Guppedanta Manasu July 15th : మహేంద్రని డాడ్ అని పిలిచిన రిషి, గతం గురించి రిషిని నిలదీసిన ఏంజెల్-విశ్వం!
Guppedantha Manasu July 15th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి ఇంట్లోంచి వెళ్లిపోయిన తర్వాత ఇన్నేళ్లకు జగతి రిషిని కలుసుకుంది. ఆ ప్రోమో ఇది...
గుప్పెడంతమనసు జూలై 15 ఎపిసోడ్ (Guppedanta Manasu July 15th Written Update)
సెమినార్ బాగా జరిగిందని విశ్వనాథం, ఏంజెల్ పొగుడుతారు. గతంలో ఎక్కడైనా సెమినార్ ఇచ్చావా అని విశ్వనాథం అడిగితే రిషి ఇబ్బంది పడతాడు. ఈ లోగా ఏంజెల్ ఇన్వాల్వ్ అయి ఎక్కడా వర్క్ చేసి ఉండడులే విశ్వం... మనం చాలా బతిమలాడితే కానీ ఇక్కడ కాలేజీకి వెళ్లలేదు గతంలో ఎక్కడా వర్క్ చేసి ఉండడులే అంటుంది. సన్మానం చేసినప్పుడు జగతి వాళ్లు ఇచ్చిన బొకే అక్కడినుంచి తీసేయమని రిషి అంటే దీంతో మనం సెల్ఫీ తీసుకుందాం అని తీస్తుంది ఏంజెల్.
దేవయాని-శైలేంద్ర
మరోవైపు ఇంటికెళ్లిన శైలేంద్ర..రిషి బతికి ఉన్న విషయం నుంచి అక్కడ కాలేజీ తాను చూసింది, జరిగినది మొత్తం చెబుతాడు. దేవయాని షాక్ అవుతుంది. చంపేశాను అన్నావ్ కదా అని దేవయాని అడిగితే నేను కూడా అదే అనుకున్నా కానీ చాలాసేపు అక్కడే ఉండి రిషి అని కన్ఫామ్ చేసుకుని వచ్చానంటాడు. రిషిని చంపేద్దాం అని శైలేంద్ర అంటే..ఆలోచించి అడుగేయాలి..గోటితో పోయేది గోటితో సరిచేయాలి, గొడ్డలితో పోయేదాన్ని గొడ్డలితో సరిచేయాలి అయినా ఈవిషయం నాకు అక్కడి నుంచే కాల్ చేయాలి కదా అని ఫైర్ అవుతుంది. సరే మళ్లీ వెంటనే అక్కడకు వెళ్లు..సెమినార్ అయిపోయిన తర్వాత కూడా మహేంద్ర-జగతి ఇంకా రాలేదు కదా...ఇంతవరకూ ఏం చేశావో పక్కన పెట్టు ఇకపై వేసే ప్రతి అడుగు జాగ్రత్త. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు..ఏం చేయాలి అనుకున్నా నాకు చెప్పే చేయాలి. వాళ్లని గమనిస్తున్నావని అనుమానం రాకుండా చూసుకో..మీ నాన్నకి-ధరణికి అనుమానం రాకుండా నేను చూసుకుంటానంటుంది దేవయాని.
Also Read: రిషిధారకి దిష్టి తీసిన ఏంజెల్ - ఆడపులి జగతి కొత్త ప్లాన్ సక్సెస్ అవుతుందా!
ఇంట్లో అరెంజ్స్ మెంట్స్ చేస్తున్న ఏంజెల్ కి సాయం చేస్తుంది వసుధార. ఇంతకీ ఇక్కడకు వచ్చే గెస్టులెవరని అడుగుతుంది. సర్ ప్రైజ్ అని రిప్లై ఇచ్చిన ఏంజెల్..మీరంతా ఒకే గూటి పక్షులు వసుధార అని క్లూ ఇస్తుంది. వసు ఆలోచనలో పడుతుంది. మరోవైపు రిషి కూడా తండ్రి మాటలు గుర్తుచేసుకుని రిషి ఆలోచనలో ఉంటాడు. ఈలోగా విశ్వనాథం రిషిని పిలిచి ఏం ఆలోచిస్తున్నావని అడిగి...ఈ రోజు మన ఇంటికి గెస్టులు వస్తున్నారని చెబుతాడు. ఎవరని రిషి అడిగేసరికి జగతి-మహేంద్ర బయట కారు దిగుతారు.
మహేంద్ర: రిషి ఏమీ అనుకోకు నువ్వు మనసులో ఏదో ఊహించుకుని బాధపడకు కంగారు పడకు అని ధైర్యం చెబుతాడు
బయటకు వచ్చిన రిషి వాళ్లని చూసి అలాగే ఆగిపోతాడు
విశ్వనాథం: వీళ్లు రెండు మూడు రోజులు సిటీలో ఉంటామన్నారు అందుకే ఎక్కడో ఉండడం ఎందుకు ఇక్కడే ఉండమని చెప్పి రమ్మన్నాను. నీకు గురువులతో సమానం అన్నావు కదా నీకు కావాల్సిన వాళ్లంటే నాక్కూడా కావాల్సిన వాళ్లేగా
రిషి: సరే సార్ అని ముభావంగా చూస్తుండిపోతాడు రిషి.
లోపలకు వెళ్లిన తర్వాత కూడా రిషి అలా నిల్చునే ఉంటాడు. ఏంటి ఇబ్బందిగా ఉందా కూర్చో అన్న విశ్వనాథం... గెస్టులు వచ్చారు ఏంజెల్ అని పిలుస్తాడు. హాల్లోకి వెళ్లిన వసుధారని చూసి జగతి-మహేంద్ర షాక్ అవుతారు. వసు కూడా ఇక్కడే ఉందా అనుకుంటారు. నువ్వు కూర్చో నేను వెళ్లి జ్యూస్ తీసుకొస్తా అనేసి వెళ్లిపోతుంది ఏంజెల్. నువ్వు కూడా కూర్చోమ్మా అంటాడు విశ్వనాథం.
ఏంజెల్: నీ ఆత్మీయులను చాలా రోజుల తర్వాత కలిశావు కదా ఎలా ఉంది. ( రిషి మౌనంగా ఉండడం చూసి) నీ ఆత్మీయులతో కూడా కలుపుగోలుగా ఉండవా..ఏదైనా దాస్తున్నావా
మహేంద్ర: అదేం లేదమ్మా రిషి ముందు నుంచీ అంతే..ఎవరితో ఎంతవరకో అంతవరకే ఉంటాడు. ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేస్తాడు.
విశ్వనాథం: అవునండీ..అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు, అవసరమైన సాయం చేస్తాడు..
మహేంద్ర: నాకు పరిచయం అయినప్పటి నుంచీ చూస్తున్నాను..తనకంటే తనచుట్టూ ఉన్నవాళ్ల గురించే ఆలోచిస్తాడు
విశ్వనాథం: రిషిని కన్నవాళ్లు చాలా అదృష్టం వంతులు..అందుకే గొప్ప లక్షణాలున్న వ్యక్తిని కొడుకుగా పొందారు
జగతి: నిజంగా అదృష్టవంతులమే కానీ కాలం ఆడిన ఆటవల్ల నా బిడ్డ ముందు పరాయివాళ్లలా ఉండిపోయాం
ఏంజెల్: వసుధార మా ఇంట్లో ఉందేంటని చూస్తున్నారా అని జగతిని ఉద్దేశించి అన్న ఏంజెల్..చిన్న యాక్సిడెంట్ అయింది అందుకే ఇక్కడ ఉంటోంది
జగతి కంగారుగా లేవబోతుంటే మహేంద్ర కంట్రోల్ చేస్తాడు...
విశ్వనాథం: తన ఆరోగ్యం బాగాలేకపోయినా వర్క్ విషయంలో తగ్గలేదు..రిషితో కలసి వర్క్ చేసిందని చెప్పి కాల్ వస్తే వెళ్లిపోతూ రూమ్స్ చూపించమని ఏంజెల్ కి చెబుతాడు
Also Read: జూలై 15 రాశిఫలాలు, ఈ 5 రాశులవారికి ఈరోజు అదృష్టమే అదృష్టం
రిషి నీ రూమ్ ఎక్కడని మహేంద్ర అడిగితే..రండి డాడ్ చూపిస్తానంటాడు..ఆ మాట విన్న ఏంజెల్ షాక్ అయి నిలదీస్తుంది... అందరూ కాసేపు మౌనంగా ఉండిపోతారు. నేను డాడ్ అనలేదని మాట మార్చేస్తాడు రిషి.. మహేంద్ర, జగతి, వసు అందరూ రిషిని సమర్థిస్తాడు. నాకేమైనా వినిపించని సమస్య వచ్చిందా ..ENT డాక్టర్ దగ్గరకు వెళ్లాలా అని గలగలా మాట్లాడేస్తుంటుంది. అందరూ సైలెంట్ గా ఉండిపోతారు...
ఎపిసోడ్ ముగిసింది...