మళ్లీ ఫణీంద్ర ఇద్దరిని తిడతాడు. వసుధార వచ్చి శైలేంద్రకు ఎండీ అయ్యే అర్హత ఉందని చెబితే  వెంటనే  శైలేంద్రను ఎండీని చేస్తాము అంటాడు. ఇంతలో ధరణి వచ్చి వసుధార ఎప్పటికీ అలా చెప్పదని అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today JULY 27th:పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
జగద్ధాత్రి సీరియల్: పని అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి హత్య చేసిన హెల్త్‌ మినిస్టర్‌ కొడుకు...నిజం తెలుసుకున్న జేడీ
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదే! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదా! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
Godavari Serial Today July 27th: 'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
'గోదావరి' సీరియల్: రేయ్ సింహాద్రి తోట వదిలే ప్రసక్తే లేదు..! సూర్యకి షాక్‌ ఇచ్చిన భువన, సింహాద్రి! ఇంట్లో వాళ్లకి జాను చెప్పిన నిజమేంటి?
Nindu Manasulu Serial Today July 27th: నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?
నిండు మనసులు: సిద్ధూ వర్సెస్ ఎమ్మెల్యే కొడుకు! చేయి విరిచేసిన సిద్ధూ.. గణ మర్యాదకి కారణమేంటి?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Embed widget